శ్రీశైలంలో ఏఐ ఆధారిత దర్శన వ్యవస్థ.. 45 నిమిషాల్లోపు భక్తులకు మల్లన్న దర్శనం!

శ్రీశైలంలో ఏఐ ఆధారిత దర్శన వ్యవస్థ తీసుకురానున్నారు. దీనిద్వారా కేవలం 45 నిమిషాల్లోపు భక్తులు మల్లన్నను దర్శించుకుంటారు.

Published on: Jun 30, 2026, 15:01:51 IST
By , Srisailam
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

భక్తులకు 45 నిమిషాలలోపు శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనం లభించేలా చూసేందుకు, శ్రీశైలం ఆలయ యంత్రాంగం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) ఆధారిత దర్శన నిర్వహణ వ్యవస్థను ప్రవేశపెట్టనుంది. వరల్డ్ క్లాస్ క్యూ-లైన్ల సముదాయాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తోంది.

శ్రీశైలం
శ్రీశైలం

ఈ ప్రాజెక్టులో ప్రధాన ఆకర్షణ, తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) వ్యవస్థను పోలిన అత్యాధునిక క్యూ కాంప్లెక్స్. ఇది జనసమూహ నిర్వహణలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చి, యాత్రా అనుభవాన్ని మెరుగుపరుస్తుందని ఆలయ అధికారులు భావిస్తున్నారు. ఈ సదుపాయంలో ఆధునిక సౌకర్యాలు, క్రమబద్ధమైన ఎంట్రీ, ఎగ్జిట్ మార్గాలు, అధునాతన నిఘా, వేయింటింగ్ హాళ్లు, యాత్రికుల కదలికలను నియంత్రించడానికి ఏఐ ఆధారిత పర్యవేక్షణ వంటివి ఉంటాయి.

రూ. 145 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న ఈ కాంప్లెక్స్ కోసం ప్రాథమిక సర్వే పూర్తయిందని అధికారులు చెబుతున్నారు. ఆగస్టు నాటికి టెండర్ ప్రక్రియను పూర్తి చేసి, శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కొత్త వ్యవస్థ ఏకరూప ప్రవేశ, నిష్క్రమణ మార్గాలను ప్రవేశపెట్టి, అనధికార ప్రవేశాన్ని తొలగించి, పారదర్శకతను నిర్ధారిస్తుంది.

ప్రాజెక్టు 18 నెలల్లో పూర్తి అవుతుందని అంచనా వేస్తున్నారు. ఆ తర్వాత ఏఐ ఆధారిత దర్శన వ్యవస్థను అమలు చేస్తారు. క్యూలో చేరిన భక్తుడు 45 నిమిషాల్లో దర్శనం పూర్తి చేసుకుని బయటకు వెళ్తారు. ఈ మొత్తం వ్యవస్థ ప్రశాంతమైన, నిరాటంకమైన రాకపోకల కోసం ఉంటుంది.

ప్రస్తుతం భక్తులు క్యూలలో రెండు నుండి మూడు గంటల సమయం ఉండాల్సి వస్తుంది. సాధారణ రోజులలో గంటకు సుమారు 6,000 మంది భక్తులు, పండుగల సమయంలో దాదాపు 8,600 మంది భక్తులు దర్శనమిస్తారు. కొత్త విధానం ద్వారా, నిరీక్షణ సమయాన్ని తగ్గిస్తూ, గంటకు 7,000 మంది భక్తుల నిరంతర ప్రవాహాన్ని కొనసాగించాలని అధికారులు ఆశిస్తున్నారు.

శని, ఆది, సోమవారాలు వంటి రద్దీ ఎక్కువగా ఉండే రోజుల్లో ఉదయం 5:30 నుంచి 8:30 గంటల మధ్య కనీసం 20,000 మంది సాధారణ భక్తులకు దర్శనం కల్పించే లక్ష్యంతో, స్పర్శ దర్శనంలో మార్పులను కూడా చేస్తారు. ఏ భక్తుడూ క్యూలలో నిలిచిపోకూడదని ఈ వ్యవస్థను తీసుకొస్తున్నట్టుగా అధికారులు చెబుతున్నారు. సంతృప్తికరమైన దర్శన అనుభూతిని అందిస్తూనే, యాత్రికుల రాకపోకలు నిరంతరాయంగా సాగించేలా ఏర్పాట్లు చేస్తారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More