చర్లపల్లి నుంచి నడిచే ఈ ప్రత్యేక రైళ్ల సర్వీసులు పొడిగింపు

దక్షిణ మధ్య రైల్వే.. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని కీలక నిర్ణయం తీసుకున్నది. పలు ప్రత్యేక రైళ్ల సేవలను రైల్వే శాఖ పొడిగించింది.

Published on: Jul 2, 2026, 12:39:54 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

చర్లపల్లి నుంచి నడిచే పలు ప్రత్యేక రైళ్లను దక్షిణ మధ్య రైల్వే పొడిగిస్తూ ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో చాలా మంది ప్రయాణికులకు ఎంతగానో లబ్ధిచేకూరనుంది. దక్షిణ మధ్య రైల్వే పొడిగించిన రైళ్లు ఏ తేదీల్లో ఉన్నాయో తెలుసుకోండి.

దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైలు
దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైలు

చర్లపల్లి-షాలిమార్

ట్రైన్ నెంబర్ 08045 షాలిమార్-చర్లపల్లి మధ్య నడిచే రైలు ప్రతీ శుక్రవారం నడుస్తుంది. 03.07.2026, 10.07.2026, 17.07.2026, 24.07.2026, 31.07.2026 తేదీల్లో మెుత్తం 5 సర్వీసులు ఉన్నాయి.

08046 నెంబర్ ట్రైన్ చర్లపల్లి-షాలిమార్ మధ్య నడవనుంది. ప్రతీ శనివారం ఈ సర్వీస్ 04.07.2026, 11.07.2026, 18.07.2026, 25.07.2026, 01.08.2026 తేదీల్లో నడవనున్నాయి.

చర్లపల్లి-పాట్నా

ట్రైన్ నెంబర్ 03253 పాట్నా-చర్లపల్లి మధ్య సోమవారం, బుధవారంలో ఉండనుంది. 20.07.2026 టూ 29.07.2026 మధ్య నాలుగు సర్వీసులు ఉన్నాయి.

03254 ట్రైన్ చర్లపల్లి-పాట్నా బుధవారం నడుస్తుంది. 22.07.2026 టూ 29.07.2026 వరకు సర్వీసు నడవనున్నాయి.

ట్రైన్ నెంబర్ 03255 చర్లపల్లి-పాట్నా మధ్య ప్రతీ శుక్రవారం 24.07.2026 నుంచి 31.07.2026 మధ్య రెండు సర్వీసులు నడవనున్నాయి.

నల్గొండ రైల్వే స్టేషన్‌ పునారాభివృద్ధి

ప్రయాణికులకు ప్రపంచ స్థాయి సౌకర్యాలను అందించేందుకు దేశవ్యాప్తంగా స్టేషన్లను పునరాభివృద్ధి చేయాలనే లక్ష్యంతో, భారతీయ రైల్వే అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ (ABSS) ద్వారా అభివృద్ధి పనులు చేపడుతోంది. తెలంగాణలో రూ.2,000 కోట్లకు పైగా అంచనా వ్యయంతో 40 రైల్వే స్టేషన్లు పునరాభివృద్ధి అవుతున్నాయి.

దక్షిణ మధ్య రైల్వేలోని సికింద్రాబాద్ డివిజన్ పరిధిలో ఉన్న నల్గొండ రైల్వే స్టేషన్‌ను రూ.17.01 కోట్ల వ్యయంతో పునరాభివృద్ధి చేస్తున్నారు. ఈ స్టేషన్ ప్రతిరోజూ దాదాపు 3,000 మంది ప్రయాణికులకు సేవలు అందిస్తుంది. రోజుకు సుమారు 44 రైళ్లను నిర్వహిస్తుంది. ఉపాధి, వ్యాపార ప్రయోజనాల కోసం హైదరాబాద్ నగరానికి, ముఖ్యంగా సికింద్రాబాద్, కాచిగూడ, లింగంపల్లికి ప్రయాణించే ప్రయాణికులకు ఇది ఒక కీలకమైన ప్రయాణ కేంద్రంగా పనిచేస్తుంది.

తెలంగాణ దక్షిణ భాగంలో ఉన్న నల్గొండ రైల్వే స్టేషన్‌ను నాన్ సబర్బన్ గ్రేడ్-4 స్టేషన్‌గా వర్గీకరించారు. ఇది దక్షిణ మధ్య రైల్వేలోని సికింద్రాబాద్ డివిజన్ పరిధిలోకి వస్తుంది. నాడికుడి – బీబీ నగర్ సెక్షన్‌లో ఉంది. ఈ ప్రాంతంలోని ప్రయాణికులను హైదరాబాద్ నగరానికి, ఇతర చుట్టుపక్కల ప్రాంతాలకు అనుసంధానించడంలో ఈ స్టేషన్ కీలక పాత్ర పోషిస్తుంది.

నల్గొండ స్టేషన్‌లో అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద ప్రతిపాదించిన పునరాభివృద్ధి పనులలో భాగంగా 12 మీటర్ల వెడల్పు గల ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం, 3,309 చదరపు మీటర్ల ప్లాట్‌ఫారాలపై అదనపు కవర్ ఏర్పాటు, ల్యాండ్‌స్కేపింగ్‌తో సర్క్యులేటింగ్ ఏరియా అభివృద్ధి, 9,657 చదరపు మీటర్ల ప్లాట్‌ఫాం సర్ఫేసింగ్, కాన్‌కోర్స్, వీఐపీ లాంజ్, వెయిటింగ్ హాల్స్, టాయిలెట్ల అంతర్గత పునరుద్ధరణ ఉన్నాయి.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More