TG Court Recruitment 2026 : తెలంగాణ జిల్లా కోర్టు ఉద్యోగాల అప్డేట్ - హాల్ టికెట్లు విడుదల, డౌన్లోడ్ లింక్ ఇదిగో

Telangana Court Recruitment 2026 : జిల్లా కోర్టుల్లోని జూనియర్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్, రికార్డ్ అసిస్టెంట్ పోస్టుల పరీక్షల హాల్ టికెట్లు విడుదలయ్యాయి. జూన్ 24 నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి.

Published on: Jun 18, 2026, 17:28:05 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Telangana Court Recruitment 2026 : తెలంగాణ సబార్డినేట్ కోర్టుల్లో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ అభ్యర్థులకు హైకోర్టు కీలక అప్‌డేట్ ఇచ్చింది. జుడీషియల్ మినిస్టీరియల్, సబార్డినేట్ సర్వీస్ నిబంధనల ప్రకారం వివిధ పోస్టుల భర్తీకి నిర్వహించబోయే కంప్యూటర్ ఆధారిత రాత పరీక్షల (CBT) హాల్ టికెట్లను అధికారికంగా విడుదల చేసింది. ఈ పరీక్షలకు సంబంధించిన ఎగ్జామ్ షెడ్యూల్ ను హైకోర్టు ఇదివరకే ప్రకటించిన సంగతి తెలిసిందే.

కోర్టు ఉద్యోగాలు - హాల్ టికెట్లు విడుదల
కోర్టు ఉద్యోగాలు - హాల్ టికెట్లు విడుదల

ఈ ఏడాది జనవరి 19న విడుదల చేసిన నోటిఫికేషన్ల ద్వారా జూనియర్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్, రికార్డ్ అసిస్టెంట్ పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులను స్వీకరించారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులందరికీ జూన్ 24వ తేదీ నుంచి కంప్యూటర్ ఆధారిత పరీక్షలను నిర్వహించాలని హైకోర్టు నిర్ణయించింది.

పరీక్షల పూర్తి షెడ్యూల్ వివరాలు:

  • ఎగ్జామినర్ : ఈ పోస్టుకు జూన్ 24న మొదటి షిఫ్ట్‌లో పరీక్ష నిర్వహిస్తారు.
  • ఫీల్డ్ అసిస్టెంట్ : ఈ పోస్టుకు జూన్ 24న రెండు మరియు మూడో షిఫ్ట్‌లలో (షిఫ్ట్ 2, షిఫ్ట్ 3) పరీక్షలు జరుగుతాయి.
  • జూనియర్ అసిస్టెంట్ : ఈ పోస్టుకు జూన్ 25న మూడు షిఫ్ట్‌లలో (షిఫ్ట్ 1, షిఫ్ట్ 2, షిఫ్ట్ 3) పరీక్షలు నిర్వహిస్తారు.
  • రికార్డ్ అసిస్టెంట్ : ఈ పోస్టుకు జూన్ 28న రెండు షిఫ్ట్‌లలో (షిఫ్ట్ 1, షిఫ్ట్ 2) పరీక్షలు జరుగుతాయి.

హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకునే విధానం:

అభ్యర్థులు తమ హాల్‌ టికెట్ల కోసం తెలంగాణ హైకోర్టు అధికారిక వెబ్‌సైట్ www.tshc.gov.in ను సందర్శించాల్సి ఉంటుంది. వెబ్‌సైట్ హోంపేజీలో రిక్రూట్‌మెంట్ ట్యాబ్‌పై క్లిక్ చేసి…. సంబంధిత లింక్ ద్వారా అభ్యర్థులు తమ యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ వివరాలను నమోదు చేసి లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత స్క్రీన్‌పై కనిపించే హాల్ టికెట్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. అప్పుడు మీ హాల్ టికెట్ డిస్‌ప్లే అవుతుంది. పరీక్షకు వెళ్లేందుకు వీలుగా అభ్యర్థులు దీనిని ప్రింట్ లేదా డౌన్‌లోడ్ ఆప్షన్ ద్వారా భద్రపరుచుకోవచ్చు.

నియామక పరీక్షలకు సంబంధించి అభ్యర్థులకు ఏవైనా సందేహాలు లేదా సాంకేతిక సమస్యలు ఉంటే వాటిని నివృత్తి చేసుకోవడానికి వీలుగా హైకోర్టు ఒక ప్రత్యేక హెల్ప్ డెస్క్ నంబర్‌ను అందుబాటులోకి తెచ్చింది. అభ్యర్థులు మరింత సమాచారం లేదా సాయం కోసం 040-23688394 నంబర్‌ను సంప్రదించవచ్చని అధికారులు తెలిపారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More