తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి - ఘనంగా భోగి వేడుకలు
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి షురూ అయింది. భక్తి, సంప్రదాయ ఉత్సాహంతో భోగి పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. తెల్లవారుజామునే మంటలు వేశారు.
ఏపీ, తెలంగాణలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. మొదటి రోజైన భోగి వేడుకలను ప్రజలు అత్యంత భక్తిశ్రద్ధలతో, ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా తెల్లవారుజామునే నిద్రలేచి… భోగి మంటలు వేశారు. రంగురంగుల ముగ్గులతో కాలనీలన్నీ అపురూరంగా దర్శనమిస్తున్నాయి.

తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) శ్రీవారి ఆలయ సముదాయం మరియు చుట్టుపక్కల సాంప్రదాయ భోగి భోగి మంటలను నిర్వహించడంతో తిరుమల శ్రీ వేంకటేశ్వర ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక వైభవంతో మెరిసింది. మరోవైపు పండగ వేళ కూడా తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంది.
గుంటూరులో వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆధ్వర్యంలో భోగి వేడుకలు ఘనంగా జరిగాయి. ఉదయాన్నే భోగి మంటలు వెలిగించి కార్యకర్తలతో జోష్ గా అంబటి రాంబాబు…. మాస్ స్టెప్పలు వేశారు. ప్రత్యేక పాటపై తన స్టెప్పులతో అలరించారు.
ప్రకాశం జిల్లాతో పాటు ఇతర జిల్లాలలోని ప్రజలు సాంప్రదాయ భోగి మంటలను వెలిగించడం ద్వారా భోగిని జరుపుకున్నారు. కొత్త సంవత్సరాన్ని స్వాగతిస్తూ… పాత సంవత్సరానికి ముంగింపు పలికేలా భోగీ వేడుకలను జరుపుకున్నారు.
పలువురు పిటిఐతో మాట్లాడుతూ…. కుటుంబాలతో సంక్రాంతిని జరుపుకోవడానికి సుదూర ప్రాంతాల నుంచి తమ స్వస్థలాలకు తిరిగి వచ్చామని చెప్పారు. తమ ఇళ్ల ముందు భోగి భోగి మంటలను వెలిగించడం తరతరాలుగా కొనసాగుతున్న సంప్రదాయమని తెలిపారు.
ప్రకాశం జిల్లాలోని గంగదేవిప్పల్లె గ్రామంలో…. సుమారు 10 హరిదాసు కుటుంబాలు ఈ సంప్రదాయాన్ని కాపాడుతున్నాయి. జీవనోపాధి కోసం సంక్రాంతి సమయంలో పట్టణాలు మరియు నగరాలకు ప్రయాణిస్తున్నాయి.
హరిదాసు మస్తాన్ మాట్లాడుతూ… సాంప్రదాయ దుస్తులలో ఇంటింటికీ వెళ్లి, సంక్రాంతి రాక మరియు ప్రాముఖ్యతను ప్రజలకు గుర్తు చేయడానికి భక్తి శ్లోకాలు పాడుతున్నామని చెప్పారు.చాలా సంవత్సరాలుగా హరిదాసు సంప్రదాయాన్ని ఆచరిస్తున్నానని ఆయన చెప్పారు.
"ఇంతకుముందు హరిదాసుల పట్ల అపారమైన గౌరవం మరియు ప్రజాదరణ ఉండేది. కానీ నేడు ప్రతిస్పందన మునుపటిలా ప్రోత్సాహకరంగా లేదు" అని మస్తాన్ పిటిఐతో అన్నారు. ప్రజలు, ముఖ్యంగా యువతరం సంప్రదాయం యొక్క సాంస్కృతిక మరియు ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను అర్థం చేసుకోవాలని కోరారు.
మరోవైపు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ కూడా భోగి సందర్భంగా ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రబాబు భోగి పండగ శుభాకాంక్షలు తెలిపారు. “చెడును దహనం చేస్తూ భోగి, సంతోషానికి , సంవృద్ధికి స్వాగతం పలుకుతూ సంక్రాంతి, పశు సంపదను ప్రేమిస్తూ కనుమ... మీకు, మీకుటుంబ సభ్యులకు ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ శుభాకాంక్షలు” అని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.
మరోవైపు భోగి పండుగ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలుగు ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రతి ఇంటా భోగభాగ్యాలు వెల్లివిరియాలని, కొత్త కాంతులు తెచ్చే సంక్రాంతి, కనుమ పండుగలను అందరూ ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. ప్రజలందరూ సంతోషంగా, తెలుగు సంప్రదాయం ఉట్టిపడేలా సంక్రాంతి పండుగ సంబరాలు జరుపుకోవాలన్నారు.
రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. భోగి, మకర సంక్రాంతి, కనుమ పర్వదినాలతో మూడు రోజులపాటు సంక్రాంతి వైభవం కొనసాగుతుందని అన్నారు.
ఈ సందర్భంగా పల్లెలన్నీ రంగవల్లులు, గొబ్బెమ్మలతో నిండి ప్రకృతి రమణీయతను సంతరించుకుంటాయని కేసీఆర్ తెలిపారు. సంక్రాంతి శోభతో రాష్ట్రవ్యాప్తంగా సంతోషాలు వెల్లివిరుస్తాయని అన్నారు. దక్షిణం నుంచి ఉత్తరాయణానికి సూర్యుడు ప్రవేశించే మకర సంక్రాంతి పర్వదినం, హిందూ శాస్త్ర పురాణాల్లో ప్రత్యేకతను సంతరించుకున్నదని కేసీఆర్ తెలిపారు.

E-Paper












