Araku Tour Package : హాలిడేస్ లో అరకు వెళ్లొస్తారా..? IRCTC అదిరిపోయే వన్ డే టూర్ ప్యాకేజీ, ఇవిగో వివరాలు
IRCTC Araku Tour Package : దసరా సెలవుల వేళ విశాఖపట్నం నుంచి అరకు లోయ అందాలను సందర్శించేందుకు ఐఆర్‌సీటీసీ టూరిజం 'అరకు రైల్ కమ్ రోడ్ ప్యాకేజీ'ని అందుబాటులోకి తెచ్చింది. ఒక్కరోజులోనే పూర్తయ్యే ఈ ప్రత్యేక ప్యాకేజీ వివరాలు, టికెట్ ధరలు, ప్రయాణ షెడ్యూల్ వివరాలను ఇక్కడ తెలుసుకోండి.
IRCTC Araku Tour Package : దసరా సెలవుల వేళ కుటుంబంతో కలిసి ఆహ్లాదకరమైన ప్రదేశానికి వెళ్లాలని భావిస్తున్నారా? పచ్చని కొండకోనలు, జలపాతాల జలసరిగాలు, వీనులవిందైన వాతావరణం, సువాసనలు వెదజల్లే కాఫీ తోటలతో పర్యాటకులను పరవశింపజేసే అరకు లోయ పర్యటనకు ఐఆర్‌సీటీసీ టూరిజం ఒక అద్భుతమైన అవకాశాన్ని ముందుకు తీసుకొచ్చింది.

విశాఖపట్నం నుంచి రోజూ అందుబాటులో ఉండేలా 'అరకు రైల్ కమ్ రోడ్ ప్యాకేజీ' పేరుతో ఈ వన్ డే టూర్ ఆఫర్‌ను అందిస్తోంది. ఈ దసరా పండుగ సీజన్‌లో అక్టోబర్ 10వ తేదీన జర్నీ ఉంటుంది. ఈ ప్యాకేజీలో భాగంగా అరకు అందాలను కేవలం ఒక్క రోజు వ్యవధిలోనే వీక్షించేలా ఈ ప్యాకేజీని రూపొందించారు. విశాఖపట్నం రైల్వే స్టేషన్ నుంచి ప్రారంభమయ్యే ఈ యాత్రలో రైలు ప్రయాణ అనుభూతితో పాటు సుందరమైన ఘాట్ రోడ్డు ప్రయాణం కూడా పర్యాటకులకు లభిస్తుంది.
టూర్ షెడ్యూల్ ఇలా….
- ఉదయం 07:00 గంటలకు విశాఖపట్నం రైల్వే స్టేషన్ నుంచి రైలు (Train No. 58501) బయలుదేరుతుంది. ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ ఉదయం 11:00 గంటలకు అరకు చేరుకుంటారు.
- అరకు చేరుకున్న తర్వాత…. మొదట గిరిజన సంస్కృతికి అద్దంపట్టే ట్రైబల్ మ్యూజియం , అనంతరం అందమైన పద్మాపురం గార్డెన్స్ సందర్శన ఉంటుంది.
- రుచికరమైన మధ్యాహ్న భోజనం ముగించుకుని…. రోడ్డు మార్గాన విశాఖకు తిరుగు ప్రయాణం ప్రారంభమవుతుంది. మార్గమధ్యంలో ప్రసిద్ధ అనంతగిరి కాఫీ తోటలు , గాలికొండ వ్యూ పాయింట్ , అద్భుతమైన బొర్రా గుహలను (Borra Caves) సందర్శిస్తారు.
- రాత్రికి పర్యాటకులను సురక్షితంగా విశాఖపట్నం రైల్వే స్టేషన్ వద్ద దించి టూర్ ముగిస్తారు.
ప్యాకేజీ తీసుకున్న వారికి రైలు ప్రయాణ టికెట్లతో పాటు అరకులో స్థానిక సందర్శనకు నాన్-ఏసీ వాహన సౌకర్యాన్ని కల్పిస్తారు. భోజన వసతుల కింద ఉదయం ప్యాక్డ్ బ్రేక్‌ఫాస్ట్, మధ్యాహ్నం శాకాహార భోజనం , సాయంత్రం హై-టీ అందిస్తారు. వీటితో పాటు ప్రముఖ బొర్రా గుహల ప్రవేశ టికెట్ రుసుము ), ఉచిత ట్రావెల్ ఇన్సూరెన్స్ మరియు వర్తించే అన్ని పన్నులు ప్యాకేజీలోనే కలిసి ఉంటాయి. కెమెరా ఫీజులు, హోటల్ టిప్స్, ఇతర వ్యక్తిగత ఖర్చులు మరియు ప్యాకేజీలో పేర్కొనని అదనపు ఆహార పదార్థాలకు పర్యాటకులే సొంతంగా చెల్లించాల్సి ఉంటుందని ఐఆర్‌సీటీసీ తెలిపింది. ప్రయాణానికి 4 రోజుల ముందు ఆన్‌లైన్ టికెట్లు జనరేట్ అవుతాయి. పర్యాటకులు ఐఆర్‌సీటీసీ అధికారిక వెబ్‌సైట్ ( https://www.irctctourism.com/ ) ద్వారా తమ టికెట్లను బుక్ చేసుకోవచ్చు
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

