నెల్లూరు జిల్లా : పెన్నా నది బ్యారేజీ వద్ద తప్పిన భారీ ప్రమాదం - అసలేం జరిగిందంటే...?

నెల్లూరు జిల్లాలోని సంగం పెన్నా నది బ్యారేజీ వద్ద భారీ ప్రమాదం తప్పింది. ఇసుక సేకరణకు ఉపయోగించే మూడు పడవలు వరద ప్రవాహంలో కొట్టుకువచ్చి బ్యారేజీ వైపు దూసుకువెళ్లాయి. అయితే వాటిని ఎన్డీఆర్ఎఫ్ బృందం సమయానికి నియంత్రించడంతో  పెను ప్రమాదం తప్పినట్లు అయింది.

Published on: Oct 30, 2025, 13:52:23 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సంగం పెన్నా నది బ్యారేజి వద్ద భారీ ప్రమాదం తప్పింది. ఇసుక సేకరణకు ఉపయోగించే మూడు పడవలు వరద ప్రవాహంలో కొట్టుకువచ్చి బ్యారేజి వైపు దూసుకువెళ్లాయి. అయితే వాటిని ఎన్డీఆర్ఎఫ్ బృందం సమయానికి నియంత్రించడం వల్ల పెనుప్రమాదం తప్పింది.

పెన్నా నది బ్యారేజి వద్ద తప్పిన భారీ ప్రమాదం
పెన్నా నది బ్యారేజి వద్ద తప్పిన భారీ ప్రమాదం

జిల్లా కలెక్టర్‌ హిమాంశు శుక్లా, ఎస్పీ అజిత వేజెండ్లతో పాటు ఇతర అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పర్యవేక్షిస్తూ ప్రమాదాన్ని తప్పించారు. ఎన్డీఆర్ఎఫ్ బృందం కొట్టుకువచ్చిన పడవలను నియంత్రించకపోతే బ్యారేజి వద్ద భారీ విధ్వంసం జరిగి ఉండేది. లోతట్టు ప్రాంతాలు భారీ ముంపునకు గురైయ్యేవి. ఈ సంఘటనతో మరోసారి అందరికీ 2024 బుడమేరు వరదల్లో ప్రకాశం బ్యారేజీ ఘటన గుర్తుకొచ్చింది.

అసలు ఎం జరిగిందంటే ?

వరద ఉద్ధృతికి వంతెన రైలింగుకు కట్టేసిన పడవల తాళ్లు తెగిపోయాయి. దీంతో ఆ పడవలు ఆనకట్ట వైపు వేగంగా కొట్టుకువచ్చాయి. వాటిలో ఒక పడవను ఇసుక రేవు ప్రాంతానికి, మరొకదాన్ని కనిగిరి జలాశయం ప్రధాన రెగ్యులేటర్‌ వద్దకు చేర్చగలిగారు.

మరో పడవ మాత్రం బ్యారేజీ ఎగువన సుమారు 400 మీటర్ల దూరంలో ఉన్న పాత ఆనకట్ట క్రెస్ట్ వద్ద నిలిచిపోయింది. ఒక వేళ ఆ బోట్లు అంతే వేగంగా వచ్చి సంఘం బ్యారేజీ గేట్లను ఢీ కొట్టి ఉంటే విధ్వంసం జరిగి ఉండేది.

బోటు బరువు 35 టన్నులు ఉండడంతో బయటికి తరలించేందుకు ఇబ్బందులు పడ్డారు. బోటును బయటికి తీసేందుకు NDRF స్విమ్మర్స్ మరియు బృందం సభ్యలు సూమారు 12 గంటల పాటు శ్రమించి మూడు భారీ బోట్లు, తాళ్ళ సహాయంతో బోటును రెండు వైపుల కట్టి లంగర్ తో లాక్ చేశారు. దీంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ క్లిష్టతరమైన సాహసానికి ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని కలెక్టర్ అభినందించారు.

పెరుగుతున్న కృష్ణానది వరద ప్రవాహం….

మరోవైపు భారీ వర్షాలకు కృష్ణా నది వరద ప్రవాహం పెరుగుతోంది. పులిచింతల, ప్రకాశం బ్యారేజి వద్ద దిగవకు వరద నీటిని విడుదల చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజీ వద్ద ప్రస్తుతానికి ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 2.74 లక్షల క్యూసెక్కులుగా ఉంది. ప్రకాశం బ్యారేజి వద్ద సాయంత్రానికి మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. లంక గ్రామ ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని… లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. నదిలో ప్రయాణం, ఈతకు వెళ్ళడం, చేపలు పట్టడం లాంటివి చేయరాదని స్పష్టం చేశారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More