మంగళగిరిలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ జారీ అయింది. ఇందులో భాగంగా 8 ఖాళీలను భర్తీ చేయనున్నారు. కాంట్రాక్ట్ పద్ధతిలో వీటిని రిక్రూట్ చేయనున్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. అర్హులైన అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. ఇందుకు నవంబర్ 30వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు.
ముఖ్యమైన వివరాలు:
- ఉద్యోగ నోటిఫికేషన్ - ఎయిమ్స్, మంగళగిరి
- ఉద్యోగ ఖాళీలు - 08
- ఖాళీల వివరాలు - సీనియర్ ప్రోగ్రామర్ (అనలిస్ట్) -1, అసిస్టెంట్ బ్లడ్ ట్రాన్స్‌ఫ్యూజన్ ఆఫీసర్ - 1,లా ఆఫీసర్ -1, బయో-మెడికల్ ఇంజినీర్ - 1, శానిటరీ ఇన్స్పెక్టర్ -1, అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్ -1, అసిస్టెంట్ ఫైర్ ఆఫీసర్ -1 పెర్ఫ్యూజినిస్ట్ -1
- పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ ఉండాలి. లా ఆఫీసర్ పోస్టుకు ఎల్ఎల్ బీ ఉత్తీర్ణత ఉండాలి. పని చేసిన అనుభవం కూడా ఉండాలి.
- దరఖాస్తు చేసుకునే వారి వయసు 18 ఏళ్ల నుంచి 45 ఏళ్లు మించకూడదు.
- దరఖాస్తు విధానం - ఆన్ లైన్
- దరఖాస్తు ఫీజు - కొన్ని పోస్టులకు రూ. 1500 ఉండగా… మిగతా పోస్టులకు రూ. 1000గా నిర్ణయించారు.
- దరఖాస్తులకు చివరి తేదీ -30 నవంబర్ 2025
- ఎంపిక విధానం - షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
- అప్లికేషన్ లింక్ - https://forms.gle/Ff8FmaAQG4A8GnBC
- పూర్తి చేసిన హార్డ్ కాపీని రిక్రూట్ మెంట్ సెల్, రూమ్ నెం 205, సెకండ్ ఫ్లోర్, లైబ్రరీ, అడ్మిన్ బిల్డింగ్, ఎయిమ్స్, మంగళగిరి, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ – 522503" చిరునామాకు పంపాలి.
- హార్డ్ కాపీని డిసెంబర్ 10వ తేదీలోపు పంపొచ్చు.
- అధికారిక వెబ్ సైట్ - https://www.aiimsmangalagiri.edu.in/

{{^htLoading}} {{/htLoading}}
Advertisement
{{/htLoading}}{{#usCountry}} {{/usCountry}}