Railway Update : తెలంగాణ, ఏపీ మీద నుంచి నడిచే ఈ రైళ్లు రద్దు.. కొన్ని దారి మళ్లింపు

Railway Update : రైల్వే శాఖ ప్రయాణికులకు కీలక అప్డేట్ ఇచ్చింది. బొంబాయి డివిజన్‌ కొండచరియలు విరిగిపడినందున పలు రైళ్లను రద్దు చేసింది. మరికొన్నింటిని దారి మళ్లించింది.

Published on: Jul 18, 2026, 13:46:05 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

భారతీయ రైల్వే ప్రయాణికులకు అలర్ట్ ఇచ్చింది. సెంట్రల్ రైల్వే పరిధిలోని బొంబాయి డివిజన్‌లో కొండచరియలు విరిగిపడటం కారణంగా కొన్ని రైళ్లు రద్దు చేసింది. మరికొన్నింటిని దారి మళ్లించింది. ఏయే ట్రైన్లు రద్దు అయ్యాయో.. ఏ రైళ్లు దారి మళ్లించారో తెలుసుకోండి.

రైల్వే అప్డేట్
రైల్వే అప్డేట్

రద్దైన రైళ్లు

రైలు నెం. 22731 హైదరాబాద్ – సీఎస్‌టి ముంబై ఎక్స్‌ప్రెస్ ప్రయాణం 18 జూలై 2026 నుండి 24 జూలై 2026 వరకు.

రైలు నెం. 22732 సీఎస్‌టీ ముంబై - హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్ ప్రయాణం 18 జూలై 2026 నుండి 24 జూలై 2026 వరకు.

రైలు నెం. 22157 సీఎస్‌టి ముంబై - చెన్నై సెంట్రల్ ఎక్స్‌ప్రెస్ ప్రయాణం 18 జూలై 2026 నుండి 24 జూలై 2026 వరకు.

రైలు నెం. 22158 చెన్నై సెంట్రల్ - సీఎస్‌‌టీ ముంబై ఎక్స్‌ప్రెస్ ప్రయాణం 18 జూలై 2026 నుండి 24 జూలై 2026 వరకు.

రైళ్ల మళ్లింపు

16 జూలై 2026 నుండి 22 జూలై 2026 వరకు ప్రయాణించే రైలు నెం. 18519 విశాఖపట్నం - ఎల్‌టీటీ ముంబై ఎక్స్‌ప్రెస్.. దౌండ్ – మన్మాడ్ – ఇగత్‌పురి – కళ్యాణ్ మీదుగా మళ్లిస్తారు.

17 జూలై 2026న ప్రారంభమయ్యే రైలు నెం.20919 చెన్నై సెంట్రల్ - ఏక్తా నగర్ ఎక్స్‌ప్రెస్ ప్రయాణాన్ని దౌండ్ – మన్మాడ్ – జల్గావ్ – పల్ధి – సూరత్ మీదుగా మళ్లించనున్నారు.

19 జూలై 2026న ప్రారంభమయ్యే రైలు నెం. 09420 తిరుచిరాపల్లి - అహ్మదాబాద్ ఎక్స్‌ప్రెస్ ప్రయాణాన్ని దౌండ్ – మన్మాడ్ – జల్గావ్ – పల్ధి – సూరత్ మీదుగా మళ్లించనున్నారు.

17 జూలై 2026న ప్రారంభమయ్యే రైలు నెం. 22102 మదురై - LTT ముంబై ఎక్స్‌ప్రెస్ ప్రయాణాన్ని దౌండ్ – మన్మాడ్ – ఇగత్‌పురి – కళ్యాణ్ మీదుగా మళ్లిస్తారు.

20 జూలై 2026న ప్రారంభమయ్యే రైలు నెం. 11018 కారైకల్ - ఎల్‌టీటీ ముంబై ఎక్స్‌ప్రెస్ ప్రయాణాన్ని దౌండ్ – మన్మాడ్ – ఇగత్‌పురి – కళ్యాణ్ మీదుగా మళ్లించనున్నారు.

