Bhogi: రేపే భోగి పండుగ.. ఈ పేరు ఎలా వచ్చింది, భోగి మంటలు ఎందుకు వెయ్యాలి, ప్రాముఖ్యతతో పాటు తెలుసుకోవాల్సిన వివరాలు ఇవి!

సూర్యుడు ధనస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించినప్పుడు మకర సంక్రాంతిగా జరుపుకుంటాము. మకర సంక్రాంతి ముందు రోజు భోగి పండుగను, మకర సంక్రాంతి తర్వాత రోజును కనుమ పండుగగా జరుపుకుంటాము. భోగి రోజున పిల్లలకు భోగి పళ్లను పోయడం, సాయంత్రం బొమ్మల కొలువు, ఉదయాన్నే మంటలు వేయడం ఇలా పద్ధతులను పాటిస్తూ ఉంటారు.

Published on: Jan 13, 2026 10:00 AM IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

సంక్రాంతి పండుగను అందరూ బంధుమిత్రులతో సంతోషంగా జరుపుకుంటారు. తెలుగు రాష్ట్రాలతో పాటుగా దక్షిణ రాష్ట్రాల్లో కూడా మకర సంక్రాంతి పండుగను అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. హిందూ మత విశ్వాసాల ప్రకారం, సూర్యుడు ధనస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించినప్పుడు మకర సంక్రాంతిగా జరుపుకుంటాము. మకర సంక్రాంతి ముందు రోజు భోగి పండుగను, మకర సంక్రాంతి తర్వాత రోజును కనుమ పండుగగా జరుపుకుంటాము.

Bhogi: రేపే భోగి పండుగ.. ఈ పేరు ఎలా వచ్చింది, ఎందుకు భోగి మంటలు వెయ్యాలి? (pinterest)
Bhogi: రేపే భోగి పండుగ.. ఈ పేరు ఎలా వచ్చింది, ఎందుకు భోగి మంటలు వెయ్యాలి? (pinterest)

భోగి రోజున పిల్లలకు భోగి పళ్లను పోయడం, సాయంత్రం బొమ్మల కొలువు పెట్టడం, ఉదయాన్నే మంటలు వేయడం ఇలా రకరకాల పద్ధతులను పాటిస్తూ ఉంటారు. అయితే, భోగి నాడు ఎందుకు భోగి మంటలు వేయాలి? దాని వెనుక కారణం ఏమిటి? భోగి పండుగను ఎందుకు జరుపుకోవాలి? భోగి మంటల వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి? ఇలా అనేక విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

భోగి పండుగ (Bhogi 2026), సంక్రాతి పండుగ, కనుమ పండుగ 2026

భోగి నాడు మంటలు ఎందుకు వేయాలి?

శాస్త్రీయ కారణాల ప్రకారం చూసినట్లయితే, సూర్యుడు దక్షిణాయన కాలంలో భూమికి దూరంగా ఉంటాడు. దీంతో ఉష్ణోగ్రతలు తగ్గుతాయి, చలి తీవ్రత ఎక్కువవుతుంది. ఆ చలి బాధలను తప్పించుకోవడానికి, ఆ వాతావరణాన్ని తట్టుకోవడానికి, దక్షిణాయనంలో పడిన కష్టాలు, బాధలు తట్టుకున్నందుకు ఉత్తరాయణ కాలంలో ఆనందంగా ఉండాలని, సుఖ సంతోషాలు కలగాలని భోగి మంటలను వేయడం జరుగుతుంది.

భోగి పండుగను ఎందుకు జరుపుకోవాలి? ఈ పదం ఎలా వచ్చింది?

భోగి అనే పదం భుగ్ అనే సంస్కృత పదం నుంచి వచ్చింది. భోగం అంటే సుఖం. శ్రీరంగనాథ స్వామిలో గోదాదేవి లీనమై భోగాన్ని పొందిందని, అలా భోగి పండుగను జరుపుకునే పద్ధతి వచ్చిందని పెద్దలు అంటారు. ఇంకో కథనం ప్రకారం చూసినట్లయితే, విష్ణువు వామన అవతారంలో వచ్చి బలి చక్రవర్తిని పాతాళంలోకి తొక్కింది కూడా ఈ భోగి పండుగ నాడేనని చెబుతారు. అలాగే ఇంద్రుడి పొగరును అణచివేస్తూ గోవర్ధన పర్వతాన్ని ఎత్తిన రోజు కూడా భోగియేనని పెద్దలు అంటారు. అలాగే భోగి నాడే రైతుల కోసం ఈశ్వరుడు నందిని భూమిపైకి పంపించాడని చెబుతారు.

భోగి నాడు బొమ్మల కొలువు

  • భోగి నాడు సాయంత్రం బొమ్మల కొలువు పెడతారు. ఆ రోజున చిన్న పిల్లల తలపై భోగి పళ్లను పోస్తారు. బదరీవనంలో శ్రీహరిని పిల్లవాడిగా మార్చి రేగుపళ్లతో అభిషేకం చేశారు. అలా భోగి పళ్ళు పోసే సంప్రదాయం వచ్చింది.
  • భోగి పండ్లను పిల్లలకు పోసేటప్పుడు చెరుకు ముక్కలు, బంతి పువ్వు రేకులు, రేగు పండ్లు, చిల్లరకాసులు కలిపి పిల్లలకు దిష్టి తీసి తలపై పోస్తారు. అలా చేయడం వలన పిల్లలు ఆయురారోగ్యాలతో ఉంటారని నమ్మకం.

భోగి మంటలతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జనవరి నెలలో చలి ఎక్కువగా ఉంటుంది. చలి నుంచి రక్షణ పొందేందుకే ఈ సమయంలో భోగి మంటలను వేస్తారు. భోగి మంటల వలన చలి తీవ్రత నుంచి తప్పించుకోవచ్చు. పిడకలను కూడా వాటిలో వేస్తారు. వీటిని కాల్చడం వలన గాలి శుద్ధి అవుతుంది. సూక్ష్మజీవులు తొలగిపోతాయి. శ్వాస సంబంధిత సమస్యలతో పాటు అనేక రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది.