Festival Special Trains : ఏపీ మీదుగా బెంగళూరుకు పండుగ స్పెషల్ రైళ్లు - తేదీలు, హాల్టింగ్ లిస్ట్ ఇదే

దసరా, దీపావళి పండుగల వేళ ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని హటియా -ఎస్ఎమ్‌విటి బెంగళూరు మధ్య ఐదు వారాల పాటు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు రైల్వే శాఖ తెలిపింది. ఈ రైళ్లు ఏపీలోని పలు స్టేషన్లలో ఆగుతాయి.

Published on: Oct 4, 2026, 09:21:30 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

పండుగల సీజన్‌లో సొంత ఊళ్లకు వెళ్లే ప్రయాణికులతో రైళ్లన్నీ కిటకిటలాడుతున్నాయి. ముఖ్యంగా దసరా, దీపావళి సందర్భంగా ప్రయాణికుల రాకపోకల రద్దీ క్రమంగా పెరుగుతోంది. ఈ అదనపు ప్రయాణికుల రద్దీని అధిగమించేందుకు దక్షిణ కోస్తా రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది.

బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు

జార్ఖండ్‌లోని హటియా నుంచి కర్ణాటకలోని ఎస్ఎమ్‌విటి బెంగళూరు జంక్షన్ మధ్య వారపు ప్రత్యేక రైలు సర్వీసులను నడపనున్నట్లు సౌత్ కోస్ట్ రైల్వే ప్రకటించింది. అక్టోబర్ 14 నుంచి నవంబర్ 13 వరకు రెండు వైపుల నుంచి చెరో 5 ట్రిప్పుల చొప్పున ఈ రైళ్లు అందుబాటులో ఉంటాయి.

విశాఖపట్నం (దువ్వాడ), రాజమండ్రి, విజయవాడ, నెల్లూరు, రేణిగుంట మీదుగా ఈ రైలు ప్రయాణించనుండటంతో తెలుగు రాష్ట్రాలకు చెందిన వేలాది మంది ప్రయాణికులకు తీవ్ర ఊరట లభించనుంది.

  • హటియా - ఎస్ఎమ్‌విటి బెంగళూరు వారపు స్పెషల్ ఎక్స్‌ప్రెస్ (నంబర్: 08637) : ఈ ప్రత్యేక రైలు అక్టోబర్ 14 నుంచి నవంబర్ 11 వరకు ప్రతి బుధవారం ఉదయం 09:00 గంటలకు హటియాలో బయలుదేరుతుంది. గురువారం తెల్లవారుజామున 01:28 గంటలకు దువ్వాడ (విశాఖపట్నం) చేరుకుని, 01:30 గంటలకు బయలుదేరుతుంది. అదే రోజు (గురువారం) రాత్రి 20:45 గంటలకు ఎస్ఎమ్‌విటి బెంగళూరు జంక్షన్‌కు చేరుకుంటుంది. మొత్తం 5 ట్రిప్పులు ఈ సర్వీస్ నడుస్తుంది.
  • ఎస్ఎమ్‌విటి బెంగళూరు - హటియా వారపు స్పెషల్ (ట్రెయిన్ నంబర్: 08638) : తిరుగు ప్రయాణంలో ఈ రైలు అక్టోబర్ 16 నుంచి నవంబర్ 13 వరకు ప్రతి శుక్రవారం అర్ధరాత్రి దాటాక (తెల్లవారుజామున) 00:30 గంటలకు ఎస్ఎమ్‌విటి బెంగళూరులో బయలుదేరుతుంది. శుక్రవారం సాయంత్రం 19:38 గంటలకు దువ్వాడ చేరుకుని, 19:40 గంటలకు అక్కడ నుంచి బయలుదేరుతుంది. శనివారం మధ్యాహ్నం 12:30 గంటలకు హాతియా చేరుకుంటుంది. ఈ మార్గంలో కూడా మొత్తం 5 ట్రిప్పులు అందుబాటులో ఉంటాయి.

ముఖ్యమైన స్టేషన్లు….

ఈ ప్రత్యేక రైళ్లు రెండు వైపులా ప్రయాణించే మార్గంలో పలు కీలక స్టేషన్లలో ఆగుతాయి. రౌర్కెలా, ఝార్సుగూడ, సంబల్‌పూర్, టిట్లాగఢ్, రాయగడ, పార్వతీపురం, బొబ్బిలి, విజయనగరం, పెందుర్తి, దువ్వాడ, సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, కాట్పాడి, జోలార్‌పేటై, కృష్ణరాజపురం స్టేషన్లలో ఈ రైలుకు స్టాపేజీలు కల్పించారు.

పండుగ వేళ బెంగళూరు, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి మార్గాల్లో ప్రయాణించే వారికి ఈ స్పెషల్ రైళ్లు ఎంతో సౌకర్యవంతంగా మారనున్నాయి. టిక్కెట్ బుకింగ్స్ ఐఆర్‌సిటిసి (IRCTC) వెబ్‌సైట్, రైల్వే రిజర్వేషన్ కౌంటర్లలో అందుబాటులో ఉంటాయి.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More