నిజామాబాద్ జిల్లాలో 179 అంగన్‌వాడీ పోస్టులు.. ఖాళీలు ఉన్న ప్రాంతాలు ఇవే!

Anganwadi posts in Nizamabad : నిరుద్యోగ మహిళలకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. నిజామాబాద్ జిల్లాలో 179 అంగన్‌వాడీ పోస్టులకు నోటిఫికేషన్ వెల్లడించింది.

Updated on: Jul 9, 2026, 09:49:04 IST
By , Nizamabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ప్రభుత్వం నిరుద్యోగ మహిళలకు శుభవార్త చెప్పింది. నిజామాబాద్‌ జిల్లా మహిళా, శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ పరిధిలోని పలు అంగన్‌వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొదటి విడత కింద జిల్లాలోని 5 ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల పరిధిలో ఈ నియామకాలు ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 15,982 అంగన్‌వాడీ పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇప్పటికే పలు జిల్లాల్లో నోటిఫికేషన్లు వచ్చాయి. మరికొన్ని జిలాల్లో రావాల్సి ఉంది. తాజాగా నిజామాబాద్ జిల్లాలో ఈ ప్రక్రియ మెుదలైంది.

నిజామాబాద్ అంగన్‌వాడీలో ఉద్యోగాలు
నిజామాబాద్ అంగన్‌వాడీలో ఉద్యోగాలు

ఆర్మూర్, భీమ్‌గల్, బోధన్, డిచ్‌పల్లి, నిజామాబాద్ ఐసీడీఎస్ ప్రాజెక్ట్ పరిధిలోని 179 అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్ల పోస్టులకు నోటిఫికేషన్ వెల్లడైంది. అంగన్‌వాడీ టీచర్/హెల్పర్ అభ్యర్థులకు ఇంటర్మీడియట్ (12వ తరగతి) అర్హత ఉండాలి. ఒకవేళ హెల్పర్ పోస్టుకు ఇంటర్ చదివిన వారు అందుబాటులో లేకపోతే.. పదో తరగతి పాసైన వారిని పరిశీలిస్తారు.

దరఖాస్తుదారుల వయసు 18 నుండి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. వినికిడి పరికరాలు పెట్టుకుని వినగలిగే వారు, ఇతరుల సహాయం లేకుండా పనులు చేసుకోగలిగే అంధత్వం ఉన్నవారు, పిల్లలను సంరక్షించగల సామర్థ్యం ఉన్న దివ్యాంగ మహిళలు కూడా ఈ పోస్టులకు అర్హులుగా ప్రభుత్వం పేర్కొంది. ఈ ఉద్యోగాలకు కేవలం స్థానిక మహిళా అభ్యర్థులు మాత్రమే అర్హులు అనే విషయం గుర్తుంచుకోవాలి.

గ్రామీణ ప్రాంతాల వారైతే అంగన్‌వాడీ కేంద్రం ఉన్న గ్రామ పంచాయతీ పరిధిలో, పట్టణ ప్రాంతాల వారైతే సంబంధిత వార్డులో నివసిస్తూ ఉండాలి. ఎస్సీ కాలనీల్లోని పోస్టులకు స్థానిక ఎస్సీ మహిళలు, గిరిజన తండాలు/ఆవాసాల్లోని పోస్టులకు స్థానిక ఎస్టీ మహిళలు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.

జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలోని ఎంపిక కమిటీ ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంది. మొత్తం ఎంపికలో ఇంటర్ మార్కులకు 70 శాతం, వితంతువులకు 5 శాతం, అనాథలకు 10 శాతం, దివ్యాంగులకు 5 శాతం వెయిటేజీ ఉంటుంది. ఇంటర్వ్యూకి 10 మార్కులు కేటాయించారు.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 23.07.2026గా నిర్ణయించారు. సర్టిఫికేట్ల పరిశీలన 27.07.2026 నుండి 05.08.2026 వరకు ఉంటుంది. ఈ సందర్భంగా కొన్ని పత్రాలు తీసుకెళ్లాలి. వయస్సు/పుట్టిన తేదీ ధృవీకరణ పత్రం (SSC మేమో), కుల ధృవీకరణ పత్రం, విద్యార్హత పత్రాలు (ఇంటర్/ఆపై మార్కుల లిస్ట్), నివాస ధృవీకరణ పత్రం, దివ్యాంగులైతే 'సదరం' సర్టిఫికేట్, వితంతువులైతే భర్త డెత్ సర్టిఫికేట్, అనాథలైతే దానికి సంబంధించిన అధికారిక పత్రం ఉండాలి. అర్హత గల మహిళా అభ్యర్థులు గడువు ముగిసేలోపు దరఖాస్తులను సమర్పించుకోవచ్చు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More