ప్రయాణికులకు అప్జేట్... రేపల్లె - చర్లపల్లి మధ్య పండగ ప్రత్యేక రైళ్లు! వయా గుంటూరు, నల్గొండ

ప్రయాణికుల రద్దీని దృష్ట్యా రేపల్లె-చర్లపల్లి మధ్య ప్రత్యేక రైలును నడపనున్నారు. అక్టోబర్ 21, 22 తేదీల్లో ఈ వన్-రౌండ్ ట్రిప్ అందుబాటులో ఉంటుంది.

Published on: Oct 19, 2026, 13:31:12 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

తెలుగు రాష్ట్రాల మధ్య ప్రయాణించే రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే తీపి కబురు అందించింది. సాధారణ రైళ్లలో పెరుగుతున్న ప్రయాణికుల రద్దీ, పొడవైన వెయిట్‌లిస్ట్ జాబితాను దృష్టిలో ఉంచుకుని రేపల్లె - చర్లపల్లి - రేపల్లె (ట్రైన్ నంబర్లు 07227/07228) మధ్య 'ఆన్ డిమాండ్ స్పెషల్ ఎక్స్‌ప్రెస్' రైలును నడపాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది.

ప్రత్యేక రైళ్లు
ప్రత్యేక రైళ్లు

ఈ ప్రత్యేక రైలు ఒక రౌండ్ ట్రిప్ సర్వీసుగా అందుబాటులో ఉంటుందని అధికారులు ప్రకటించారు. ఈ ప్రత్యేక సర్వీసు ప్రయాణికుల ప్రయాణాన్ని అత్యంత సౌకర్యవంతంగా మార్చడంతో పాటు పండుగల తదనంతర రద్దీని నియంత్రించడంలో కీలకపాత్ర పోషిస్తుందని భావిస్తున్నారు.

  • రేపల్లె - చర్లపల్లి స్పెషల్ ఎక్స్‌ప్రెస్ (ట్రైన్ నంబర్ 07227) : ఈ రైలు అక్టోబర్ 21వ తేదీ బుధవారం రాత్రి 19.45 గంటలకు (రాత్రి 7:45 గంటలకు) రేపల్లె స్టేషన్ నుంచి బయలుదేరుతుంది. మరుసటి రోజు, అంటే అక్టోబర్ 22వ తేదీ గురువారం ఉదయం 05.00 గంటలకు చర్లపల్లికి చేరుకుంటుంది.
  • చర్లపల్లి - రేపల్లె స్పెషల్ ఎక్స్‌ప్రెస్ (ట్రైన్ నంబర్ 07228): తిరుగు ప్రయాణంలో ఈ రైలు అక్టోబర్ 22వ తేదీ గురువారం రాత్రి 23.30 గంటలకు (రాత్రి 11:30 గంటలకు) చర్లపల్లి స్టేషన్ నుంచి బయలుదేరుతుంది. ఆ తర్వాతి రోజు, అంటే అక్టోబర్ 23వ తేదీ శుక్రవారం ఉదయం 07.50 గంటలకు రేపల్లె చేరుకుంటుంది.

స్టాపేజీలు(ఆగే స్టేషన్లు) :

రేపల్లె - చర్లపల్లి మధ్య ప్రయాణించే ఈ ప్రత్యేక రైలు రెండు వైపులా ప్రయాణికుల సౌకర్యార్థం పలు ముఖ్యమైన రైల్వే స్టేషన్లలో ఆగుతుందని అధికారులు వెల్లడించారు. వేమూరు, తెనాలి, సంగం జాగర్లమూడి, గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, నడికుడి, మిర్యాలగూడ, మరియు నల్గొండ స్టేషన్లలో ఈ రైలుకు హాల్టింగ్ సౌకర్యం కల్పించారు.

ఈ ప్రత్యేక రైలులో మొత్తం 24 ఐసిఎఫ్ (ICF) కోచ్‌లను ఏర్పాటు చేశారు. రద్దీ సమయంలో సొంత ప్రాంతాలకు, నగరాలకు రాకపోకలు సాగించే వారికి ఈ ఆన్ డిమాండ్ ప్రత్యేక రైలు ఎంతగానో ఉపయోగపడనుంది. ప్రయాణికులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని దక్షిణ మధ్య రైల్వే కోరింది.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More