ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మురసు తీవ్ర తుపాను తీవ్రంగా దెబ్బతీసింది. రాష్ట్రాన్ని వరుసగా వణికించిన అర్నాబ్, మురసు తుపాన్ల దాటికి ప్రజలు… ముఖ్యంగా రైతాంగం కోలుకోలేని దెబ్బ తిన్నారు. ప్రాథమిక అంచనాల ప్రకారం… మురసు తుఫాన్ కారణంగా రాష్ట్రంలో దాదాపు రూ. 1,919 కోట్ల మేర ఆస్తి, పంట నష్టం వాటిల్లింది.

రాష్ట్రవ్యాప్తంగా 59 మండలాలు, 649 గ్రామీణ పంచాయతీలపై ఈ తుఫాన్ ప్రభావం పడింది. మృతుల విషయానికి వస్తే బాపట్ల జిల్లాలో ఐదుగురు, గుంటూరు జిల్లాలో ఇద్దరు, పల్నాడు జిల్లాలో ఒకరు చొప్పున మొత్తం ఎనిమిది మంది మరణించారు. ప్రభావిత జిల్లాల్లో తక్షణ సహాయక చర్యలు చేపట్టేందుకు ప్రభుత్వం తొలి విడతగా రూ.37 కోట్లను విడుదల చేసింది.
సీఎం చంద్రబాబు ఏరియల్ సర్వే…
తుఫాన్ తీవ్ర ప్రభావానికి గురైన ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు…. శుక్రవారం ఏరియల్ సర్వే నిర్వహించారు. హెలికాప్టర్ ద్వారా వరద ముంపునకు గురైన గ్రామాలు, దెబ్బతిన్న పంట పొలాలను నిశితంగా పరిశీలించారు.
ఆ తర్వాత సూర్యలంక ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌కు చేరుకున్న ముఖ్యమంత్రి…. అక్కడి నుంచి రోడ్డు మార్గాన బాపట్ల మండలం జిల్లెలమూడి వంతెన వద్దకు వెళ్లారు. ఉప్పెన, భారీ వర్షాల వల్లతో… దెబ్బతిన్న డ్రెయిన్ల పరిస్థితిని అక్కడికక్కడే ఇరిగేషన్ (సాగునీటి) శాఖ అధికారులతో సమీక్షించారు. వరద నీరు త్వరగా సముద్రంలోకి వెళ్లేలా డ్రెయిన్ల పూడికతీత, మరమ్మతు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
అక్కడి నుంచి గుంటూరు జిల్లా పత్తిపాడు నియోజకవర్గంలోని రేటూరు గ్రామానికి సీఎం చంద్రబాబు చేరుకున్నారు. నీట మునిగిన వరి పొలాల్లోకి స్వయంగా దిగి పంట నష్టాన్ని పరిశీలించారు. సర్వస్వం కోల్పోయి ఆవేదనలో ఉన్న స్థానిక రైతులతో ముఖాముఖి మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం మీడియాతో మాట్లాడిన ముఖ్యమంత్రి… మురసు తుపానుతో రాష్ట్రంలో ప్రాథమికంగా రూ. 1,919 కోట్ల మేర నష్టం వాటిల్లిందని వెల్లడించారు. బాధితులకు తక్షణ ఉపశమనం అందించేందుకు రూ.37 కోట్లను ఇప్పటికే జిల్లాలకు విడుదల చేశామని తెలిపారు.
{{/usCountry}}అనంతరం మీడియాతో మాట్లాడిన ముఖ్యమంత్రి… మురసు తుపానుతో రాష్ట్రంలో ప్రాథమికంగా రూ. 1,919 కోట్ల మేర నష్టం వాటిల్లిందని వెల్లడించారు. బాధితులకు తక్షణ ఉపశమనం అందించేందుకు రూ.37 కోట్లను ఇప్పటికే జిల్లాలకు విడుదల చేశామని తెలిపారు.
{{/usCountry}}