తుఫాను ప్రభావంపై అలర్ట్ గా ఉండండి - సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

తీవ్ర తుఫానుగా మారనున్న 'అర్నబ్' హెచ్చరికల నేపథ్యంలో ఏపీ యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రాణనష్టం జరగకుండా, 'జీరో ఇన్సిడెంట్స్' లక్ష్యంగా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు.

Published on: Oct 26, 2026, 08:10:47 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

అర్నబ్ తుఫాను నేపథ్యంలో అనుక్షణం అప్రమత్తత, అత్యున్నత సన్నద్దత, ముందస్తు ప్రణాళికతో అన్ని స్థాయిల్లో యంత్రాంగం పని చేయాలని సిఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. తుఫాను ప్రభావం తీవ్రంగా ఉంటుందన్న వాతావరణ శాఖ సమాచారం నేపథ్యంలో అన్ని శాఖలు సమన్వయంతో వ్యవహరించాలన్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష
ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష

జిల్లా స్థాయిలో కంట్రోల్ రూంలు ఏర్పాటు చేసుకుని ప్రజలకు అవసరమైన సూచనలు చేయాలని ఆదేశించారు. ఎక్కడా ప్రాణ నష్టం జరగకూడదని..ఆస్తి నష్టం సాధ్యమైనంత తగ్గించాలని పేర్కొన్నారు. శాటిలైట్ల సమాచారంతో, సైంటిఫిక్ డేటా ఆధారంగా చర్యలు తీసుకోవాలన్నారు.

ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ...‘తుఫాను వల్ల గాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని తెలుస్తోంది..... విద్యుత్ శాఖ పూర్తి సన్నద్దతతో ఉండి విద్యుత్ పునరుద్దరణ వేగంగా జరిగేలా చూడాలి. సముద్రంపై వేటకు వెళ్లిన అన్ని బోట్లు తీరానికి వచ్చేలా చూడాలి. భారీ వర్షాలతో వచ్చే వరదతో నీటి వనరులను నింపేందుకు అవసరమైన అన్ని చర్యలు ఇరిగేషన్ శాఖ తీసుకోవాలి. జీరో ఇన్సిడెంట్స్ లక్ష్యంగా అన్ని స్థాయిలో ప్రభుత్వ వ్యవస్థలు సమన్వయంతో పనిచేయాలి. ఒకసారి తుఫాన్ ప్రభావం మొదలై రాకపోకలకు ఆటకం కలిగితే గర్భిణీలు ఇబ్బందులు పడతారు. ఈ వారంలో కాన్పులు అయ్యే గర్భిణీలను ముందుగానే ఆసుపత్రికి తరలించాలి" అని దిశానిర్దేశం చేశారు.

ఈనెల 28న తీరం దాటే అవకాశం…

బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం తుఫానుగా బలపడే అవకాశం ఉందని అధికారులు వివరించారు. అక్టోబర్‌ 28 మధ్యాహ్నానికి బాపట్ల – విశాఖపట్నం మధ్య తుఫాను తీరం దాటే అవకాశం ఉంది. ప్రస్తుత అంచనాల్లో కోనసీమ–యానాం–కాకినాడ తీర ప్రాంతంలో తీరం దాటొచ్చు. తీరం దాటే సమయంలో గంటకు 115 – 125 కిలోమీటర్ల వేగంతో గాలులు...కొన్ని సందర్భాల్లో 140 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది అని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ప్రతి నాలుగు గంటలకు తుఫానుపై బులిటెన్ విడుదల చేయాలని సీఎం సూచించారు.

అక్టోబర్‌ 27, 28 తేదీల్లో ఉత్తరాంధ్ర, మధ్య కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. కొన్నిచోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాకినాడ, అనకాపల్లి, విశాఖపట్నం, కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాలతో పాటు ఉత్తరాంధ్రపైనా గాలులు, వర్ష ప్రభావం ఉంటుంది.

అనకాపల్లి జిల్లాలో అత్యధికంగా సగటున 292.55 మి.మీ., అల్లూరి సీతారామరాజు జిల్లాలో 281.17 మి.మీ., విశాఖపట్నంలో 253.87 మి.మీ., శ్రీకాకుళంలో 249.18 మి.మీ. వర్షపాతం పడవచ్చు. రాష్ట్రవ్యాప్తంగా ఐదు రోజుల సగటు మొత్తం వర్షపాతం 95 మి.మీ.గా ఉంటుందని అంచనా వేయగా...ప్రభావిత జిల్లాల్లో సగటున 22–29 సెం.మీ వర్షపాతానికి అవకాశం ఉందని అధికారులు వివరించారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More