SCR Special Trains : తిరుపతి వెళ్లే ప్రయాణికులకు గుడ్ న్యూస్... కాచిగూడ - తిరుచానూరు మధ్య ప్రత్యేక రైళ్లు!
South Central Railway Special Trains : ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే కాచిగూడ - తిరుచానూరు మధ్య ప్రత్యేక రైళ్లను నడపనుంది.ఈ రైళ్లు మల్కాజ్‌గిరి, నల్గొండ, గుంటూరు, నెల్లూరు, రేణిగుంట మీదుగా ప్రయాణిస్తాయి. ఇందులో ఏసీ, స్లీపర్, జనరల్ కోచ్‌లు అందుబాటులో ఉంటాయి.
South Central Railway Special Trains : ప్రయాణికుల రద్దీని తట్టుకోవడానికి దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌లోని కాచిగూడ నుండి ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుచానూరు మధ్య ప్రత్యేక రైలు సర్వీసును నడపనున్నట్లు ప్రకటించింది.

షెడ్యూల్ వివరాలు :
- రైలు నంబర్ 07787 (కాచిగూడ - తిరుచానూరు) : ఈ ప్రత్యేక రైలు 23 జులై 2026 (గురువారం) నాడు కాచిగూడ నుండి తిరుచానూరుకు బయల్దేరుతుంది.
- రైలు నంబర్ 07788 (తిరుచానూరు - కాచిగూడ) : ఇక 24 జులై 2026 (శుక్రవారం) నాడు తిరుచానూరు నుండి బయలుదేరి కాచిగూడకు చేరుకుంటుంది.
ఈ ప్రత్యేక రైళ్లు రెండు వైపులా ప్రయాణించేటప్పుడు ముఖ్యమైన స్టేషన్లలో ఆగుతాయి. ఇందులో మల్కాజ్‌గిరి, చర్లపల్లి, నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, తెనాలి, ఒంగోలు, నెల్లూరు ,రేణిగుంట స్టేషన్లు ఉన్నాయి.
ప్రయాణికుల సౌకర్యార్థం ఈ ప్రత్యేక రైళ్లలో అన్ని రకాల క్లాస్‌లను అందుబాటులో ఉంచారు. ఇందులో ఏసీ 2 టైర్ , ఏసీ 3 టైర్, స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ (General Second Class) కోచ్‌లు ఉంటాయి. తిరుపతి /తిరుచానూరు వెళ్లే ప్రయాణికులు ఈ ప్రత్యేక రైలు సర్వీసును ఉపయోగించుకోవాలని దక్షిణ మధ్య రైల్వే కోరింది.
చర్లపల్లి - కేరళ మధ్య ప్రత్యేక రైళ్లు:
పండుగలు, సెలవుల నేపథ్యంలో ప్రయాణికుల రద్దీని తట్టుకునేందుకు దక్షిణ మధ్య రైల్వే మరో నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌లోని చర్లపల్లి నుంచి కేరళలోని కొల్లం స్టేషన్ల మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. ఆగస్టు 14వ తేదీ నుంచి సెప్టెంబరు 5వ తేదీ వరకు మొత్తం ఎనిమిది సర్వీసులు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది.
- చర్లపల్లి - కొల్లం ప్రత్యేక రైలు (నెం.07195): ఈ రైలు ఆగస్టు 14, 21, 28 మరియు సెప్టెంబరు 4 తేదీల్లో చర్లపల్లి నుంచి బయల్దేరుతుంది (మొత్తం 4 సర్వీసులు).
- కొల్లం - చర్లపల్లి ప్రత్యేక రైలు (నెం.07196): ఈ తిరుగు ప్రయాణ రైలు ఆగస్టు 15, 22, 29 మరియు సెప్టెంబరు 5 తేదీల్లో కొల్లం నుంచి ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది (మొత్తం 4 సర్వీసులు).
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

