రైలు ప్రయాణికులకు అలర్ట్... వైజాగ్ - కిరండూల్ ప్యాసింజర్ రైళ్ల పాక్షిక రద్దు! వివరాలివే

Visakhapatnam Kirandul Passenger Train Updates : కమ్లూర్-భాన్సీ రైల్వే సెక్షన్‌లో డబ్లింగ్ పనులు కొనసాగుతున్నాయి. ఈ కారణంగా విశాఖపట్నం-కిరండూల్ ప్యాసింజర్ రైళ్లను జూన్ 22 నుండి 26 వరకు దంతేవాడ స్టేషన్ల మధ్య పాక్షికంగా రద్దు చేస్తున్నట్లు దక్షిణ కోస్తా రైల్వే ప్రకటించింది.

Published on: Jun 22, 2026, 13:21:52 IST
By , Visakhapatnam
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Visakhapatnam Kirandul Passenger Train Updates : రైలు ప్రయాణికులకు సౌత్ కోస్ట్ రైల్వే కీలక అలర్ట్ ఇచ్చింది. కమ్లూర్ – భాన్సీ రైల్వే సెక్షన్ పరిధిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా సాగుతున్న రైల్వే లైన్ డబ్లింగ్ (రెండో లైన్) పనుల కోసం భారీ ట్రాఫిక్ బ్లాక్‌ను విధించారు. ఈ పనుల నిర్వహణ కారణంగా విశాఖపట్నం – కిరండూల్ మధ్య నడిచే ప్యాసింజర్ రైళ్ల సర్వీసులలో తాత్కాలిక మార్పులు చేసినట్లు వెల్లడించింది. కొన్ని రైళ్లను గమ్యస్థానానికి ముందే నిలిపివేయడం (షార్ట్ టెర్మినేట్), మరికొన్ని రైళ్లను మధ్యలోనే ప్రారంభించడం (షార్ట్ ఒరిజినేట్) చేస్తున్నట్లు పేర్కొంది.

వైజాగ్-కిరండూల్ ప్యాసింజర్ రైళ్ల పాక్షిక రద్దు
వైజాగ్-కిరండూల్ ప్యాసింజర్ రైళ్ల పాక్షిక రద్దు

డబ్లింగ్ పనులు - ఈ రైళ్లపై ప్రభావం

  • విశాఖపట్నం – కిరండూల్ ప్యాసింజర్ (రైలు నంబర్ 58501): ఈ రైలును 2026 జూన్ 22వ తేదీ నుండి జూన్ 25వ తేదీ వరకు దంతేవాడ స్టేషన్ లోనే నిలిపివేస్తారు. అంటే ఈ నాలుగు రోజుల పాటు ఈ రైలు విశాఖపట్నం నుండి దంతేవాడ వరకు మాత్రమే నడుస్తుంది. దంతెవాడ – కిరండూల్ మధ్య ఈ రైలు సేవలను పాక్షికంగా రద్దు చేశారు.
  • కిరండూల్ – విశాఖపట్నం ప్యాసింజర్ (రైలు నంబర్ 58502): తిరుగు ప్రయాణంలో ఈ రైలు 2026 జూన్ 23వ తేదీ నుండి జూన్ 26వ తేదీ వరకు కిరండూల్‌కు బదులుగా దంతెవాడ స్టేషన్ నుంచే తన ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది. ఈ నాలుగు రోజుల పాటు కిరండూల్ – దంతేవాడ మధ్య ఈ రైలు సర్వీసు అందుబాటులో ఉండదు.

రైల్వే లైన్ సామర్థ్యాన్ని పెంచేందుకు, ప్రయాణ సమయాన్ని తగ్గించేందుకు ఈ డబ్లింగ్ పనులు చేపట్టారు. ప్రయాణికులు ఈ తాత్కాలిక మార్పులను గమనించి, అందుకు అనుగుణంగా తమ ప్రయాణ ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని అధికారులు ఓ ప్రకటన ద్వారా కోరారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More