నీట్ అభ్యర్థులకు అలర్ట్…. చర్లపల్లి - తిరుపతి మధ్య ప్రత్యేక రైలు, హాల్ట్ లిస్ట్

నీట్ పరీక్షల నేపథ్యంలో ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. చర్లపల్లి - తిరుపతి మధ్య ప్రత్యేక జనరల్ రైలును నడుపుతున్నట్లు ప్రకటించింది.

Published on: Jun 21, 2026, 12:22:18 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహించే నీట్ (NEET) పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు, వారి తల్లిదండ్రుల సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్షల సమయంలో ప్రయాణికుల నుంచి వచ్చే విపరీతమైన రద్దీని తట్టుకునేందుకు వీలుగా హైదరాబాద్‌లోని చర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి తిరుపతికి ప్రత్యేక రైలును నడుపుతోంది. ఈ మేరకు రైల్వే అధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు.

చర్లపల్లి - తిరుపతి మధ్య ప్రత్యేక రైలు (ఫైల్ ఫొటో) (image source Pixel)
చర్లపల్లి - తిరుపతి మధ్య ప్రత్యేక రైలు (ఫైల్ ఫొటో) (image source Pixel)

రైల్వే శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం…… చర్లపల్లి - తిరుపతి(రైలు నంబర్ 07052) ప్రత్యేక రైలు ఆదివారం(ఇవాళ) రాత్రి 8:25 గంటలకు చర్లపల్లి స్టేషన్ నుంచి బయలుదేరుతుంది. ఇది మరుసటి రోజు (సోమవారం) మధ్యాహ్నం 1:15 గంటలకు తిరుపతి స్టేషన్‌కు చేరుకుంటుంది. సుదూర ప్రాంతాల నుంచి పరీక్షలకు వెళ్లే విద్యార్థులకు ఆర్థిక భారం కాకుండా ఉండేందుకు వీలుగా ఈ రైలులో కేవలం జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లను మాత్రమే అందుబాటులో ఉంచారు.

స్టాపింగ్స్ వివరాలు …

ఈ స్పెషల్ ట్రైన్…. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని పలు కీలక జంక్షన్లు, స్టేషన్లలో ఆగుతుందని రైల్వే అధికారులు తెలిపారు.

  • కాచిగూడ
  • షాద్‌నగర్
  • జడ్చర్ల
  • మహబూబ్‌నగర్
  • గద్వాల్
  • కర్నూల్ సిటీ
  • డోన్
  • గుంతకల్
  • గుత్తి
  • తాడిపత్రి
  • ఎర్రగుంట్ల
  • కడప
  • రాజంపేట
  • కోడూరు
  • రేణిగుంట

ఈ రూట్లలో ప్రయాణించే అభ్యర్థులకు ఈ రైలు ఎంతో ఉపయోగపడనుంది. నీట్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు, వారితో పాటు వచ్చే తల్లిదండ్రులు ట్రాఫిక్ ఇబ్బందులు, ప్రైవేట్ వాహనాల ఖర్చులను నివారించడానికి ఈ ప్రత్యేక రైలు సర్వీసును పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారులు సూచించారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More