తిరుపతి సంస్కృత యూనివర్సిటీలో నాన్ టీచింగ్ ఉద్యోగాలు - నోటిఫికేషన్ వివరాలు
తిరుపతిలోని నేషనల్ సంస్కృత యూనివర్సిటీ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ జారీ అయింది. ఇందులో భాగంగా నాన్-టీచింగ్ పోస్టులను రిక్రూట్ చేయనున్నారు. అర్హులైన వారు నవంబర్ 30వ తేదీలోపు అప్లికేషన్ చేసుకోవాలి.
తిరుపతిలోని నేషనల్ సంస్కృత వర్సిటీలో నాన్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. రెగ్యులర్ ప్రాతిపదికన పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న 09 నాన్ ఫ్యాకల్టీ ఉద్యోగాలను రిక్రూట్ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు నవంబర్ 30, 2025వ తేదీలోపు అప్లయ్ చేసుకోవాలి.

నోటిఫికేషన్ వివరాలు :
- ఉద్యోగ ప్రకటన - నేషనల్ సంస్కృత యూనివర్సిటీ, తిరుపతి
- ఉద్యోగ ఖాళీలు - 09
- ఖాళీల వివరాలు - లైబ్రేరియన్ 1, అసిస్టెంట్ రిజిస్ట్రార్ -1, ప్రొఫెషనల్ అసిస్టెంట్ - 01, ల్యాబొరేటరీ అసిస్టెంట్ (ఎడ్యుకేషన్)- 1 ల్యాబొరేటరీ అసిస్టెంట్ (లాంగ్వేజ్ ల్యాబ్ & టెక్నాలజీ ల్యాబ్) -1, అప్పర్ డివిజన్ క్లర్క్(UDC) -1, లైబ్రరీ అటెండెంట్ 2, గ్రూప్ సీ MTS- 01
- లైబ్రేరియన్ పోస్టుకు లైబ్రరీ సైన్స్‌లో మాస్టర్స్ డిగ్రీ (55 శాతం మార్కులతో) , కనీసం 10 ఏళ్ల అనుభవం ఉండాలి. లైబ్రరీ సైన్స్‌లో పీహెచ్డీ ఉండాలి. అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఉద్యోగానికి ఏదైనా సబ్జెక్టులో మాస్టర్స్ డిగ్రీ (పీజీ) కనీసం 55% మార్కులతో పాసై ఉండాలి. ప్రొఫెషనల్ అసిస్టెంట్ పోస్టుకు లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్‌లో మాస్టర్స్ డిగ్రీ (ఎంఎల్ఐసీ) మరియు 2 ఏళ్ల అనుభవం లేదా B.Lib.Sc డిగ్రీతో పాటు 3 ఏళ్ల అనుభవం ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్ అవసరం. గ్రూప్ ‘సి’ MTS పోస్టుకు 10వ తరగతి పాస్ లేదా ఐటీఐ పాసై ఉండాలి.
- దరఖాస్తు విధానం - ఆన్ లైన్
- దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడౠ్ల్యఎస్ అభ్యర్థులకు రూ.800. ఎస్సీ,ఎస్టీ,పీడౠ్ల్యబీడీ, మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు.
- దరఖాస్తులకు చివరి తేదీ - 30 నవంబర్ 2025.
- అభ్యర్థులు ముందుగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఆ తర్వాత ఆన్‌లైన్ అప్లికేషన్ ఫారమ్‌తో పాటు అవసరమైన అన్ని సర్టిఫికేట్లను జతచేసి, “రిజిస్ట్రార్, నేషనల్ సంస్కృత యూనివర్సిటీ, తిరుపతి – 517 507, ఆంధ్ర ప్రదేశ్” అనే చిరునామాకు పోస్ట్ ద్వారా పంపాలి.
- అభ్యర్థుల ఎంపిక ఇంటర్వ్యూ లేదా టెస్ట్ (పరీక్ష)లో చూపిన ప్రతిభ ఆధారంగా ఉంటుంది.
- దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులైన వారిని షార్ట్‌లిస్ట్ చేస్తారు. షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థులకు మాత్రమే ఇంటర్వ్యూ/టెస్ట్ కోసం ఈమెయిల్ ద్వారా కాల్ లెటర్స్ పంపుతారు.
- అధికారిక వెబ్ సైట్ - https://nsktu.ac.in/
- అప్లికేషన్ లింక్ - https://nsktunt.samarth.edu.in/index.php/site/login
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

