ఏపీలో మరో అంతర్జాతీయ విమానాశ్రయం - తొలి విమానం ల్యాండింగ్‌ కు ముహుర్తం ఫిక్స్..!

ఏపీలో నిర్మిస్తున్న భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ పనులు దాదాపు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో జనవరి 4వ తేదీన తొలి కమర్షియల్ ఫ్లైట్ ట్రయల్ రన్ నిర్వహించనున్నారు. ఇందుకోసం ఏర్పాట్లు సిద్ధమవుతున్నాయి.

Published on: Jan 1, 2026, 17:46:19 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

విజయనగరం జిల్లాలో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నిర్మాణం దాదాపు పూర్తయింది. దీంతో 2026 జనవరి 4న తొలి కమర్షియల్ ఫ్లైట్ ట్రయల్ రన్‌ జరుగుతోంది. ఇందులో భాగంగా ఢిల్లీ నుంచి ఎయిర్ ఇండియా విమానం 11 గంటలకు భోగాపురం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటుంది. ఈ విమానంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సహా పలువురు అధికారులు ప్రయాణించనున్నారు.

భోగాపురం ఎయిర్ పోర్ట్ (image source TDP X account)
భోగాపురం ఎయిర్ పోర్ట్ (image source TDP X account)

భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభంతో ఉత్తరాంధ్ర ప్రాంతానికి అంతర్జాతీయ అనుసంధానం మెరుగుపడనుంది. ఫలితంగా పెట్టుబడులు, పర్యాటకం, ఉపాధి అవకాశాలు గణనీయంగా పెరగనున్నాయి. రాష్ట్రాభివృద్ధిలో ఇదోక కీలక పరిణామంగా మారే అవకాశం కూడా ఉంటుంది. రాష్ట్రాభివృద్ధిలో భోగాపురం ఒక మైలురాయిగా నిలవబోతుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.

మరోవైపు భోగాపురం ఎయిర్ పోర్ట్ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. రన్‌వే, టెర్మినల్‌ భవనాలు, ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్, భద్రతా వ్యవస్థ తదితర కీలక మౌలిక సదుపాయాల కల్పన పనులు తుది దశకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలోనే… ఈనెల 4వ తేదీన తొలి కమర్షియల్ ఫ్లైట్ ట్రయల్ రన్‌ జరుగబోతుంది. ఇందుకోసం విమానాయనశాఖ అధికారులు ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు.

భోగాపురం విమానాశ్రయం నిర్మాణాన్ని రెండు దశల్లో పూర్తి చేయనున్నారు. మెుదటి దశలో రూ.4,592 కోట్ల వ్యయంతో 22 ఏరో బ్రిడ్జ్‌లు, 81,000 చదరపు మీటర్ల టెర్మినల్‌ బిల్డింగ్‌ నిర్మిస్తారు. 2203 ఎకరాల్లో విమనాశ్రయం విస్తీర్ణం పూర్తి చేస్తారు. ఇతర అవసరాలకు కూడా ప్రభుత్వం మరో 500 ఎకరాలను కేటాయించింది. ఒక్కొటి 3.8 కిలో మీటర్ల పొడవుతో రెండు రన్ వేలు నిర్మిస్తున్నారు. రెండో దశ పనులు తర్వాత జరగనున్నాయి.

2026 మే నెల నుంచే విమాన రాకపోకలు సాగించేలా ఇక్కడ పనులు జరుగుతున్నాయి. అందులో భాగంగానే జనవరిలో టెస్టింగ్‌ ఫ్లైట్‌ ఎగరనుంది. ఈ ఎయిర్ పోర్ట్ నిర్మాణ పనులపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిలో ఈ ప్రాజెక్ట్ ఎంతో కీలకం కాబోతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More