Sankranti 2026: భోగి, మకర సంక్రాంతి, కనుమ పండుగ నాడు ఏం చెయ్యాలి? దానాలు, పూజలు, పరిహారాలు గురించి తెలుసుకోండి!
సంక్రాంతి పండుగ అంటే అందరికీ గుర్తొచ్చేది కొత్త బట్టలు, పిండి వంటలు, గాలిపటాలు ఎగరవేయడం, హరిదాసు కీర్తనలు, భోగి మంటలు, భోగి పండ్లు, గంగిరెద్దులు, సందడి, సరదాలు ఇలా ఉంటాయి. ఆధ్యాత్మికంగా చూసుకున్నట్లయితే ఈ మూడు రోజులు చాలా ముఖ్యమైనవి. ప్రధానంగా కొన్ని పనులు చేయాలి.
హిందువులు జరుపుకునే ప్రధానమైన పండుగలలో సంక్రాంతి పండుగ ఒకటి. మూడు రోజుల పాటు సంక్రాంతిని అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. ఈ రోజు భోగితో సంక్రాంతి పండుగ మొదలవుతుంది. రెండవ రోజు, అంటే భోగి తర్వాత రోజు సంక్రాంతి.

మూడవ రోజు కనుమ పండుగను జరుపుకుంటాము. సంక్రాంతి పండుగ అంటే అందరికీ గుర్తొచ్చేది కొత్త బట్టలు, పిండి వంటలు, గాలిపటాలు ఎగరవేయడం, హరిదాసు కీర్తనలు, భోగి మంటలు, భోగి పండ్లు, గంగిరెద్దులు, సందడి, సరదాలు ఇలా ఉంటాయి. అయితే ఆధ్యాత్మికంగా చూసుకున్నట్లయితే ఈ మూడు రోజులు కూడా చాలా ముఖ్యమైనవి. ప్రధానంగా కొన్ని పనులు చేయాలి. మరి ఆధ్యాత్మికంగా చేయాల్సిన ముఖ్యమైన పనులు ఏంటి? ఈ మూడు రోజులు కూడా ఎటువంటి వాటిని ఆచరించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
భోగి, మకర సంక్రాంతి, కనుమ పండుగ నాడు తప్పకుండా ఈ 12 పనులు చేయండి.
భోగి పండుగ పీడను వదిలించుకోవడానికి మంచి రోజు. భోగి పండుగ నాడు పీడను వదిలించుకోవడానికి భోగి నీళ్లతో స్నానం చేయాలి. అంటే భోగి మంట పెట్టినప్పుడు అక్కడ ఒక బకెట్‌తో నీళ్లు పెట్టి, ఆ నీటిని స్నానం చేసే నీటిలో కలుపుకొని స్నానం చేయాలి.
భోగి పండుగ నాడు చిన్నపిల్లలకు భోగి పళ్ళు పోయాలి. అలా చేయడం వలన వాళ్లకు పట్టిన పీడ తొలగిపోతుంది.
భోగి మంట అనేది సామాన్యమైనది కాదు. ఇది అగ్నిహోత్రం వంటిదని గుర్తు పెట్టుకోండి. మన ఇంటి ముందు భోగి మంట వేస్తే పీడలన్నీ కూడా తొలగిపోతాయి.
భోగి పండుగ దక్షిణాయనానికి, ధనుర్మాసానికి ఆఖరి రోజు కాబట్టి ఆ రోజు దేవాలయానికి వెళ్లి గోదా కళ్యాణంలో పాల్గొనండి.
భోగి పండుగ నాడు ఇంటి ముందు ముగ్గులు వేయండి. గొబ్బెమ్మలను పెట్టండి. ముగ్గు మధ్య గొబ్బెమ్మ పెడితే చాలా మంచి జరుగుతుంది. ఈ గొబ్బెమ్మ భూమాతకు ప్రతీక అని గుర్తు పెట్టుకోండి.
పండుగ మూడు రోజులు కూడా నువ్వులకు సంబంధించినవి తినండి. వీటిని కచ్చితంగా తినాలని మన శాస్త్రం చెప్తోంది. పండుగ వేళ నువ్వులు దానంగా ఇచ్చినా కూడా మంచి జరుగుతుంది.
అలాగే మకర సంక్రాంతి నాడు పెద్దలకు, పితృదేవతలకు సంబంధించిన ఏదైనా పని చేయాలి. తర్పణాలు వదలడం, శ్రార్థం పెట్టడం వంటివి చేస్తే మంచి జరుగుతుంది.
మకర సంక్రాంతి నాడు శివుడికి రుద్రాభిషేకం చేస్తే కూడా విశేష ఫలితాన్ని పొందవచ్చు.
మకర సంక్రాంతి నాడు నువ్వుల నూనె రాసుకుని పిండితో నలుగు పెట్టుకుని స్నానం చేస్తే కూడా మంచి జరుగుతుంది.
మకర సంక్రాంతి నాడు పెరుగును దానం చేస్తే కూడా విశేష ఫలితాన్ని పొందవచ్చు. పెరుగును దానంగా ఇస్తే సంతానం సంతోషంగా, క్షేమంగా ఉంటుంది. సంపద కూడా పెరుగుతుంది. ఆయుష్షును కూడా పొందవచ్చు.
కనుమ రోజు మినుములను తింటే మంచి జరుగుతుంది. మినుములతో చేసిన గారెలు వంటివి చాలా మంది వండుకుంటారు.
కనుమ నాడు పశువులను, పశుసంపదను ఆరాధించాలి. ఒకవేళ మీకు సమీపంలో పశువులు లేకపోతే, దగ్గరలో ఉన్న గోశాలకు వెళ్లడం మంచిది.

E-Paper












