పండుగ ప్రయాణికులకు బిగ్ రిలీఫ్.. దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు ప్రకటన!

SCR Festival Special Trains : పండుగ ప్రయాణికులను దృష్టిలో పెట్టుకుని రైల్వేశాఖ పలు ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఈ ట్రైన్స్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మీదుగా నడుస్తాయి.

Published on: Oct 16, 2026, 11:31:00 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

పండుగ సీజన్‌లో సొంతూర్లకు వెళ్లే ప్రయాణికుల కోసం దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన చేసింది. దసరా, పూజా పండుగల వేళ రైళ్లలో పెరిగే తీవ్ర ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని పలు ప్రధాన ప్రాంతాల మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు తెలిపింది. చర్లపల్లి - చెన్నై సెంట్రల్, చర్లపల్లి - నాగర్‌కోయిల్, సికింద్రాబాద్ - విశాఖపట్నం మార్గాల్లో ఈ ప్రత్యేక రైళ్లు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. రైల్వే శాఖ విడుదల చేసిన వివరాల ప్రకారం ప్రత్యేక రైళ్ల సమయాలు, ప్రయాణ ప్రారంభ తేదీలు కింది విధంగా ఉన్నాయి.

పండుగ ప్రత్యేక రైళ్లు
పండుగ ప్రత్యేక రైళ్లు

చర్లపల్లి – చెన్నై సెంట్రల్

ట్రైన్ నంబర్ 07059(చర్లపల్లి – చెన్నై సెంట్రల్) అక్టోబర్ 16, 2026న చర్లపల్లిలో రాత్రి 9:30 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 11:15 గంటలకు చెన్నై సెంట్రల్ చేరుకుంటుంది. ట్రైన్ నంబర్ 07060 (చెన్నై సెంట్రల్ – చర్లపల్లి అక్టోబర్ 17, 2026న చెన్నై సెంట్రల్‌లో మధ్యాహ్నం 1 గంటకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 4:30 గంటలకు చర్లపల్లి చేరుకుంటుంది.

ఈ రైళ్లు ఇరువైపులా నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు స్టేషన్లలో ఆగుతాయి. వీటిలో స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు అందుబాటులో ఉంటాయి.

చర్లపల్లి – నాగర్‌కోయిల్

ట్రైన్ నంబర్ 07535(చర్లపల్లి – నాగర్‌కోయిల్) అక్టోబర్ 30, 2026 నుండి నవంబర్ 13, 2026 వరకు ప్రతి నిర్దేశిత తేదీల్లో రాత్రి 7:45 గంటలకు బయలుదేరి మరుసటి రోజు రాత్రి 10:45 గంటలకు నాగర్‌కోయిల్ చేరుకుంటుంది. ట్రైన్ నంబర్ 07536 (నాగర్‌కోయిల్ – చర్లపల్లి) నవంబర్ 01, 2026 నుండి నవంబర్ 15, 2026 వరకు అర్ధరాత్రి 12:45 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 3:45 గంటలకు చర్లపల్లి చేరుకుంటుంది.

ఈ రైళ్లు ఇరువైపులా నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, బాపట్ల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, నాయుడుపేట, సుళ్లూరుపేట, చెన్నై ఎగ్మోర్, తాంబరం, చెంగల్‌పట్టు, విల్లుపురం, వృద్ధాచలం, తిరుచిరాపల్లి, దిండిగల్, మదురై, విరుదునగర్, సాత్తూర్, కోవిల్‌పట్టి, తిరునెల్వేలి, వల్లియూర్ స్టేషన్లలో ఆగుతాయి. ఈ ప్రత్యేక రైళ్లలో 2 AC, 3 AC, స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ బోగీలు ఉంటాయి.

సికింద్రాబాద్ – విశాఖపట్నం

ట్రైన్ నంబర్ 07069(సికింద్రాబాద్ – విశాఖపట్నం) అక్టోబర్ 16, 2026న సికింద్రాబాద్‌లో రాత్రి 8:15 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 11 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. ట్రైన్ నంబర్ 07070(విశాఖపట్నం – సికింద్రాబాద్) అక్టోబర్ 17, 2026న విశాఖపట్నంలో మధ్యాహ్నం 3:50 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5:30 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.

ఈ రైళ్లు ఇరువైపులా చర్లపల్లి, నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట, తుని, అనకాపల్లి, దువ్వాడ స్టేషన్లలో ఆగుతాయి. వీటిలో 1AC, 2AC, స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు అందుబాటులో ఉంటాయి.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More