విజయవాడ నగరంలో అత్యంత సంచలనం సృష్టించిన వివాహిత హత్య కేసును వెస్ట్ జోన్ పోలీసులు ఛేదించారు. 29 ఏళ్ల కల్యాణి అనే మహిళను దారుణంగా గొంతు కోసి హత్య చేయడమే కాకుండా, ఆమె మృతదేహాన్ని ముక్కలుగా నరికి కాలువలో పడేసిన దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన కసాయి షేక్ షఫీతో పాటు అతనికి సహకరించిన షేక్ అబ్దుల్లాను పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు.
అసలేం జరిగిందంటే..?
ఈ కేసు వివరాలను విజయవాడ వెస్ట్ ఏసీపీ దుర్గారావు మీడియాకు వెల్లడించారు. భవానీపురం ప్రాంతంలో మటన్ షాప్ నడుపుతున్న షేక్ షఫీ (45)కి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. కుమారులు లేకపోవడంతో నాలుగేళ్ల క్రితం కల్యాణి కొడుకును షఫీ దత్తత తీసుకున్నాడు. ఈ క్రమంలోనే వీరిద్దరి మధ్య కొంతకాలం సాన్నిహిత్యం ఏర్పడింది.
అయితే, కొడుకును దత్తత ఇచ్చిన విషయాన్ని ఆసరాగా చేసుకుని కల్యాణి తనను ఆర్థికంగా వేధించడం మొదలుపెట్టిందని షఫీ పోలీసుల ఎదుట వాపోయాడు. తనను ఒక 'ఏటీఎం'లా వాడుకుంటూ తరచూ వేల రూపాయలు డిమాండ్ చేసేదని, డబ్బులు ఇవ్వకపోతే సమాజంలో రచ్చ చేస్తానని బెదిరింపులకు దిగేదని పేర్కొన్నాడు. రోజురోజుకూ కల్యాణి వేధింపులు ఎక్కువ కావడంతో, ఆమెను అంతమొందించాలని షఫీ ప్లాన్ వేశాడు.
సెప్టెంబర్ 17న కుటుంబ సభ్యులు ఇంట్లో లేని సమయం చూసి కల్యాణిని షఫీ తన ఇంటికి పిలిపించాడు. ఆ సమయంలో కల్యాణి రూ. 1 లక్ష ఇవ్వాలని డిమాండ్ చేయగా…. షఫీ రూ. 15,000 మాత్రమే ఇస్తానని చెప్పడంతో ఇద్దరి మధ్య తీవ్రస్థాయిలో గొడవ జరిగింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన షఫీ…. కత్తితో కల్యాణి గొంతు కోసి దారుణంగా హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని కిరాతకంగా ముక్కలుగా నరికేశాడు.
హత్య ఆనవాళ్లు లేకుండా చేసేందుకు, మృతదేహ భాగాలను షేక్ అబ్దుల్లా సహాయంతో విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్ కూలింగ్ కాలువలో పారేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులిద్దరిపై భారతీయ న్యాయ సంహిత (BNS)లోని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు ఏసీపీ దుర్గారావు తెలిపారు.
{{/usCountry}}హత్య ఆనవాళ్లు లేకుండా చేసేందుకు, మృతదేహ భాగాలను షేక్ అబ్దుల్లా సహాయంతో విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్ కూలింగ్ కాలువలో పారేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులిద్దరిపై భారతీయ న్యాయ సంహిత (BNS)లోని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు ఏసీపీ దుర్గారావు తెలిపారు.
{{/usCountry}}చిన్నతనంలోనే తల్లిని కోల్పోయిన కల్యాణిని… ఆమె తండ్రి కూడా జల్సాలకు అలవాటు పడి పట్టించుకోకపోవడంతో తీవ్ర కష్టాల నడుమ పెరిగినట్లు పోలీసులు వెల్లడించారు. చివరకు ఈ ఆర్థిక వివాదాలే ఆమె ప్రాణాలను బలిగొన్నాయి.