SCR Special Trains : ప్రయాణికులకు గుడ్ న్యూస్… చర్లపల్లి - కేరళ మధ్య ప్రత్యేక రైళ్లు! రూట్ల వారీగా వివరాలు
SCR Cherlapally - Kollam Special Trains : ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఆగస్టు 14 నుంచి సెప్టెంబరు 5 వరకు చర్లపల్లి - కొల్లం (కేరళ) మధ్య 8 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈ రైళ్లు తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కేరళలోని ప్రధాన స్టేషన్లలో ఆగుతాయి.
Cherlapally - Kollam Special Trains : పండుగలు, సెలవుల నేపథ్యంలో ప్రయాణికుల రద్దీని తట్టుకునేందుకు దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌లోని చర్లపల్లి నుంచి కేరళలోని కొల్లం స్టేషన్ల మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. ఆగస్టు 14వ తేదీ నుంచి సెప్టెంబరు 5వ తేదీ వరకు మొత్తం ఎనిమిది సర్వీసులు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది.

రైళ్ల రాకపోకల షెడ్యూల్:
- చర్లపల్లి - కొల్లం ప్రత్యేక రైలు (నెం.07195): ఈ రైలు ఆగస్టు 14, 21, 28 మరియు సెప్టెంబరు 4 తేదీల్లో చర్లపల్లి నుంచి బయల్దేరుతుంది (మొత్తం 4 సర్వీసులు).
- కొల్లం - చర్లపల్లి ప్రత్యేక రైలు (నెం.07196): ఈ తిరుగు ప్రయాణ రైలు ఆగస్టు 15, 22, 29 మరియు సెప్టెంబరు 5 తేదీల్లో కొల్లం నుంచి ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది (మొత్తం 4 సర్వీసులు).
ఈ ప్రత్యేక రైళ్లు ప్రయాణికుల సౌకర్యార్థం రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కేరళలోని ముఖ్యమైన స్టేషన్లలో ఆగనున్నాయి.
- తెలంగాణ, ఆంధ్రప్రదేశ్: నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట.
- తమిళనాడు: కాట్పాడి, జోలార్‌పేట, సేలం, ఈరోడ్, తిరుప్పూర్, పోదనూర్.
- కేరళ: పాలక్కాడ్, త్రిస్సూర్, అలువా, ఎర్నాకుళం టౌన్, కొట్టాయం, చంగనాశేరి, తిరువల్లా, చెంగన్నూర్, మావేలికర, కాయంకుళం, కరునాగప్పలి.
రద్దీ ఎక్కువగా ఉండే ఈ సీజన్‌లో ప్రయాణికులు ఈ ప్రత్యేక రైలు సర్వీసులను వినియోగించుకుని తమ ప్రయాణాలను ముందుగానే ప్లాన్ చేసుకోవాలని దక్షిణ మధ్య రైల్వే సూచించింది.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

