IRCTC Shirdi Tour Package : హైదరాబాద్ టు షిర్డీ ట్రిప్ - బడ్జెట్ ధరలో 3 రోజుల ప్యాకేజీ, ఈనెలలోనే జర్నీ

IRCTC Hyderabad Shirdi Tour Package : హైదరాబాద్ నుంచి షిర్డీకి ఐఆర్సీటీసీ టూరిజం ప్రత్యేక ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. ఈనెల 19వ తేదీన జర్నీ ఉంటుంది. 3 రోజుల పాటు టూర్ ఉంటుంది. పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి…..

Published on: Aug 10, 2026, 11:10:29 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

షిర్డీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా…? హైదరాబాద్ నుంచి బడ్జెట్ ధరలోనే టూర్ ప్యాకేజీ వచ్చేసింది. మూడు రోజుల పాటు టూర్ ఉంటుంది. ట్రైన్ జర్నీ ద్వారా ఆపరేట్ చేస్తారు. ఐఆర్సీటీసీ టూరిజం తీసుకువచ్చిన ఈ టూర్ ప్యాకేజీలో భాగంగా… షిర్డీ సాయిబాబా ఆలయాన్ని దర్శించుకోవచ్చు.

షిర్డీ సాయిబాబా ఆలయం
షిర్డీ సాయిబాబా ఆలయం

ఈనెలలోనే జర్నీ…

ఈ టూర్ ప్యాకేజీని “సాయి సన్నిధి EX హైదరాబాద్ ”పేరుతో ఆపరేట్ చేస్తున్నారు. ఐఆర్సీటీసీ టూరిజం వెబ్ సైట్ లో ఈ ప్యాకేజీని బుకింగ్ చేసుకోవాలి. జర్నీ డేట్ కంటే ముందే టికెట్లు బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ ప్యాకేజీ ఆగస్ట్ 19 తేదీన అందుబాటులో ఉంది. ఈ తేదీ మిస్ అయితే… మరో తేదీలో ప్లాన్ చేసుకోవచ్చు. https://www.irctctourism.com/ వెబ్ సైట్ ద్వారా టికెట్లను బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది.

  • మొదటి రోజు (బుధవారం) : కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి సాయంత్రం 06:30 గంటలకు అజంతా ఎక్స్‌ప్రెస్ (ట్రైన్ నంబర్ 17064) బయలుదేరుతుంది. రాత్రంతా రైలు ప్రయాణం ఉంటుంది.
  • రెండవ రోజు (గురువారం) : ఉదయం 07:10 గంటలకు మహారాష్ట్రలోని నగర్సోల్ రైల్వే స్టేషన్‌కు చేరుకుంటారు. అక్కడ నుంచి ఐఆర్‌సీటీసీ ఏర్పాటు చేసిన ఏసీ వాహనంలో షిర్డీలోని హోటల్‌కు తీసుకెళ్తారు. హోటల్‌లో చెక్-ఇన్ అయిన తర్వాత భక్తులు తమ సొంత ఖర్చులతో/ఏర్పాట్లతో షిర్డీ సాయిబాబా దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. సాయంత్రం 5:00 గంటలకు హోటల్ నుంచి చెక్-అవుట్ చేసి తిరిగి నాగర్సోల్ స్టేషన్‌కు చేరుకుంటారు. రాత్రి 09:20 గంటలకు బయలుదేరే ట్రైన్ నంబర్ 17063 ద్వారా తిరుగు ప్రయాణమవుతారు.
  • మూడవ రోజు (శుక్రవారం) : ఉదయం 09:45 గంటలకు కాచిగూడ స్టేషన్‌కు చేరుకోవడంతో ఈ పవిత్ర యాత్ర పూర్తవుతుంది.

టూర్ ప్యాకేజీ ధరలు :

ఈ ప్యాకేజీ ధరలు చూస్తే…. సింగిల్ షేరింగ్ కు రూ.7920గా ఉంది. డబుల్ షేరింగ్ కు రూ. 6700,ట్రిపుల్ షేరింగ్ కు రూ. 6690గా ఉంది. కంఫర్ట్ క్లాస్ లో ఈ ధరలు అందుబాటులో ఉన్నాయి. స్టాండర్డ్ క్లాస్ లో చూస్తే ట్రిపుల్ షేరింగ్ కు రూ. 5100, డబుల్ షేరింగ్ కు రూ. 5100, సింగిల్ షేరింగ్ కు రూ. 6370గా నిర్ణయించారు.

ప్రయాణానికి 15 రోజుల కంటే ముందే రద్దు చేసుకుంటే ప్రయాణికుడికి రూ. 250 మినహాయించుకుంటారు.4 నుండి 7 రోజుల ముందు రద్దు చేస్తే 50 శాతం రుసుము మినహాయిస్తారు.ప్రయాణానికి 4 రోజుల కంటే తక్కువ సమయంలో రద్దు చేసుకుంటే ఎలాంటి రిఫండ్ లభించదు.

బుకింగ్ కోసం ఐఆర్‌సీటీసీ అధికారిక వెబ్‌సైట్ irctctourism.com ని సందర్శించవచ్చు లేదా సికింద్రాబాద్‌లోని ఐఆర్‌సీటీసీ కార్యాలయం (ఫోన్: 040-27702407, 9701360701) ను సంప్రదించవచ్చు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More