ఏపీ, టీజీ ప్రయాణికులకు అప్డేట్.. ఈ తేదీల్లో చర్లపల్లి-తిరుపతి మధ్య ప్రత్యేక రైళ్లు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్‌న్యూస్ చెప్పింది. చర్లపల్లి-తిరుపతి మధ్య పలు ప్రత్యేక సర్వీసులు నడపుతోంది. వాటి షెడ్యూల్ ఇక్కడ తెలుసుకోండి.
అదనపు ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, దక్షిణ మధ్య రైల్వే చర్లపల్లి-తిరుపతి మధ్య ప్రత్యేక రైళ్లను నడపనుంది. దీంతో ఆంధ్రప్రదేశ్-తెలంగాణ మధ్య వెళ్లే ప్రయాణికులకు ఉపయోగపడనుంది. తిరుమల వెళ్లే తెలుగు రాష్ట్రాల భక్తులకు ఈ సర్వీసులు ఎంతగానో ఉపయోగకరంగా ఉండనున్నాయి.

07819 చర్లపల్లి-తిరుపతి 25.06.2026, 27.06.2026 తేదీల్లో గురు, శనివారం రెండు సర్వీసులు ఉంటాయి. చర్లపల్లి నుంచి సాయంత్రం 6 గంటల 10 నిమిషాలకు ట్రైన్ వెళ్తుంది. మరుసటి రోజు ఉదయం 07:30కి తిరుపతి చేరుకుంటుంది.
07820 తిరుపతి-చర్లపల్లి 26.06.2026, 28.06.2026 తేదీల్లో శుక్ర, ఆది వారాల్లో 2 సర్వీసులు నడుస్తాయి. మధ్యాహ్నం 3 గంటలకు తిరుపతి నుంచి బయల్దేరుతుంది. మరుసటి రోజు ఉదయం 4:30కి చర్లపల్లికి చేరుకుంటాయి.
ఈ ప్రత్యేక రైళ్లు రెండు వైపులా జనగామ, కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, డోర్నకల్, ఖమ్మం, మధిర, విజయవాడ, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట స్టేషన్లలో ఆగుతాయి. ఈ రైళ్లలో 2ఏసీ, 3ఏసీ, స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉంటాయి.
జల్నా-యెలహంక వయా సికింద్రాబాద్
ప్రయాణీకుల అదనపు రద్దీని క్లియర్ చేయడానికి, దక్షిణ మధ్య రైల్వే జల్నా యెలహంక మధ్య ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. అయితే ఈ ట్రైన్ వయా సికింద్రాబాద్ నుంచి వెళ్తుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రయాణికులకు ఈ ట్రైన్ సర్వీస్ ఎంతగానో ఉపయోగకరంగా ఉండనుంది.
07601 జల్నా - యెలహంక 28.06.2026 నుంచి 26.07.2026 మధ్య నడుస్తోంది. ఆదివారాల్లో జల్నా నుంచి రాత్రి 7.20కి బయల్దేరుతుంది. మరుసటి రోజు రాత్రి 9.30కి యెలహంక చేరుకుంటుంది. మెుత్తం 5 సర్వీసులు నడుస్తాయి.
07602 యెలహంక - జల్నా 29.06.2026 నుండి 27.07.2026 వరకు నడుస్తుంది. సోమవారం 11.30 యెలహంక నుంచి బయల్దేరి బుధవారం అర్ధరాత్రి 1 గంటలు జల్నా చేరుకుంటుంది. ఇది కూడా 5 సర్వీసులు నడుస్తుంది.
ఈ ప్రత్యేక రైళ్లు పర్చూర్, సెల్లు, పర్భాని, పూర్ణ, నాందేడ్, ముద్ఖేడ్, ధర్మాబాద్, బాసర, నిజామాబాద్, కామారెడ్డి, మేడ్చల్, బోలారం, సికింద్రాబాద్, బేగంపేట్, లింగంపల్లి, వికారాబాద్, తాండూరు, యాదగిరి, రాయచూర్, మంత్రాలయం, ధర్మారం గుండాల్, ధర్మాపూర్ రోడ్డు, అదోని, హిందూపూర్‌లో ఆగుతాయి. ఈ రైళ్లలో 3ఏసీ, స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉంటాయి.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


