ప్రయాణికులకు శుభవార్త… మచిలీపట్నం-కర్నూల్ మధ్య కొత్తగా రైలు సర్వీస్‌, వయా విజయవాడ..!

Machilipatnam Kurnool Train : మచిలీపట్నం, కర్నూలు సిటీ మధ్య వారానికి మూడు రోజులు నడిచే కొత్త రైలుకు భారతీయ రైల్వే ఆమోదం తెలిపింది. కోస్తా, రాయలసీమ ప్రాంతాల మధ్య రాకపోకలకు ఇది గొప్ప ఊరట నివ్వనుంది.

Published on: Sep 29, 2026, 07:36:33 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Machilipatnam Kurnool Train : ఏపీ ప్రయాణికులకు భారతీయ రైల్వే మరో తీపి కబురును అందించింది. మచిలీపట్నం నుంచి కర్నూలు సిటీ వరకు విజయవాడ మీదుగా నడిచే కొత్త ఎక్స్‌ప్రెస్ రైలుకు ఆమోదముద్ర వేసింది. సౌత్ కోస్ట్ రైల్వే పంపిన ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ… నిర్ణయాన్ని వెల్లడించింది. ఈ కొత్త రైలుతో కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల మధ్య రవాణా వ్యవస్థ మరింత బలోపేతం కానుంది.

మచిలీపట్నం-కర్నూలు మధ్య కొత్త రైలు సర్వీస్‌
మచిలీపట్నం-కర్నూలు మధ్య కొత్త రైలు సర్వీస్‌

వారానికి మూడు రోజులు నడిచేలా (ట్రై-వీక్లీ) ఈ రైలు సర్వీసు రూపుదిద్దుకుంది. మచిలీపట్నంలో ప్రారంభమయ్యే ఈ రైలు గుడివాడ, విజయవాడ, నరసరావుపేట, గుంటూరు జిల్లా పరిసరాలు, ప్రకాశం, నంద్యాల జిల్లాల మీదుగా కర్నూలు చేరుకుంటుంది. తీరప్రాంత పారిశ్రామిక కేంద్రమైన మచిలీపట్నం, నవ్యాంధ్ర వ్యాపార రాజధాని విజయవాడ, అలాగే రాయలసీమ ముఖ్య ప్రాంతమైన కర్నూలును ఒకే వరుసలో అనుసంధానించడం ద్వారా ప్రయాణికులు, వ్యాపారులు, విద్యార్థులకు ఎంతో సమయం ఆదా కానుంది.

  • ఈ రైలు మచిలీపట్నంలో సాయంత్రం 4.55 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5.45 గంటలకు కర్నూలుకు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఉదయం 9.30 గంటలకు కర్నూలులో బయలుదేరి అదే రోజు రాత్రి 9.35 గంటలకు మచిలీపట్నం చేరుకుంటుంది.
  • ఈ కొత్త రైలు మచిలీపట్నం వైపు నుంచి సోమ, బుధ, శనివారాల్లో ప్రయాణిస్తుంది. ఇక కర్నూలు వైపు నుంచి మంగళ, గురు, ఆదివారాల్లో బయలుదేరుతుంది.

ప్రయాణికుల సౌకర్యార్థం ఈ రైలుకు కీలకమైన అన్ని వ్యాపార, ఆధ్యాత్మిక మరియు విద్యా కేంద్రాల వద్ద కమర్షియల్ హాల్ట్‌లను కేటాయించారు. గుడివాడ, విజయవాడలతో పాటు పల్నాడు, సీమ ప్రాంతాల్లో అత్యంత ప్రాధాన్యత కలిగిన ప్రధాన స్టేషన్లలో ఈ రైలు ఆగనుంది.

ముఖ్యమైన హాల్టింగ్ స్టేషన్ల వివరాలు…

  • గుడివాడ
  • విజయవాడ
  • నరసరావుపేట
  • వినుకొండ
  • దొనకొండ
  • మార్కాపురం రోడ్
  • కంభం
  • గిద్దలూరు
  • దిగువమెట్ట
  • నంద్యాల
  • బేతంచెర్ల
  • ఢోన్
  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More