దక్షిణ కోస్తా రైల్వే జోన్.. విశాఖ డివిజన్ రూట్ మ్యాప్, రైలు కార్యకలాపాలు ఎలా ఉంటాయి?

ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలు ప్రారంభం అయ్యాయి. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.

Published on: Jun 1, 2026, 09:48:16 IST
By , Visakhapatnam
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఆంధ్రప్రదేశ్ ప్రజల దశాబ్దాల నాటి కల సాకారమైంది. భారతీయ రైల్వేలో సరికొత్త అధ్యాయం మొదలైంది. దేశంలోనే కొత్తగా ఏర్పాటైన సౌత్ కోస్ట్ రైల్వే (SCoR - దక్షిణ కోస్తా రైల్వే) జోన్ నేటి నుంచే (జూన్ 1) తన అధికారిక కార్యకలాపాలను ప్రారంభించింది.

దక్షిణ కోస్తా రైల్వే
దక్షిణ కోస్తా రైల్వే

గత ఏడాది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశాఖపట్నంలో ఈ జోన్ ప్రధాన కార్యాలయానికి శంకుస్థాపన చేసిన సంగతి తెలిసిందే. తాజా జోన్ ఏర్పాటుతో దేశంలో మొత్తం రైల్వే జోన్ల సంఖ్య 18కి చేరుకుంది. ఈ చారిత్రాత్మక ఘట్టంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందిస్తూ.. 'దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రారంభం కావడంతో ఏపీ ప్రజల చిరకాల కాంక్ష నెరవేరింది. ఈ కొత్త జోన్ ఉత్తరాంధ్ర రవాణా రంగాన్ని, ఆర్థిక ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చేయబోతోంది.' అని ఎక్స్ వేదికగా హర్షం వ్యక్తం చేశారు.

రైల్వే చట్టం 1989 ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఈ కొత్త జోన్ ఏర్పాటుకు సంబంధించి గత మే 4వ తేదీన గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రస్తుతమున్న ఈస్ట్ కోస్ట్ రైల్వే (ECoR), సౌత్ సెంట్రల్ రైల్వే (SCR) జోన్లను పునర్వ్యవస్థీకరించి దీనిని ఏర్పాటు చేశారు.

ఈ నోటిఫికేషన్ ప్రకారం.. ఈస్ట్ కోస్ట్ రైల్వే పరిధిలోని ప్రసిద్ధ వాల్తేరు డివిజన్ రెండు ముక్కలైంది. ఒక భాగం ఈస్ట్ కోస్ట్ రైల్వేలోనే ఉంటూ.. 'రాయగడ డివిజన్'గా రూపాంతరం చెందింది. రెండో భాగం కొత్తగా ఏర్పడిన సౌత్ కోస్ట్ రైల్వేలో విలీనమై.. 'విశాఖపట్నం డివిజన్'గా మారింది.

కొత్త విశాఖపట్నం డివిజన్ రూట్ వివరాలు (మొత్తం పొడవు: 463 కి.మీ)

  • ఇచ్చాపురం – పలాస – విశాఖపట్నం – దువ్వాడ (270 రూట్ కి.మీ)
  • విజయనగరం – కునేరు (102 రూట్ కి.మీ)
  • నౌపడ జంక్షన్ – పర్లాకిమిడి(39 రూట్ కి.మీ)
  • బొబ్బిలి జంక్షన్ – సాలూరు (17 రూట్ కి.మీ)

పెరిఫెరల్ లైన్స్ (సింహాచలం నార్త్-దువ్వాడ బైపాస్, వడలపూడి-దువ్వాడ, విశాఖపట్నం-జగ్గయ్యపాలెం తదితరాలు కలిపి - 35 రూట్ కి.మీ)

దక్షిణ తీర రైల్వే జోన్ పరిధిలోని 4 డివిజన్లు

ఈ కొత్త జోన్ ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ అంతటా విస్తరించి ఉండటంతో పాటు తెలంగాణ, తమిళనాడులోని కొన్ని ప్రాంతాలకు కూడా సేవలందిస్తుంది. రైళ్ల నిర్వహణ సామర్థ్యాన్ని పెంచడానికి, మౌలిక సదుపాయాల అభివృద్ధిని వేగవంతం చేయడానికి ఈ జోన్ ఉపయోగపడుతుంది.

  • విశాఖపట్నం (కొత్తగా పునర్వ్యవస్థీకరించబడింది)
  • విజయవాడ
  • గుంటూరు
  • గుంతకల్

జూన్ 1 నుంచి కార్యకలాపాలు ప్రారంభించిన ఈ జోన్ పరిధిలో వేల మంది ఉద్యోగులు/సిబ్బంది విధులు నిర్వహిస్తారు. రద్దీ సమయాల్లో ఈ జోన్ రోజూ 500 కంటే ఎక్కువ ప్యాసింజర్ రైళ్లను, 800కు పైగా గూడ్స్ (సరుకు రవాణా) రైళ్లను పర్యవేక్షించగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. రాష్ట్రంలో దక్షిణ కోస్తా రైల్వే జోన్ పరిధి 3532 కిలోమీటర్ల ఉంటుంది.

ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన రేవులైన విశాఖపట్నం పోర్ట్, గంగవరం పోర్ట్, కృష్ణపట్నం పోర్ట్, కాకినాడ పోర్ట్‌లతో పాటు త్వరలో రాబోతున్న మూలపేట పోర్ట్ సరుకు రవాణాకు, మల్టీమోడల్ లాజిస్టిక్స్‌కు ఈ జోన్ అత్యంత కీలకంగా మారనుంది.

రైళ్ల మెయింటెనెన్స్ కోసం విజయవాడ, గుంతకల్, తిరుపతి, విశాఖపట్నం నగరాల్లో వ్యాగన్ మెయింటెనెన్స్ డిపోలు, ఎలక్ట్రిక్ & డీజిల్ లోకో షెడ్‌లు, కోచ్ కేర్ సెంటర్లు వంటి అత్యాధునిక సదుపాయాలను ఈ జోన్ కలిగి ఉంది.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More