ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి చట్టపరమైన గుర్తింపు లభించింది. 2024 జూన్ 2 నుంచి అమరావతికి ఏపీకి రాజధానికి హోదా దక్కింది. ఈ మేరకు భారత ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయడంతో అమరావతికి ఆంధ్రప్రదేశ్ ఏకైక, శాశ్వత రాజధానిగా చట్టబద్ధమైన హోదా లభించింది.

గత వారం పార్లమెంటు ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ(సవరణ) బిల్లు, 2026కు ఆమోదం తెలిపింది. తాజాగా రాష్ట్రపతి సంతకం చేశారు. కేంద్రం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ (సవరణ) చట్టం, 2026, జూన్ 2, 2024న అమల్లోకి వచ్చినట్లుగా భావించాలి.
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ (సవరణ) చట్టం, 2026, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014ను సవరించింది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014 లోని సెక్షన్ 5 (2) లో, 'ఒక కొత్త రాజధాని ఉంటుంది.' అనే పదాలను 'అమరావతి కొత్త రాజధానిగా ఉంటుంది.' అని మార్చారు.
సీఆర్డీఏ చట్టం కింద నోటిఫై చేసిన ప్రాంతాలన్నీ అమరావతి కిందకు వస్తాయని చట్టంలో పేర్కొన్నారు. రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ చట్టం, 2014లోని నిబంధనల ప్రకారం నోటిఫై చేసిన రాజధాని నగర ప్రాంతాలు కూడా చేర్చారు. ఈ మేరకు నోటిఫై చేసిన ప్రాంతాలన్ని అమరావతి కిందకు వస్తాయి. భవిష్యత్తులో వీటిలో ఏ మార్పు చేయాలన్నా.. పార్లమెంటు చేయాల్సి ఉంటుంది. అసెంబ్లీ చేసే సవరణలకు చట్టబద్ధమైన వాల్యూ ఉండదు.
అమరావతిని అధికారికంగా అమరావతిగా ప్రకటిస్తూ, పార్లమెంట్ ఏప్రిల్ 2న సవరణ బిల్లుకు తుది ఆమోదం తెలిపింది. లోక్‌సభ ఆమోదించిన ఒక రోజు తర్వాత, రాజ్యసభ మూజువాణి ఓటు ద్వారా బిల్లును ఆమోదించింది.
2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత రాజధాని సమస్యపై తలెత్తిన అనిశ్చితికి, రాజకీయ నాయకుల వైఖరికి ఈ చట్టం ముగింపు పలికినట్టైంది. ఇది రాజధాని హోదాను మార్చడానికి లేదా పాత మూడు రాజధానుల నమూనాను పునరుద్ధరించడానికి భవిష్యత్తులో జరిగే ఏ ప్రయత్నాలనైనా చేయనివ్వదు.
{{/usCountry}}2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత రాజధాని సమస్యపై తలెత్తిన అనిశ్చితికి, రాజకీయ నాయకుల వైఖరికి ఈ చట్టం ముగింపు పలికినట్టైంది. ఇది రాజధాని హోదాను మార్చడానికి లేదా పాత మూడు రాజధానుల నమూనాను పునరుద్ధరించడానికి భవిష్యత్తులో జరిగే ఏ ప్రయత్నాలనైనా చేయనివ్వదు.
{{/usCountry}}రాష్ట్ర రాజధాని అభివృద్ధి కోసం తమ భూములను ఇచ్చిన రైతుల ఆందోళనలను ఈ బిల్లు పరిష్కరించలేకపోయిందనే కారణంతో వైఎస్సార్‌సీపీ ఈ బిల్లును వ్యతిరేకించింది.
తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధికారంలో ఉన్నప్పుడు 2015లో అమరావతిని రాష్ట్ర రాజధానిగా చేసేందుకు శంకుస్థాపన జరిగింది. అయితే 2019లో వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత, అమరావతిలోని అన్ని ప్రాజెక్టులను నిలిపివేసి, మూడు రాజధానుల ఆలోచనను ప్రతిపాదించింది.
2024లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, అమరావతిని ఏకైక రాజధానిగా అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ఈ పనులను గత సంవత్సరం తిరిగి ప్రారంభించారు.
అమరావతి బిల్లు చట్ట రూపం దాల్చడంతో రాజధాని ప్రాంత రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. రాజధాని చిరకాల స్వప్నాన్ని సాకారం చేస్తూ.. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ సవరణ చట్టం 2026కు ఆమోదం తెలిపిన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు కృతజ్ఞత తెలిపారు.