SCR Special Trains : ప్రయాణికులకు అలర్ట్… చర్లపల్లి - దానాపూర్ ప్రత్యేక రైళ్లు పొడిగింపు, ఆగే స్టేషన్లు ఇవే

South Central Railway Special Trains : ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే అప్డేట్ ఇచ్చింది. చర్లపల్లి - దానాపూర్ మధ్య నడిచే ప్రత్యేక రైళ్లను పొడిగించింది.

Published on: Jul 18, 2026, 15:05:17 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

South Central Railway Trains : రైలు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే తీపి కబురు అందించింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని చర్లపల్లి - దానాపూర్ స్టేషన్ల మధ్య నడిచే ప్రత్యేక రైళ్ల సర్వీసులను పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఇరువైపులా కలిపి మొత్తం 18 సర్వీసులను అందుబాటులోకి తీసుకువచ్చారు.

ప్రత్యేక రైళ్లు
ప్రత్యేక రైళ్లు

టైమింగ్స్ వివరాలు :

  • రైలు నెంబర్ 07091 (చర్లపల్లి - దానాపూర్): ఈ రైలు ప్రతి శనివారం మధ్యాహ్నం 13.00 గంటలకు చర్లపల్లిలో బయలుదేరి, సోమవారం అర్ధరాత్రి 00.30 గంటలకు దానాపూర్ చేరుకుంటుంది. ఈ సర్వీసులు 01.08.2026 నుండి 26.09.2026 వరకు అందుబాటులో ఉంటాయి (మొత్తం 09 సర్వీసులు).
  • రైలు నెంబర్ 07092 (దానాపూర్ - చర్లపల్లి): ఈ తిరుగు ప్రయాణ రైలు ప్రతి సోమవారం తెల్లవారుజామున 03.00 గంటలకు దానాపూర్ లో బయలుదేరి, మంగళవారం ఉదయం 10.00 గంటలకు చర్లపల్లి చేరుకుంటుంది. ఈ సర్వీసులు 03.08.2026 నుండి 28.09.2026 వరకు అందుబాటులో ఉంటాయి (మొత్తం 09 సర్వీసులు).

ప్రధాన స్టాపింగ్‌లు (రైలు ఆగే స్టేషన్లు):

ఈ ప్రత్యేక రైళ్లు కాజీపేట, రామగుండం, సిర్పూర్ కాగజ్‌నగర్, బల్హర్షా, చందా ఫోర్ట్, గోండియా, బాలాఘాట్, నైన్‌పూర్, జబల్‌పూర్, కట్ని, సత్నా, మాణిక్‌పూర్, ప్రయాగ్‌రాజ్ ఛేవ్కీ, పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జంక్షన్, బక్సర్, అరా స్టేషన్లలో ఆగుతాయి.

ఈ ప్రత్యేక రైళ్లలో ప్రయాణికులకు అన్ని రకాల వసతులు కల్పించారు. ఇందులో 2AC, 3AC, స్లీపర్ క్లాస్ (Sleeper Class), జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు అందుబాటులో ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది.

ప్రయాణికులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని తమ ప్రయాణాలను సురక్షితంగా ప్లాన్ చేసుకోవాల్సిందిగా కోరడమైనది. మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్ www.scr.indianrailways.gov.in ను చూడొచ్చు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More