ఆలిండియా ఇన్ట్సిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్), మంగళగిరిలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. సీనియర్ ప్రోగ్రామర్ (అనలిస్ట్), అసిస్టెంట్ బ్లడ్ ట్రాన్స్‌ఫ్యూజన్ ఆఫీసర్, లా ఆఫీసర్ తో పాటు పలు పోస్టులను భర్తీ చేయనున్నారు. అన్ని కలిపి 8 ఖాళీలున్నాయి.
అప్లికేషన్ల తుది గడువు…

ప్రస్తుతం ఈ పోస్టులకు ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. ఈ గడువు నవంబర్ 11వ తేదీతో ముగుస్తుంది. ఈ ఉద్యోగాలను ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన వర్శిటీల నుంచి డిప్లొమా, బీఈ/బీటెక్, ఎంసీఏ/బీఎస్సీ, LLB లో ఉత్తీర్ణత పొందినవాళ్లు అర్హులవుతారు. పని చేసిన అనుభవం కూడా ఉండాలి. దరఖాస్తు ఫీజు కింద కొన్ని పోస్టులకు రూ. 1500, మరికొన్ని పోస్టులకు రూ. 1000గా నిర్ణయించారు.
ఈ పోస్టులకు అప్లయ్ చేసుకునేవారి వయసు 18 ఏళ్ల నుంచి 45 ఏళ్లు మించకూడదు. పోస్టును బట్టి జీతం ఉంటుంది. సీనియర్ ప్రోగ్రామర్ (అనలిస్ట్)కు నెలకు రూ.1,04,935గా ఉండగా…లా ఆఫీసర్ కు రూ.86,955గా ఉంది. బయో-మెడికల్ ఇంజినీర్ కు రూ.69,595, శానిటరీ ఇన్స్పెక్టర్ కు రూ.54,870గా నిర్ణయించారు. అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్ కు రూ.54,870.అసిస్టెంట్ ఫైర్ ఆఫీసర్ కు రూ.54,870 జీతం చెల్లిస్తారు.
అప్లికేషన్ ప్రాసెస్…
- అభ్యర్థులు ముందుగా https://www.aiimsmangalagiri.edu.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
- హోంపేజీలో రిక్రూట్ మెంట్ సెక్షన్ లోని Vacancies ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
- ఇక్కడ నాన్ ఫ్యాకల్టీ క్యాటరిగిలో నోటిఫికేషన్ ఉంటుంది.చివర్లో ఉండే అప్లయ్ నౌ ఆప్షన్ పై నొక్కాలి.
- మీ వివరాలను నమోదు చేసి చివరగా సబ్మిట్ చేయటంతో ప్రాసెస్ పూర్తవుతుంది.
- మీ రిజిస్ట్రేషన్ అప్లికేషన్ ఫారమ్ ను డౌన్లోడ్ చేసుకోవాలి.
- ఈ హార్డ్ కాపీని “రిక్రూట్ మెంట్ సెంల్, రూమ్ నెంబర్ 205, 2వ ఫ్లోర్, అడ్మిన్ లైబ్రరీ భవనం, ఎయిమ్స్ మంగళగిరి, గుంటూరు(జిల్లా), ఆంధ్రప్రదేశ్ - 522503” చిరునామాకు పంపించాలి.
దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేస్తారు. ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. ఈ నోటిఫికేషన్ కు సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే recruitment.helpdesk@aiimsmangalagiri.edu.in కు మెయిల్ చేయవచ్చు.
{{/usCountry}}దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేస్తారు. ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. ఈ నోటిఫికేషన్ కు సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే recruitment.helpdesk@aiimsmangalagiri.edu.in కు మెయిల్ చేయవచ్చు.
{{/usCountry}}