తెలుగు ప్రయాణికులకు శుభవార్త... గుంటూరు - వికారాబాద్ మధ్య పండగ ప్రత్యేక రైళ్లు! హాల్ట్ లిస్ట్ ఇదే
పండుగల సీజన్‌లో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే పలు ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. గుంటూరు-వికారాబాద్, యశ్వంతపూర్-అమృత్‌సర్ మధ్య ఈ రైళ్లు నడవనున్నాయి.
దసరా, దీపావళి తదితర వరుస పండుగల వేళ సొంతూర్లకు వెళ్లే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే మరో తీపి కబురు చెప్పింది. పండుగ సీజన్‌లో ఉండే విపరీతమైన ప్రయాణికుల రద్దీని తట్టుకోవడానికి, ప్రయాణాన్ని మరింత సులభతరం చేయడానికి ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు ప్రకటించింది.

ఈ ప్రత్యేక రైళ్లలో గుంటూరు – వికారాబాద్ – గుంటూరు మధ్య నడిచే రైళ్లతో పాటు యశ్వంతపూర్ నుంచి అమృత్‌సర్ వరకు వెళ్లే సుదూర ప్రాంత ప్రత్యేక రైలు కూడా ఉందని అధికారులు తెలిపారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని ముందస్తుగా తమ ప్రయాణ ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని సూచించారు.
ప్రత్యేక రైళ్ల పూర్తి షెడ్యూల్ - వివరాలు:
- గుంటూరు - వికారాబాద్ పండుగ స్పెషల్ (రైలు నంబర్ - 07227) : ఈ రైలు 08.10.2026, 10.10.2026 తేదీల్లో రాత్రి 21:45 గంటలకు గుంటూరులో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 05:00 గంటలకు వికారాబాద్ చేరుకుంటుంది.
- వికారాబాద్ - గుంటూరు పండుగ స్పెషల్ (రైలు నంబరు: 07228): తిరుగు ప్రయాణంలో ఈ రైలు 09.10.2026 మరియు 11.10.2026 తేదీల్లో రాత్రి 22:00 గంటలకు వికారాబాద్‌లో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 06:10 గంటలకు గుంటూరు చేరుకుంటుంది.
స్టాపేజీలు….
ఈ రెండు రైళ్లు సత్తెనపల్లి, పిడుగురాళ్ల, నడికుడి, మిర్యాలగూడ, నల్గొండ, చార్లపల్లి, సికింద్రాబాద్, బేగంపేట్, లింగంపల్లి స్టేషన్లలో ఇరువైపులా ఆగుతాయి. ఈ రైళ్లలో 2AC, 3AC, స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లను ఏర్పాటు చేశారు.
యశ్వంతపూర్ - అమృత్‌సర్ స్పెషల్ ట్రెయిన్ (రైలు నంబరు: 06539) ఈ ప్రత్యేక రైలు 08.10.2026 నాడు రాత్రి 22:40 గంటలకు యశ్వంతపూర్‌లో బయలుదేరి, మూడో రోజు మధ్యాహ్నం 13:50 గంటలకు అమృత్‌సర్ చేరుకుంటుంది.
ఈ రైలు యెలహంక, హిందూపూర్, ధర్మవరం, అనంతపూర్, గుంతకల్, ఆదోని, మంత్రాలయం రోడ్, రాయచూర్, వాడి, కలబురగి, సోలాపూర్, కుర్దువాడి, దౌండ్, అహల్యానగర్, కోపర్‌గావ్, మన్మాడ్, భూసావల్, ఖాండ్వా, ఇటార్సి, జబల్‌పూర్, కట్ని, సత్నా, చిత్రకూట్‌ధామ్ కర్వీ, బందా, VGL ఝాన్సీ, గ్వాలియర్, ఆగ్రా కాంట్, హజ్రత్ నిజాముద్దీన్, న్యూఢిల్లీ, అంబాలా కాంట్, లుధియానా, జలంధర్ సిటీ మరియు బియాస్ స్టేషన్లలో ఆగుతుంది.
ఈ రైలులో స్లీపర్ మరియు జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు మాత్రమే ఉంటాయి. పండుగల సమయంలో సాధారణ రైళ్లలో సీట్లు దొరకక ఇబ్బంది పడే ప్రయాణికులకు ఈ పండుగ ప్రత్యేక రైళ్లు ఎంతో ఉపశమనం కలిగిస్తాయని దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో శ్రీధర్ ఓ ప్రకటనలో తెలిపారు. ప్రయాణికులు ఐఆర్‌సీటీసీ (IRCTC) వెబ్‌సైట్ లేదా రైల్వే రిజర్వేషన్ కౌంటర్ల ద్వారా ఈ రైళ్లకు టికెట్లు బుక్ చేసుకోవచ్చని సూచించారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

