Happy Bhogi Wishes 2026: మీ స్నేహితులకు, బంధువులకు భోగి పండుగ శుభాకాంక్షలను ఈ స్పెషల్ కోట్స్, విషెస్‌తో చెప్పేయండి!

నాలుగు రోజుల పాటు అంగరంగ వైభవంగా సంక్రాంతి (Sankranti 2026) పండుగను కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ఘనంగా జరుపుకుంటారు. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన నాడు మకర సంక్రాంతిని జరుపుకుంటాము. బంధువులు, స్నేహితులకు మనసారా భోగి శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?

Published on: Jan 13, 2026, 08:00:53 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

హిందువులు జరుపుకునే ప్రధాన పండుగల్లో సంక్రాంతి పండుగ ఒకటి. సంక్రాంతి పండుగకి ముందు రోజు భోగి పండుగను జరుపుకుంటాము. భోగి పండుగ నాడు భోగి మంటలు వేయడం, పిల్లలకు భోగి పండ్లు పోయడం ఇలా వివిధ రకాల సాంప్రదాయాలను పాటిస్తూ ఉంటాము. అయితే భోగి (Bhogi 2026) నాడు మీ బంధువులు, స్నేహితులకు మనసారా శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా? అయితే ఈ కోట్స్ మెసేజ్‌లపై (Happy Bhogi Wishes and Quotes) ఒక లుక్ వేసేయండి.

భోగి పండుగ 2026 విషెస్, కోట్స్.. హ్యాపీ భోగి 2026 విషెస్ (pinterest)
భోగి పండుగ 2026 విషెస్, కోట్స్.. హ్యాపీ భోగి 2026 విషెస్ (pinterest)

భోగి పండుగ 2026

నాలుగు రోజుల పాటు అంగరంగ వైభవంగా సంక్రాంతి (Sankranti 2026) పండుగను జరుపుకుంటాము. ముఖ్యంగా కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ఈ పండుగను ఘనంగా జరుపుకుంటారు. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన నాడు మకర సంక్రాంతిని జరుపుకుంటాము. ఈ పండుగ తొలి రోజు భోగిగా జరుపుకుంటాము. బాధలు, కష్టాలను అగ్ని దేవుడికి ఆహుతి చేస్తూ భోగి మంటలను వేస్తారు. ఉత్తరాయణంలో సుఖ సంతోషాలు ఇవ్వాలని ఆకాంక్షిస్తూ భోగి మంటలు వేయడం జరుగుతుంది.

భోగి పండుగ 2026 విషెస్, కోట్స్.. హ్యాపీ భోగి 2026 విషెస్, భోగి పండుగ శుభాకాంక్షలు, సంక్రాంతి విషెస్ 2026

భోగ భాగ్యాలను ఇచ్చే భోగి,

సరదాలను తీసుకొచ్చే సంక్రాంతి,

కమ్మనైన కనుమ,

కొత్త వెలుగులను నింపాలని కోరుకుంటున్నాను.

మీకు, మీ కుటుంబ సభ్యులకు భోగి శుభాకాంక్షలు.

భోగి పండుగ 2026 విషెస్, కోట్స్ (pinterest)
భోగి పండుగ 2026 విషెస్, కోట్స్ (pinterest)

ఉత్తరాయణ పుణ్యకాలాన్ని తెచ్చే మకర సంక్రమణం,

జనులకి వెలుగునిచ్చే రవికిరణం.

హ్యాపీ భోగి.

భోగి భోగ భాగ్యాలతో,

సంక్రాంతి సిరిసంపదలతో,

కనుమ కనువిందుగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

మీకు, మీ కుటుంబ సభ్యులకు భోగి పండుగ శుభాకాంక్షలు.

కష్టాలను దహించే భోగి మంటలు,

భోగాలను అందించే భోగి పండ్లు,

వాకిట్లో అందమైన రంగవల్లులు,

కీర్తనలు పాడే హరిదాసులు,

గుమగుమలాడే పిండి వంటలు,

ఇలా ఎప్పటికీ మీకు ఉండాలి సంతోషాలు... అందరికీ భోగి శుభాకాంక్షలు.

భోగి మంటల్లో గత సంవత్సరం బాధలు, కష్టాలన్నీ కాలిపోయి,

కొత్త సంవత్సరం ఆనందాలు రావాలని,

మీకు, మీ కుటుంబ సభ్యులకు భోగి శుభాకాంక్షలు...

భోగి మంటల వెలుగులు జీవితంలోని చీకటిని తొలగించి, ప్రకాశమంతమైన జీవితాన్ని ఇవ్వాలని, కొత్త సంవత్సరంలో కొత్త ఆరంభాలను తీసుకురావాలని ఆశిస్తున్నాను... భోగి పండుగ శుభాకాంక్షలు.

ఈ భోగి పండుగ మీకు, మీ కుటుంబ సభ్యులకు సంతోషాలు, ఆనందాలు అందివ్వాలని కోరుకుంటున్నాను.. భోగి పండుగ 2026 శుభాకాంక్షలు.

మీ ఇల్లు ఆనందంతో కలకల్లాడాలని, కుటుంబ సభ్యులందరూ ఆరోగ్యంగా ఉండాలని ఆశిస్తున్నాను.. భోగి పండుగ శుభాకాంక్షలు.

భోగి రోజు మీ కష్టాలు మంటల రూపంలో కాలిపోవాలని కోరుకుంటున్నాను.. నిత్యం మీ ఇంట సంతోషాలు కురవాలని ఆశిస్తున్నాను... హ్యాపీ భోగి.

భోగి పండుగ 2026 విషెస్ (pinterest)
భోగి పండుగ 2026 విషెస్ (pinterest)

గత సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా మీ జీవితంలో ఆనందం ఉండాలని, ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలను ఆ భగవంతుడు ఇవ్వాలని కోరుకుంటున్నాను... భోగి పండుగ శుభాకాంక్షలు.

మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ, మీకు మేలు కోరే వారికి ఆరోగ్యం, సంపద, సంతోషాలు కలగాలని కోరుతూ.. హ్యాపీ భోగి.

నూతన ప్రారంభానికి ఒక శుభదినం, అదృష్టాన్ని, భోగభాగ్యాలను అందించే పర్వదినం, సిరిసంపదలతో విరజిల్లాలని ఆకాంక్షిస్తున్నాను.. భోగి శుభాకాంక్షలు.

ఈ భోగి మీ ఇంట కొత్త వెలుగులు నింపాలని కోరుకుంటున్నాను.. మీకు, మీ కుటుంబ సభ్యులకు భోగి శుభాకాంక్షలు.

గతానికి వీడ్కోలు పలుకుతూ, రేపటి జీవిత సంక్రాంతికి స్వాగతం పలికే భోగి పండుగ సందర్భంగా హ్యాపీ భోగి.

భోగి పండుగతో బాధలన్నీ మటుమాయం కావాలి, ప్రపంచం శాంతి, సౌఖ్యాలకు నిలయంగా మారాలి.. భోగి శుభాకాంక్షలు.

భోగి పండుగ మీకు సంతోషాన్ని, అదృష్టాన్ని తీసుకురావాలని కోరుకుంటున్నాను.. భోగి పండుగ శుభాకాంక్షలు.

భోగి, సంక్రాంతి, కనుమ పండుగల సందర్భంగా మీరు, మీ కుటుంబ సభ్యులు ఆనందోత్సాహాలతో, సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను. భోగి శుభాకాంక్షలు..

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More