గుంటూరు - కోల్‌కతా చిత్‌పూర్ మధ్య స్పెషల్ పూజా ఎక్స్‌ప్రెస్ రైళ్లు.. ఈ తేదీల్లో

Guntur-Kolkata Chitpur Special Puja Express Train : పండుగల రద్దీ కారణంగా దక్షిణ కోస్తా రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఇందులో భాగంగా గుంటూరు - కోల్‌కతా (చిత్‌పూర్) మధ్య ప్రత్యేక పూజా ఎక్స్‌ప్రెస్ ట్రైన్స్‌ను ప్రకటించింది.

Updated on: Oct 23, 2026, 13:51:58 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

పండుగల సీజన్‌లో ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు దక్షిణ కోస్ట్ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని గుంటూరు - కోల్‌కతా చిత్‌పూర్ - గుంటూరు (07437/07438) మధ్య ప్రత్యేక 'స్పెషల్ పూజా ఎక్స్‌ప్రెస్' రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. ఇరువైపులా 2 ట్రిప్పుల చొప్పున ఈ ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. ఈ సర్వీసుల పూర్తి వివరాలు, సమయాలు, ఆగే స్టేషన్లు, కోచ్‌ల సమాచారం చూడండి.

దక్షిణ కోస్తా రైల్వే స్పెషల్ ట్రైన్స్
దక్షిణ కోస్తా రైల్వే స్పెషల్ ట్రైన్స్

రైలు నంబర్ 07437 (గుంటూరు – కోల్‌కతా చిత్‌పూర్ స్పెషల్ పూజా ఎక్స్‌ప్రెస్) రైలు గుంటూరు నుంచి బయలుదేరి ఒడిశా మీదుగా పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతా(చిత్‌పూర్)కు చేరుకుంటుంది. 25.10.2026, 01.11.2026 (మొత్తం 2 ట్రిప్పులు) నడుస్తుంది. ఆదివారం సాయంత్రం 4 గంటలకు గుంటూరు నుండి బయలుదేరుతుంది. అదే రోజు రాత్రి 10:20 గంటలకు దువ్వాడ చేరుకుని, రాత్రి 10:22 గంటలకు బయలుదేరుతుంది. మరుసటి రోజు (సోమవారం) మధ్యాహ్నం 2:50 గంటలకు కోల్‌కతా చిత్‌పూర్ చేరుకుంటుంది.

రైలు నంబర్ 07438 (కోల్‌కతా చిత్‌పూర్ – గుంటూరు స్పెషల్ పూజా ఎక్స్‌ప్రెస్) తిరుగు ప్రయాణంలో ఈ రైలు కోల్‌కతా చిత్‌పూర్ నుండి గుంటూరుకు చేరుకుంటుంది. 26.10.2026, 02.11.2026 (మొత్తం 2 ట్రిప్పులు) నడుస్తుంది. సోమవారం సాయంత్రం 5:35 గంటలకు బయలుదేరుతుంది. మరుసటి రోజు (మంగళవారం) ఉదయం 10:30 గంటలకు దువ్వాడ చేరుకుని, 10:32 గంటలకు బయలుదేరుతుంది. మరుసటి రోజు (మంగళవారం) సాయంత్రం 5:30 గంటలకు గుంటూరు చేరుకుంటుంది.

విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట, తుని, అనకాపల్లి, దువ్వాడ, విజయనగరం జంక్షన్, శ్రీకాకుళం రోడ్, పలాస, ఇచ్చాపురం, ఒడిశాలోని బ్రహ్మపూర్, ఖుర్దా రోడ్, భువనేశ్వర్, కటక్, భద్రక్, బాలాసోర్, పశ్చిమ బెంగాల్‌లోని ఖరగ్‌పూర్, అందూల్, దంకునిలో ట్రైన్స్ ఆగుతాయి.

ఈ ప్రత్యేక పూజా ఎక్స్‌ప్రెస్ రైలులో మొత్తం 19 కోచ్‌లు అందుబాటులో ఉంటాయి. సెకండ్ ఏసీ 1 కోచ్, థర్డ్ ఏసీ 2 కోచ్‌లు , స్లీపర్ క్లాస్ 6 కోచ్‌లు, జనరల్ సెకండ్ క్లాస్ 8 కోచ్‌లు ఉంటాయి. అంతేకాదు సెకండ్ క్లాస్ విత్ బ్రేక్ వ్యాన్ అండ్ లగేజ్ కోచ్‌లు 2 ఉన్నాయి.

పండుగల సీజన్‌లో ఊళ్లకు వెళ్లే ప్రయాణికులు, వ్యాపారులు, విద్యార్థులు రైళ్లలో ఎదుర్కొనే రద్దీని నివారించేందుకు దక్షిణ కోస్తా రైల్వే ఈ ప్రత్యేక సర్వీసులను ప్రవేశపెట్టింది. ప్రయాణికులు ఈ ప్రత్యేక పూజా ఎక్స్‌ప్రెస్ రైలు సర్వీసులను ఉపయోగించుకుని తమ ప్రయాణాన్ని సురక్షితంగా ప్లాన్ చేసుకోవాల్సిందిగా రైల్వే అధికారులు కోరారు. ఐఆర్‌సీటీసీ అధికారిక వెబ్‌సైట్ లేదా యాప్ ద్వారా, అలాగే రైల్వే రిజర్వేషన్ కౌంటర్లలో ముందస్తు టికెట్ బుకింగ్ సదుపాయం అందుబాటులో ఉంటుంది.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More