ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రయాణికులకు రైల్వే శాఖ బిగ్ అలర్ట్.. అనేక ట్రైన్లు క్యాన్సిల్

దక్షిణ మధ్య రైల్వే తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు కీలక అప్డేట్ ఇచ్చింది. ఆగస్టు నెలలో అనేక ట్రైన్లను రద్దు చేస్తున్నట్టుగా ప్రకటించింది. కాజీపేట - కొండపల్లి సెక్షన్ పరిధిలో నడిచే పనులు ఇందుకు కారణంగా తెలిపింది.

Published on: Jun 15, 2026, 17:17:03 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తెలుగు రాష్ట్రాల గుండా ప్రయాణించే రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే కీలక అలర్ట్ జారీ చేసింది. కాజీపేట - కొండపల్లి సెక్షన్ పరిధిలోని డోర్నకల్, గుండ్రాతిమడుగుస్టేషన్ల మధ్య మూడో రైల్వే లైన్ నిర్మాణ పనుల్లో భాగంగా నాన్-ఇంటర్‌లాకింగ్ పనులు చేపట్టనున్నారు. ఈ ఇంజనీరింగ్ పనుల కారణంగా 2026 ఆగస్టు నెలలో పలు రైళ్లను పూర్తిగా, మరికొన్ని రైళ్లను పాక్షికంగా రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు.

దక్షిణ మధ్య రైల్వే అనేక ట్రైన్లు రద్దు
దక్షిణ మధ్య రైల్వే అనేక ట్రైన్లు రద్దు

ప్రయాణికులు రైలు రద్దు వివరాలను సరిచూసుకుని, ప్రయాణానికి సంబంధించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లను ముందుగానే చేసుకోవాలని రైల్వే శాఖ సూచించింది. దీనివల్ల కలిగే అసౌకర్యానికి దక్షిణ మధ్య రైల్వే చింతిస్తోందని పేర్కొంది.

పూర్తిగా రద్దైన ట్రైన్లు

రైలు నెంబర్. 67765 (కాజీపేట - డోర్నకల్), నెం. 67766 (డోర్నకల్ - కాజీపేట), నెం. 67767 (డోర్నకల్ - విజయవాడ), నెం. 67768 (విజయవాడ - డోర్నకల్), నెం. 67215 (విజయవాడ - భద్రాచలం), నెం. 67216 (భద్రాచలం - విజయవాడ), విజయవాడ-సికింద్రాబాద్ నడుమ రైళ్లు కూడా ఆగస్టు 15, 2026 నుండి ఆగస్టు 19, 2026 వరకు పూర్తిగా రద్దయ్యాయి.

విజయవాడ - సికింద్రాబాద్ (12713/12714): ఆగస్టు 15 నుండి ఆగస్టు 19 వరకు రద్దు.

గుంటూరు - సికింద్రాబాద్ (12705/12706): ఆగస్టు 19, 2026న రద్దు.

సికింద్రాబాద్ - భద్రాచలం (17659): ఆగస్టు 17, 18 తేదీల్లో రద్దు.

భద్రాచలం - సికింద్రాబాద్ (17660): ఆగస్టు 18, 19 తేదీల్లో రద్దు.

సికింద్రాబాద్ - మణుగూరు (12745): ఆగస్టు 17, 18 తేదీల్లో రద్దు.

మణుగూరు - సికింద్రాబాద్ (12746): ఆగస్టు 18, 19 తేదీల్లో రద్దు.

విశాఖపట్నం - మహబూబ్‌నగర్ (12861): ఆగస్టు 16, 17, 18 తేదీల్లో రద్దు.

మహబూబ్‌నగర్ - విశాఖపట్నం (12862): ఆగస్టు 17, 18, 19 తేదీల్లో రద్దు.

కాకినాడ టౌన్ - లింగంపల్లి (12775): ఆగస్టు 16, 17, 18 తేదీల్లో రద్దు.

లింగంపల్లి - కాకినాడ టౌన్ (12776): ఆగస్టు 17, 18, 19 తేదీల్లో రద్దు.

పాక్షిక రద్దు

రైలు నెం. 17201 (గుంటూరు - సికింద్రాబాద్): ఆగస్టు 15 నుండి ఆగస్టు 19 వరకు గుంటూరు - కాజీపేట మధ్య పాక్షికంగా రద్దు చేశారు (అంటే ఈ రైలు కేవలం కాజీపేట నుండి సికింద్రాబాద్ వరకు మాత్రమే నడుస్తుంది).

రైలు నెం. 17202 (సికింద్రాబాద్ - గుంటూరు): ఆగస్టు 15 నుండి ఆగస్టు 19 వరకు కాజీపేట - గుంటూరు మధ్య పాక్షికంగా రద్దు అయింది.

రైలు నెం. 17033 (భద్రాచలం - బల్హర్షా): ఆగస్టు 16 నుండి ఆగస్టు 19 వరకు భద్రాచలం - వరంగల్ మధ్య పాక్షికంగా రద్దు చేశారు.

రైలు నెం. 17034 (సిర్పూర్ టౌన్ - భద్రాచలం): ఆగస్టు 15 నుండి ఆగస్టు 18 వరకు వరంగల్ - భద్రాచలం మధ్య పాక్షికంగా రద్దు అయింది.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More