కాజీపేట, పెద్దపల్లి మీదుగా దసరా, బతుకమ్మ ప్రత్యేక రైళ్లు - ఇవాళ్టి నుంచే సర్వీసులు..!

బతుకమ్మ, నవరాత్రి, దసరా పండుగల వేళ ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే 34 ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. అక్టోబర్ 9 నుంచి 25 వరకు ఈ రైళ్లు అందుబాటులో ఉంటాయి.

Published on: Oct 9, 2026, 09:28:15 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

తెలంగాణ పెద్ద పండుగలైన బతుకమ్మ, దసరా సహా దేవీ నవరాత్రుల వేడుకలకు సొంతూర్లకు వెళ్లే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త అందించింది. ప్రయాణికుల రద్దీని నియంత్రించి, ప్రజల ప్రయాణాన్ని మరింత సులభతరం చేసేందుకు సికింద్రాబాద్ – సిర్పూర్ కాగజ్‌నగర్ – హైదరాబాద్ మార్గంలో ఏకంగా 34 రోజువారీ పండుగ ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు ప్రకటించింది.

పండగ ప్రత్యేక రైళ్లు
పండగ ప్రత్యేక రైళ్లు

నేటి నుంచే సర్వీసులు….

ఈ పండుగ ప్రత్యేక రైళ్లు అక్టోబర్ 09వ తేదీ నుంచి అక్టోబర్ 25వ తేదీ వరకు నిరంతరాయంగా అందుబాటులో ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. ప్రయాణికులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందస్తుగా తమ ప్రయాణ ప్రణాళికలను సిద్ధం చేసుకోవచ్చని సూచించింది.

  • సికింద్రాబాద్ – సిర్పూర్ కాగజ్‌నగర్ డెయిలీ స్పెషల్ (రైలు నంబరు: 07711) : ఈ ప్రత్యేక రైలు ప్రతిరోజు మధ్యాహ్నం 12:10 గంటలకు సికింద్రాబాద్ స్టేషన్ నుంచి బయలుదేరుతుంది. అదే రోజు సాయంత్రం 17:30 (5:30) గంటలకు సిర్పూర్ కాగజ్‌నగర్ చేరుకుంటుంది. అక్టోబర్ 9 నుంచి 25వ తేదీ వరకు మొత్తం 17 సర్వీసులను ఈ మార్గంలో నడపనున్నారు.
  • సిర్పూర్ కాగజ్‌నగర్ – హైదరాబాద్ డెయిలీ స్పెషల్ (రైలు నంబరు: 07712) : తిరుగు ప్రయాణంలో ఈ ప్రత్యేక రైలు ప్రతిరోజు సాయంత్రం 18:00 (6:00) గంటలకు సిర్పూర్ కాగజ్‌నగర్‌లో బయలుదేరుతుంది. అదే రోజు రాత్రి 23:15 గంటలకు హైదరాబాద్ (నాంపల్లి) స్టేషన్‌కు చేరుకుంటుంది. ఈ దిశలో కూడా అక్టోబర్ 9 నుంచి 25 వరకు మొత్తం 17 సర్వీసులు అందుబాటులో ఉంటాయి.

స్టాపేజీల వివరాలు….

ఈ రెండు ప్రత్యేక రైళ్లు ప్రయాణికుల సౌకర్యార్థం ఇరువైపులా చర్లపల్లి, భువనగిరి, జనగాం, కాజీపేట, జమ్మికుంట, పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల, బెల్లంపల్లి, ఆసిఫాబాద్ రోడ్ స్టేషన్లలో ఆగుతాయి.

ఉత్తర తెలంగాణ జిల్లాల ప్రజలకు ఈ స్టాపేజీలు ఎంతో ప్రయోజనకరంగా మారనున్నాయి. ఈ పండుగ ప్రత్యేక రైళ్లలో ఏసీ చైర్ కార్ ,సెకండ్ సిట్టింగ్ క్లాస్ కోచ్‌లను అందుబాటులో ఉంచినట్లు అధికారులు స్పష్టం చేశారు. పండుగ వేళ సాధారణ రైళ్లలో రద్దీ ఎక్కువగా ఉండే అవకాశమున్నందున…. ప్రయాణికులు ఐఆర్‌సీటీసీ (IRCTC) వెబ్‌సైట్ లేదా రిజర్వేషన్ కౌంటర్ల ద్వారా ఈ ప్రత్యేక రైళ్ల సేవలను వినియోగించుకోవాలని దక్షిణ మధ్య రైల్వే కోరింది.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More