చర్లపల్లి - తిరుపతి మధ్య దసరా ప్రత్యేక రైళ్లు - వయా వరంగల్, విజయవాడ! తేదీలివే
Charlapalli Tirupati Special Trains : దసరా, దీపావళి పండగల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. చర్లపల్లి - తిరుపతి మార్గంలో ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకువచ్చింది.
Charlapalli Tirupati Special Trains : దసరా పండగ వేళ సొంతూర్లకు వెళ్లే ప్రయాణికులు, తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తుల రద్దీని నివారించేందుకు దక్షిణ మధ్య రైల్వే (SCR) కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌లోని చర్లపల్లి నుంచి తిరుపతి మధ్య పండగ ప్రత్యేక రైళ్లను ప్రకటించింది.

- చర్లపల్లి - తిరుపతి ప్రత్యేక రైలు (రైలు నం. 07713) : ఈ ప్రత్యేక రైలు 2026 అక్టోబర్ 10న సాయంత్రం 06:10 గంటలకు చర్లపల్లిలో బయలుదేరి, మరుసటి రోజు (అక్టోబర్ 11న) ఉదయం 07:30 గంటలకు తిరుపతి చేరుకుంటుంది.
- తిరుపతి - చర్లపల్లి ప్రత్యేక రైలు (రైలు నం. 07714) : తిరుగు ప్రయాణంలో ఈ రైలు 2026 అక్టోబర్ 11న మధ్యాహ్నం 02:45 గంటలకు తిరుపతిలో బయలుదేరి, మరుసటి రోజు (అక్టోబర్ 12న) తెల్లవారుజామున 04:30 గంటలకు చర్లపల్లి చేరుకుంటుంది.
స్టాపేజీల వివరాలు:
ఈ ప్రత్యేక రైళ్లు రెండు వైపులా జనగాం, కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, డోర్నకల్, ఖమ్మం, మధిర, విజయవాడ, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు మరియు రేణిగుంట స్టేషన్లలో ఆగుతాయి. కోచ్‌ల సమాచారం:
ప్రయాణికుల సౌకర్యార్థం ఈ ప్రత్యేక రైళ్లలో స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లను అందుబాటులో ఉంచారు. పండగ వేళ ప్రయాణించే వారు ఐఆర్‌సిటిసి (IRCTC) వెబ్‌సైట్ లేదా యాప్ ద్వారా ముందస్తు రిజర్వేషన్ చేసుకోవాలని రైల్వే అధికారులు సూచించారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

