Vijayawada Crime : వివాహిత దారుణ హత్య... ముక్కలుగా నరికి కాలువలో పడేసిన వైనం..! విచారణలో సంచలన విషయాలు

విజయవాడ భవానీపురంలో 29 ఏళ్ల కల్యాణిని షేక్ షఫీ అనే వ్యక్తి అత్యంత దారుణంగా హత్య చేసి శరీర భాగాలను కాలువలో పారేశాడు. ఆర్థిక వివాదాలు, బెదిరింపుల కారణంగానే ఈ హత్య జరిగినట్లు పోలీసులు తేల్చారు. నిందితుడితో పాటు అతనికి సహకరించిన వ్యక్తిని విజయవాడ వెస్ట్ పోలీసులు అరెస్ట్ చేశారు.

Published on: Sep 30, 2026, 05:12:55 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

విజయవాడ నగరంలో అత్యంత సంచలనం సృష్టించిన వివాహిత హత్య కేసును వెస్ట్ జోన్ పోలీసులు ఛేదించారు. 29 ఏళ్ల కల్యాణి అనే మహిళను దారుణంగా గొంతు కోసి హత్య చేయడమే కాకుండా, ఆమె మృతదేహాన్ని ముక్కలుగా నరికి కాలువలో పడేసిన దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన కసాయి షేక్ షఫీతో పాటు అతనికి సహకరించిన షేక్ అబ్దుల్లాను పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు.

వివాహిత దారుణ హత్య (representative image )
వివాహిత దారుణ హత్య (representative image )

అసలేం జరిగిందంటే..?

ఈ కేసు వివరాలను విజయవాడ వెస్ట్ ఏసీపీ దుర్గారావు మీడియాకు వెల్లడించారు. భవానీపురం ప్రాంతంలో మటన్ షాప్ నడుపుతున్న షేక్ షఫీ (45)కి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. కుమారులు లేకపోవడంతో నాలుగేళ్ల క్రితం కల్యాణి కొడుకును షఫీ దత్తత తీసుకున్నాడు. ఈ క్రమంలోనే వీరిద్దరి మధ్య కొంతకాలం సాన్నిహిత్యం ఏర్పడింది.

అయితే, కొడుకును దత్తత ఇచ్చిన విషయాన్ని ఆసరాగా చేసుకుని కల్యాణి తనను ఆర్థికంగా వేధించడం మొదలుపెట్టిందని షఫీ పోలీసుల ఎదుట వాపోయాడు. తనను ఒక 'ఏటీఎం'లా వాడుకుంటూ తరచూ వేల రూపాయలు డిమాండ్ చేసేదని, డబ్బులు ఇవ్వకపోతే సమాజంలో రచ్చ చేస్తానని బెదిరింపులకు దిగేదని పేర్కొన్నాడు. రోజురోజుకూ కల్యాణి వేధింపులు ఎక్కువ కావడంతో, ఆమెను అంతమొందించాలని షఫీ ప్లాన్ వేశాడు.

సెప్టెంబర్ 17న కుటుంబ సభ్యులు ఇంట్లో లేని సమయం చూసి కల్యాణిని షఫీ తన ఇంటికి పిలిపించాడు. ఆ సమయంలో కల్యాణి రూ. 1 లక్ష ఇవ్వాలని డిమాండ్ చేయగా…. షఫీ రూ. 15,000 మాత్రమే ఇస్తానని చెప్పడంతో ఇద్దరి మధ్య తీవ్రస్థాయిలో గొడవ జరిగింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన షఫీ…. కత్తితో కల్యాణి గొంతు కోసి దారుణంగా హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని కిరాతకంగా ముక్కలుగా నరికేశాడు.

హత్య ఆనవాళ్లు లేకుండా చేసేందుకు, మృతదేహ భాగాలను షేక్ అబ్దుల్లా సహాయంతో విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్ కూలింగ్ కాలువలో పారేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులిద్దరిపై భారతీయ న్యాయ సంహిత (BNS)లోని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు ఏసీపీ దుర్గారావు తెలిపారు.

చిన్నతనంలోనే తల్లిని కోల్పోయిన కల్యాణిని… ఆమె తండ్రి కూడా జల్సాలకు అలవాటు పడి పట్టించుకోకపోవడంతో తీవ్ర కష్టాల నడుమ పెరిగినట్లు పోలీసులు వెల్లడించారు. చివరకు ఈ ఆర్థిక వివాదాలే ఆమె ప్రాణాలను బలిగొన్నాయి.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More