18 జూలై 2026, 20 జూలై 2026, 21 జూలై 2026 తేదీలలో ప్రారంభమయ్యే రైలు నెం. 22718 సికింద్రాబాద్ - రాజ్‌కోట్ ఎక్స్‌ప్రెస్ ప్రయాణాన్ని దౌండ్ – మన్మాడ్ – జల్గావ్ – పల్ధి – సూరత్ మీదుగా మళ్లించనున్నారు.

22 జూలై 2026న ప్రారంభమయ్యే రైలు నెం. 20967 సికింద్రాబాద్ - పోర్‌బందర్ ఎక్స్‌ప్రెస్ ప్రయాణాన్ని దౌండ్ – మన్మాడ్ – జల్గావ్ – పల్ధి – సూరత్ మీదుగా మళ్లించనున్నారు.

17 జూలై 2026న ప్రారంభమయ్యే రైలు నెం. 16614 కోయంబత్తూరు - రాజ్‌కోట్ ఎక్స్‌ప్రెస్ ప్రయాణం దౌండ్ – మన్మాడ్ – జల్గావ్ – పల్ధి – సూరత్ మీదుగా మళ్లింపు ఉంటుంది.

22 జూలై 2026న ప్రారంభమయ్యే రైలు నెం. 20920 ఏక్తా నగర్ - చెన్నై సెంట్రల్ ఎక్స్‌ప్రెస్ ప్రయాణం సూరత్ – పల్ధి – మన్మాడ్ – దౌండ్ – సోలాపూర్ మీదుగా వెళ్తుంది.

23 జూలై 2026న ప్రారంభమయ్యే రైలు నెం. 09419 అహ్మదాబాద్ - తిరుచిరాపల్లి ఎక్స్‌ప్రెస్ ప్రయాణం సూరత్ – పల్ధి – మన్మాడ్ – దౌండ్ – సోలాపూర్ మీదుగా మళ్లించబడుతుంది.

22 జూలై 2026న ప్రారంభమయ్యే రైలు నెం. 22101 LTT ముంబై - మదురై ఎక్స్‌ప్రెస్ ప్రయాణాన్ని కళ్యాణ్ – మన్మాడ్ – దౌండ్ – సోలాపూర్ మీదుగా మళ్లించనున్నారు.

18 జూలై 2026న ప్రారంభమయ్యే రైలు నెం. 11017 LTT ముంబై - కారైకల్ ఎక్స్‌ప్రెస్ ప్రయాణాన్ని కళ్యాణ్ – మన్మాడ్ – దౌండ్ – సోలాపూర్ మీదుగా మళ్లించనున్నారు.

20 జూలై 2026, 22 జూలై 2026, 23 జూలై 2026 తేదీలలో ప్రారంభమయ్యే రైలు నెం. 22717 రాజ్‌కోట్ - సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్ ప్రయాణం సూరత్ – పల్ధి – మన్మాడ్ – దౌండ్ – సోలాపూర్ మీదుగా మళ్లిస్తారు.

21 జూలై 2026న ప్రారంభమయ్యే రైలు నెం. 20968 పోర్‌బందర్ - సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్ ప్రయాణం సూరత్ – పల్ధి – మన్మాడ్ – దౌండ్ – సోలాపూర్ మీదుగా మళ్లిస్తారు.

18 జూలై 2026 నుండి 24 జూలై 2026 వరకు ప్రయాణించే రైలు నెం. 18520 LTT ముంబై - విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్ కళ్యాణ్ – మన్మాడ్ – దౌండ్ – సోలాపూర్ మీదుగా వెళ్తుంది.

19 జూలై 2026న ప్రారంభమయ్యే రైలు నెం. 16613 రాజ్‌కోట్ - కోయంబత్తూర్ ఎక్స్‌ప్రెస్ ప్రయాణం సూరత్ – పల్ధి – మన్మాడ్ – దౌండ్ – సోలాపూర్ మీదుగా వెళ్తుంది.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More