ప్రయాణికులకు అలర్ట్ - చర్లపల్లి రైల్వే స్టేషన్‌లో కొత్త పార్కింగ్ రూల్స్, ఇవిగో వివరాలు

హైదరాబాద్ చర్లపల్లి రైల్వే స్టేషన్ సౌత్ టెర్మినల్ (ప్లాట్‌ఫారమ్-9 వైపు) కొత్త పార్కింగ్, యాక్సెస్ నిబంధనలు అమలులోకి వచ్చాయి. 20 నిమిషాల ఉచిత పికప్, డ్రాప్ సదుపాయంతో పాటు డిజిటల్ టికెటింగ్ అందుబాటులోకి తెచ్చారు.

Published on: Jul 13, 2026, 20:34:00 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

హైదరాబాద్ నగరంలోని రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే కీలక అలర్ట్ జారీ చేసింది. ప్రయాణికుల రద్దీని క్రమబద్ధీకరించడానికి, స్టేషన్ ఆవరణలో వాహనాల రాకపోకలను సులభతరం చేయడానికి చర్లపల్లి రైల్వే స్టేషన్ పరిధిలో సరికొత్త యాక్సెస్, పార్కింగ్ నిబంధనలను ప్రవేశపెట్టారు. స్టేషన్ పరిధిలోని సౌత్ టెర్మినల్, అంటే ప్లాట్‌ఫారమ్ నంబర్ 9 వైపు ఈ కొత్త నిబంధనలు తక్షణమే అమలులోకి వచ్చాయని రైల్వే అధికారులు స్పష్టం చేశారు. ప్రయాణికులను దింపడానికి లేదా పికప్ చేసుకోవడానికి వచ్చే వాహనాల కోసం ప్రత్యేకంగా ఉచిత సమయాన్ని కేటాయించడంతో పాటు నిర్దేశిత రుసుములను ఖరారు చేశారు.

చర్లపల్లి రైల్వే టెర్మినల్
చర్లపల్లి రైల్వే టెర్మినల్

20 నిమిషాలు ఫ్రీ…..

రైల్వే స్టేషన్‌కు వచ్చే సాధారణ వాహనదారులకు ఊరటనిస్తూ 20 నిమిషాల పాటు ఉచిత పికప్ మరియు డ్రాప్ సదుపాయాన్ని కల్పించారు. నిర్ణీత 20 నిమిషాల సమయం దాటితే మాత్రం ఓవర్‌స్టే ఫీజు వర్తిస్తుంది. దీని ప్రకారం… పికప్ లేన్‌లో నిలిపే వాహనాలకు 20 నిమిషాల నుండి 30 నిమిషాల వరకు రూ. 50, 30 నిమిషాల నుండి 45 నిమిషాల వరకు రూ. 100, 45 నిమిషాల నుండి 60 నిమిషాల వరకు రూ. 200 వసూలు చేస్తారు. వాహనాన్ని ఒక గంట కంటే ఎక్కువ సమయం నిలిపితే రూ. 500 భారీ జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి ప్రయాణికులు అదనపు రుసుముల భారం పడకుండా ముందస్తుగా ప్లాన్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

మరోవైపు స్టేషన్ వద్ద వాహనాలను ఎక్కువ సమయం పార్కింగ్ చేయాలనుకునే వారి కోసం ప్రత్యేక పార్కింగ్ జోన్‌ను ఏర్పాటు చేశారు. ఇక్కడ గంటల వారీగా ధరలను నిర్ణయించారు. ఫోర్ వీలర్స్ (కార్లు, ఇతర నాలుగు చక్రాల వాహనాలు) పార్కింగ్ చేయడానికి మొదటి రెండు గంటలకు రూ. 20 వసూలు చేస్తారు. అలాగే టూ వీలర్స్, త్రీ వీలర్స్ (ద్విచక్ర వాహనాలు, ఆటోలు) నిలపడానికి మొదటి రెండు గంటలకు రూ. 15 రుసుము ఉంటుంది. ఈ మొదటి రెండు గంటల సమయం ముగిసిన తర్వాత, ఆపై ప్రతి అదనపు గంటకు రూ. 10 చొప్పున అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.

ఈ మొత్తం పార్కింగ్ , నిబంధనల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించడానికి దక్షిణ మధ్య రైల్వే అత్యాధునిక సాంకేతికతను అందుబాటులోకి తెచ్చింది. వాహనదారుల సౌకర్యార్థం డిజిటల్ టికెటింగ్ మరియు డిజిటల్ రసీదుల (Digital Ticketing & Receipts) విధానాన్ని ప్రవేశపెట్టారు. క్యూ లైన్లలో వేచి ఉండే అవసరం లేకుండా క్యూఆర్ కోడ్ స్కానింగ్ ద్వారా డిజిటల్ పద్ధతిలో రుసుములు చెల్లించేలా ఏర్పాట్లు చేశారు. చర్లపల్లి స్టేషన్ మీదుగా ప్రయాణించే వారు ఈ మార్పులను గమనించి రైల్వే సిబ్బందికి సహకరించాలని అధికారులు కోరారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More