Charlapalli-Visakhapatnam : పండగకు ఇంటికి వెళ్లేవారి కోసం చర్లపల్లి-విశాఖ మధ్య స్పెషల్ ట్రైన్స్.. హాల్టింగ్ స్టేషన్లు
Charlapalli-Visakhapatnam Train : పండగల కారణంగా దక్షిణ మధ్య రైల్వే పలు రూట్లలో ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఇందులో భాగంగానే.. చర్లపల్లి-విశాఖ, నాందేడ్-పానిపట్ మధ్య స్పెషల్ ట్రైన్స్‌ను ప్రకటించింది.
పండుగల రద్దీ దృష్ట్యా ప్రయాణికుల రాకపోకల సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. చర్లపల్లి - విశాఖపట్నం, హెచ్.ఎస్. నాందేడ్ - పానిపట్ మార్గాల్లో ఈ ప్రత్యేక సేవలను అందించనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.

చర్లపల్లి – విశాఖపట్నం స్పెషల్ ట్రైన్
చర్లపల్లి – విశాఖపట్నం ప్రత్యేక రైలు (రైలు సంఖ్య: 07067) 15.10.2026(గురువారం) 1 సర్వీసు నడుస్తుంది. చర్లపల్లిలో రాత్రి 9 గంటలకు బయలుదేరి, మరుసటి రోజు మధ్యాహ్నం 12:05 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది.
విశాఖపట్నం – చర్లపల్లి ప్రత్యేక రైలు (రైలు సంఖ్య: 07068) 16.10.2026 (శుక్రవారం) 1 సర్వీసు ఉంటుంది. విశాఖపట్నంలో మధ్యాహ్నం 3:50 గంటలకు బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 5:00 గంటలకు చర్లపల్లి చేరుకుంటుంది.
ఈ రైళ్లు నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట, తుని, అనకాపల్లి, దువ్వాడ స్టేషన్లలో ఆగుతాయి. 2ఏసీ, 3ఏసీ, స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు అందుబాటులో ఉంటాయి.
నాందేడ్ – పానిపట్ ప్రత్యేక రైలు
హెచ్.ఎస్. నాందేడ్ - పానిపట్ ప్రత్యేక రైలు (రైలు సంఖ్య: 07635) 21.10.2026, 27.10.2026 మొత్తం 2 సర్వీసులు నడుస్తాయి. నాందేడ్‌లో ఉదయం 07:40 గంటలకు బయలుదేరి, మరుసటి రోజు సాయంత్రం 5:30 గంటలకు పానిపట్ చేరుకుంటుంది.
పానిపట్ – హెచ్.ఎస్. నాందేడ్ ప్రత్యేక రైలు (రైలు సంఖ్య: 07636) 22.10.2026, 28.10.2026 2 సర్వీసులు ఉంటాయి. పానిపట్‌లో సాయంత్రం 6:15 గంటలకు బయలుదేరి, రెండో రోజు ఉదయం 6:00 గంటలకు హెచ్.ఎస్. నాందేడ్ చేరుకుంటుంది.
స్టాపేజీలు చూసుకుంటే.. పూర్ణా, పర్భణి, జాల్నా, ఛత్రపతి శంభాజీనగర్, మన్మాడ్, జల్గావ్, భూసావల్, ఖాండ్వా, ఇటార్సీ, రాణి కమలాపతి, బీనా, వి.ఎల్. ఝాన్సీ, ఆగ్రా కాంట్, మథుర, కోసి కలాన్, న్యూఢిల్లీ, భోద్వాల్ మజ్రీ స్టేషన్లలో ఇరువైపులా నిలుస్తాయి. 3ఏసీ, స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు కేటాయించారు.
పలు రైళ్లు రద్దు
ఝార్సుగూడ రైల్వే స్టేషన్ యార్డ్ పునర్నిర్మాణ పనుల నిమిత్తం నాన్-ఇంటర్ లాకింగ్ పనులు చేపడుతున్నారు. ఈ సాంకేతిక అభివృద్ధి పనుల కారణంగా పలు కీలక ప్రాంతాలకు నడిచే రైళ్లను రద్దు చేయడంతో పాటు మరికొన్నింటిని దారిమళ్లిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది.
ప్రయాణికులు తమ ప్రయాణ ప్రణాళికలను సిద్ధం చేసుకునే ముందు రద్దయిన, దారిమళ్లించిన రైళ్ల జాబితాను పరిశీలించాలని రైల్వే శాఖ విజ్ఞప్తి చేసింది.
రద్దయిన రైళ్ల వివరాలు
చర్లపల్లి – దర్భంగా (రైలు సంఖ్య: 17007) 2026 నవంబర్ 28, డిసెంబర్ 05, డిసెంబర్ 08, డిసెంబర్ 12వ తేదీల్లో రద్దైంది. దర్భంగా-చర్లపల్లి(రైలు సంఖ్య: 17008) 2026 డిసెంబర్ 01, డిసెంబర్ 08, డిసెంబర్ 11, డిసెంబర్ 15 తేదీల్లో రద్దైంది.
హెచ్.ఎస్. నాందేడ్ – సంత్రాగాచి (రైలు సంఖ్య: 12767) 2026 నవంబర్ 23, నవంబర్ 30, డిసెంబర్ 07, డిసెంబర్ 14, డిసెంబర్ 21, డిసెంబర్ 28, 2027 జనవరి 04, జనవరి 11 తేదీల్లో రద్దు అవుతుంది. సంత్రాగాచి – హెచ్.ఎస్. నాందేడ్ (రైలు సంఖ్య: 12768) 2026 నవంబర్ 25, డిసెంబర్ 02, డిసెంబర్ 09, డిసెంబర్ 16, డిసెంబర్ 23, డిసెంబర్ 30, 2027 జనవరి 06, జనవరి 13 తేదీల్లో రద్దు చేస్తారు.
దారిమళ్లించిన రైలు
యశ్వంత్‌పూర్ – తాతానగర్(రైలు సంఖ్య: 18112) 2026 డిసెంబర్ 13న బయలుదేరే సర్వీసు సాధారణ మార్గానికి బదులుగా విజయనగరం - ఇచ్చాపురం - జఖపుర - నయాగఢ్ - దస్పల్లా మీదుగా మళ్లిస్తారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్ఎడిటర్గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్మెంట్లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


