హైదరాబాద్-గోరఖ్‌పూర్, నాందేడ్-తిరుచానూరు మధ్య ప్రత్యేక రైళ్లు.. స్టాప్స్ ఇవి!

దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. హైదరాబాద్-గోరఖ్‌పూర్, నాందేడ్-తిరుచానూరు మధ్య ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్టుగా ప్రకటించింది.

Published on: Jul 15, 2026, 12:30:11 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

రైల్వే ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు హైదరాబాద్ - గోరఖ్‌పూర్ మధ్య నడుస్తున్న ప్రత్యేక రైలు సర్వీసులను పొడిగించడంతో పాటు నాందేడ్ - తిరుచానూరు మధ్య కొత్తగా స్పెషల్ రైళ్లను నడపనున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. ఈ మేరకు ప్రత్యేక రైళ్ల పూర్తి షెడ్యూల్, సర్వీసుల వివరాలను విడుదల చేసింది.

దక్షిణ మధ్య ప్రత్యేక రైళ్లు
దక్షిణ మధ్య ప్రత్యేక రైళ్లు

రైళ్లు పొడిగింపు

హైదరాబాద్ – గోరఖ్‌పూర్ – హైదరాబాద్ ప్రత్యేక రైళ్ల పొడిగించింది. హైదరాబాద్, గోరఖ్‌పూర్ మధ్య ప్రయాణించే వారి అదనపు రద్దీని తగ్గించడానికి ఈ నిర్ణయం తీసుకుంది.

07075 హైదరాబాద్ - గోరఖ్‌పూర్ 07.08.2026, 14.08.2026, 21.08.2026, 28.08.2026 తేదీల్లో నడుస్తుంది. 07076 గోరఖ్‌పూర్ - హైదరాబాద్ 09.08.2026, 16.08.2026, 23.08.2026, 30.08.2026 తేదీల్లో ఉంటుంది.

2. హెచ్.ఎస్. నాందేడ్ – తిరుచానూరు – హెచ్.ఎస్. నాందేడ్ ప్రత్యేక రైళ్లు (Train No. 07603 / 07604)

ప్రయాణికుల రద్దీని క్లియర్ చేయడానికి నాందేడ్ మరియు ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుచానూరు మధ్య దక్షిణ మధ్య రైల్వే మొత్తం 12 సర్వీసుల ప్రత్యేక రైళ్లను నడుపుతోంది.

ప్రత్యేక రైళ్లు

07603 హెచ్.ఎస్. నాందేడ్ - తిరుచానూరు 21.07.2026 నుంచి 25.08.2026 వరకు 6 సర్వీసులు నడుస్తుంది.

07604 తిరుచానూరు - హెచ్.ఎస్. నాందేడ్ ట్రైన్ 22.07.2026 నుంచి 26.08.2026 వరకు 6 సర్వీసులు నడపనుంది.

నాందేడ్ – తిరుచానూరు ఎక్స్‌ప్రెస్ స్పెషల్ రైళ్లు రెండు వైపులా కింది ముఖ్యమైన రైల్వే స్టేషన్లలో ఆగుతాయి. ముద్ఖేడ్, ధర్మాబాద్, బాసర, నిజామాబాద్, ఆర్మూర్, కోరుట్ల, లింగంపేట జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జమ్మికుంట, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, విజయవాడ, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట స్టేషన్లలో స్టాప్‌లు ఉన్నాయి.

ఈ ప్రత్యేక రైళ్లలో ప్రయాణికులకు మెరుగైన వసతి కల్పించేందుకు థర్డ్ ఏసీ, స్లీపర్ క్లాస్ కోచ్‌లను ఏర్పాటు చేశారు. ప్రయాణికులు ఈ ప్రత్యేక రైలు సర్వీసుల పొడిగింపును ఉపయోగించుకుని తమ ప్రయాణాలను ముందుగానే ప్లాన్ చేసుకోవాలని రైల్వే అధికారులు కోరారు. సీట్ల రిజర్వేషన్, మరిన్ని వివరాల కోసం రైల్వే అధికారిక వెబ్‌సైట్ లేదా ఐఆర్‌సీటీసీ పోర్టల్‌ను సందర్శించవచ్చు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More