Araku Tour Package : అందమైన అరకు టూర్ - IRCTC వన్ డే టూర్ ప్యాకేజీ, ఈనెలలోనే జర్నీ
IRCTC Araku Tour Package : ఐఆర్‌సీటీసీ టూరిజం… విశాఖపట్నం నుంచి అరకు 1-డే 'రైల్-కమ్-రోడ్' ప్యాకేజీ అందిస్తోంది. బొర్రా గుహలు, అనంతగిరి కాఫీ తోటలను సందర్శించటంతో పాటు పలు ప్రాంతాలను చూడొచ్చు.
IRCTC Araku Tour Package : ప్రకృతి రమణీయతకు నిలయమైన అరకు లోయను ఒక్క రోజులోనే ఆహ్లాదకరంగా చుట్టి రావాలనుకునే పర్యాటకుల కోసం ఐఆర్‌సీటీసీ అద్భుతమైన టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తెచ్చింది.

"అరకు రైల్ – కమ్ – రోడ్ ప్యాకేజీ" పేరుతో ఒక రోజు విహార యాత్రను నిర్వహిస్తోంది. విశాఖపట్నం నుంచి ప్రారంభమయ్యే ఈ యాత్రలో పర్యాటకులు రైలు, రోడ్డు మార్గాల ద్వారా ప్రకృతి సౌందర్యాన్ని వీక్షిస్తూ విహరించవచ్చు.
ఈ ప్యాకేజీ ప్రతిరోజూ అందుబాటులో ఉంటుంది. ప్రయాణంలో భాగంగా పర్యాటకులకు రుచికరమైన ఉదయపు టిఫిన్, మధ్యాహ్న భోజనం మరియు సాయంత్రం స్నాక్స్ (శాఖాహారం) అందిస్తారు.
టూర్ షెడ్యూల్ వివరాలు :
- ఉదయం 07:00 గంటల వరకు విశాఖపట్నం రైల్వే స్టేషన్ నుంచి రైలు నంబర్ 58501 ద్వారా అరకు ప్రయాణం ప్రారంభమవుతుంది.
- ఉదయం 11:00 గంటల వరకు అరకు చేరుకుంటారు. అక్కడ గిరిజన సంస్కృతిని ప్రతిబింబించే ట్రైబల్ మ్యూజియం (Tribal Museum) మరియు పద్మాపురం గార్డెన్స్ సందర్శిస్తారు. మధ్యాహ్నం భోజనం తర్వాత… రోడ్డు మార్గంలో తిరిగి విశాఖపట్నం ప్రయాణమవుతారు.
- అనంతగిరి కాఫీ తోటలు, గాలికొండ వ్యూ పాయింట్ మరియు అద్భుతమైన బొర్రా గుహలను తిలకిస్తారు.
- రాత్రి వేళకి విశాఖపట్నం రైల్వే స్టేషను వద్ద పర్యాటకులను దింపడంతో ఈ ఆహ్లాదకర యాత్ర ముగుస్తుంది.
విశాఖ - అరకు టూర్ ప్యాకేజీ ధరలు చూస్తే…. కంఫర్ట్ క్లాస్(EV) లో సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.6545, డబుల్ అక్యుపెన్సీకి రూ.4055,ట్రిపుల్ అక్యుపెన్సీకి రూ. 3225గా నిర్ణయించారు. చిన్నారులకు వేర్వురు ధరలుంటాయి. 5 నుంచి 11 ఏళ్ల పిల్లలకు వేర్వురు ధరలుంటాయి. https://www.irctctourism.com/ వెబ్ సైట్ లోకి వెళ్లి ధరలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.
ఈ ప్యాకేజీ రుసుములో రైలు ప్రయాణ ఛార్జీలు, రోడ్డు మార్గం కోసం నాన్-ఏసీ వాహన సదుపాయం, శాకాహార భోజన సదుపాయం (ఉదయపు అల్పాహారం, మధ్యాహ్న భోజనం, సాయంత్రం టీ/స్నాక్స్), బొర్రా గుహల ప్రవేశ రుసుము, ట్రావెల్ ఇన్సూరెన్స్ మరియు వర్తించే పన్నులు చేరి ఉంటాయి. అయితే వ్యక్తిగత ఖర్చులు, హోటల్ టిప్స్, మినిరల్ వాటర్, ల్యాండ్రీ, కెమెరా ఎంట్రీ ఫీజులు… ప్యాకేజీలో పేర్కొనని ఇతర ప్రదేశాల సందర్శన ఖర్చులను పర్యాటకులే సొంతంగా భరించాల్సి ఉంటుంది.
ఈ ప్యాకేజీ టికెట్లను ప్రయాణ తేదీకి 4 రోజుల ముందు IRCTC ఆన్‌లైన్‌లో జారీ చేస్తుంది. బుకింగ్ రద్దు చేసుకోవాలనుకునే పర్యాటకులు కేవలం ఐఆర్‌సీటీసీ అధికారిక వెబ్‌సైట్ (www.irctctourism.com) ద్వారానే రద్దు చేసుకోవాలి. మరిన్ని వివరాలు, బుకింగ్స్ కోసం ఐఆర్‌సీటీసీ దక్షిణ మధ్య జోన్ కార్యాలయం (సికింద్రాబాద్) ఫోన్ నంబర్లు 8287932229, 8287932228, 9701360701 లలో సంప్రదించవచ్చు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

