సెల్ఫీ విత్ స్టేషన్.. హైటెక్ సిటీ రైల్వే స్టేషన్‌లో ఫోటో దిగండి, ప్రైజ్ గెలవండి!
దక్షిణ మధ్య రైల్వే హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవం సందర్భంగా వినూత్న కార్యక్రమం చేపట్టింది. సెల్ఫీ విత్ స్టేషన్ కాంటెస్ట్‌ను పెట్టింది. ఇందులో గెలిచిన వారికి బహుమతులు కూడా అందిస్తారు.
దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ డివిజన్ పరిధిలో సరికొత్తగా పునరాభివృద్ధి చెందిన హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని పురస్కరించుకుని జనాల కోసం దక్షిణ మధ్య రైల్వే ఒక వినూత్నమైన సెల్ఫీ కాంటెస్ట్‌ను ప్రకటించింది.

'సెల్ఫీ విత్ స్టేషన్' అనే థీమ్‌తో ఈ పోటీని నిర్వహిస్తున్నారు. ఈ చారిత్రాత్మక మార్పులో భాగస్వామ్యులై, ఆకర్షణీయమైన బహుమతులు గెలుచుకోవాల్సిందిగా రైల్వే అధికారులు ఆహ్వానిస్తున్నారు.
పోటీలో ఎలా పాల్గొనాలి?
పునరాభివృద్ధి చెందిన హైటెక్ సిటీ రైల్వే స్టేషన్‌లో ఒక చక్కటి సెల్ఫీని క్లిక్ చేయాలి.
మీరు తీసిన సెల్ఫీ ఫోటోను welfaresectionsc@gmail.com అనే అధికారిక ఈమెయిల్ ఐడీకి పంపించాల్సి ఉంటుంది.
మీ సెల్ఫీని మీ సోషల్ మీడియా ఖాతాలలో పోస్ట్ చేసి, కింద పేర్కొన్న రైల్వే హ్యాండిల్స్‌ను తప్పకుండా ట్యాగ్ చేయాలి.
ఇన్‌స్టాగ్రామ్ (Instagram): @scrailwayindia & @scdivision_123 లను ట్యాగ్ చేయాలి.
ఎక్స్ / ట్విట్టర్ (X): @SCRailwayIndia & @drmsecunderabad లను ట్యాగ్ చేయాలి.
ఫేస్‌బుక్ (Facebook): South Central Railway-S.C.R & DRM Secunderabad పేజీలను ట్యాగ్ చేయాలి.
ముఖ్యమైన తేదీ
ఈ పోటీలో పాల్గొనడానికి చివరి తేదీ 15 జులై 2026. ఆసక్తి గల వారు ఈ లోపు తమ ఎంట్రీలను పంపించాల్సి ఉంటుంది. అధునాతనంగా మారిన హైటెక్ సిటీ స్టేషన్ అందాలను మీ సెల్ఫీల్లో బంధించి, ఈ చారిత్రాత్మక క్షణాల్లో భాగస్వామ్యం అవ్వడమే కాకుండా ఆకర్షణీయమైన బహుమతులను గెలుచుకునే సువర్ణావకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మరిన్ని వివరాల కోసం దక్షిణ మధ్య రైల్వే అధికారిక వెబ్‌సైట్ www.scr.indianrailways.gov.in ను సందర్శించవచ్చు.
వ్యాసరచన పోటీలు
అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా అధునాతన సౌకర్యాలతో ముస్తాబైన హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ ఈ నెల 17న ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే జంట నగరాల పరిధిలోని వివిధ పాఠశాలల విద్యార్థుల కోసం వ్యాసరచన (ఇంగ్లీష్, హిందీ), డ్రాయింగ్, పెయింటింగ్ పోటీలను ఘనంగా నిర్వహించింది.
ఈ పోటీలను 8వ తరగతి నుండి 10వ తరగతి చదువుతున్న విద్యార్థుల కోసం ప్రత్యేకంగా నిర్వహించారు. "నా నగరంలో అభివృద్ధి చెందిన రైల్వే స్టేషన్ ఎలా ఉంటుంది?", "అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించడానికి నేను ఏం చేస్తాను?" అనే ఆసక్తికరమైన అంశాలపై విద్యార్థులు తమ ప్రతిభను కనబరిచారు. ఈ పోటీల్లో జంట నగరాల్లోని ఆరు ప్రముఖ పాఠశాలల నుండి మొత్తం 292 మంది విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు.
ప్రతి పాఠశాల నుండి వ్యాసరచన, డ్రాయింగ్ అండ్ పెయింటింగ్ పోటీలలో ముగ్గురు చొప్పున విజేతలను ఎంపిక చేయనున్నారు. ఈ విధంగా మొత్తం 36 మంది విద్యార్థులు (18 మంది వ్యాసరచన విజేతలు, 18 మంది డ్రాయింగ్, పెయింటింగ్ విజేతలు) జూలై 17న జరిగే హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రైల్వే అధికారుల చేతుల మీదుగా బహుమతులు అందుకోనున్నారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


