...
...
Next Story

రాజధాని అమరావతిలో తొలిసారి గణతంత్ర వేడుకలు - భారీగా ఏర్పాట్లు, రైతులకు ప్రత్యేక ఆహ్వానాలు..!

తొలిసారి రాజధాని అమరావతిలో 77వ గణతంత్ర దినోత్సవం నిర్వహించున్నారు. ఇందుకోసం ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు సిద్ధం చేసింది. రాజధాని ప్రాంత రైతులకు ప్రత్యేకంగా ఆహ్వానాలు పంపారు.

Published on: Jan 25, 2026, 11:31:02 IST
Advertisement

అమరావతి రాజధాని పరిధిలో తొలిసారిగా గణతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు భారీ ఏర్పాట్లు చేశారు. పచ్చదనం, విశాల ప్రాంగణాలు, అత్యుత్తమ మౌలిక వసతులతో ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిధిగా రాష్ట్ర గవర్నర్ అబ్ధుల్ నజీర్ అహ్మద్, అతిధిలుగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర మంత్రులు, గౌరవ హైకోర్టు న్యాయాధిపతులు, రాజధానికి భూములిచ్చిన రైతులు హాజరుకానున్నారు.

పరేడ్ రిహార్సల్…

గణతంత్ర దినోత్సవాలకు సర్వం సిద్దం
గణతంత్ర దినోత్సవాలకు సర్వం సిద్దం

శనివారం ఉదయం 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల పరేడ్ ఫుల్ డ్రెస్ రిహార్సల్ ను ఘనంగా నిర్వహించారు. పరేడ్ రిహార్సల్ కు రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి జే. శ్యామలరావు హాజరై పరేడ్ ను పరిశీలించారు.

జంగారెడ్డి గూడెం ఏఎస్పీ పరేడ్ కమాండర్ ఆర్. సుస్మిత నుంచి డీజీపీ గౌరవ వందనం స్వీకరించి…. జాతీయ పతకాన్ని ఆవిష్కరించారు. వివిధ కంటింజెంట్స్ పరేడ్ లో పుల్ డ్రెస్ రిహార్సల్స్ కవాతు ప్రదర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాలపై వివిధ శాఖలకు చెందిన 22 శకటాలను ప్రదర్శించారు.

వీటిలో వందేమాతరం కు 150 వసంతాలు ఇతివృత్తంగా సాంస్కృతిక శాఖ, పది సూత్రాల మిషన్ కింద పేదరికం లేని సమాజం (Zero Poverty) ఇతివృత్తంతో ప్రణాళికా శాఖ శకటాలను రూపొందించాయి. పరేడ్ పుల్ డ్రెస్ రిహార్సల్స్ లో గుంటూరు జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా, ఎస్పీ వకుల్ జిందాల్, జాయింట్ కలెక్టర్ ఆశుతోష్ శ్రీవాస్తవ, పోలీస్ అధికారులు, వివిధ శాఖల ఉన్నతాధికారులు, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

రైతులకు ప్రత్యేక ఆహ్వానాలు…

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe