Special Trains : పండగల సెలవుల వేళ శుభవార్త... చర్లపల్లి - అరుణాచలం మధ్య 14 ప్రత్యేక రైళ్లు! తేదీలివే
పండుగల వేళ తిరువణ్ణామలై (అరుణాచలం) క్షేత్రానికి వెళ్లే భక్తులకు దక్షిణ మధ్య రైల్వే ఊరటనిచ్చింది. చర్లపల్లి - తిరువణ్ణామలై మధ్య 14 వీక్లీ ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు ప్రకటించింది.
Charlapalli Tiruvannamalai Special Trains : దసరా, దీపావళి పండుగల సీజన్‌లో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. భాగ్యనగరంతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి తిరువణ్ణామలై (అరుణాచలం) క్షేత్రానికి వెళ్లే భక్తుల కోసం ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తెచ్చింది. చర్లపల్లి - తిరువణ్ణామలై స్టేషన్ల మధ్య మొత్తం 14 వారపు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది.

ప్రత్యేక రైళ్ల టైమింగ్స్ - వివరాలు:
- చర్లపల్లి - తిరువణ్ణామలై (రైలు సంఖ్య 07003 ): ఈ ప్రత్యేక రైలు 2026 అక్టోబర్ 6వ తేదీ నుంచి నవంబర్ 17వ తేదీ వరకు ప్రతి మంగళవారం అందుబాటులో ఉంటుంది. ఈ మార్గంలో మొత్తం 7 సర్వీసులను రైల్వే శాఖ నడపనుంది.
- తిరువణ్ణామలై - చర్లపల్లి (రైలు సంఖ్య 07004): తిరుగు ప్రయాణంలో ఈ ప్రత్యేక రైలు 2026 అక్టోబర్ 7వ తేదీ నుంచి నవంబర్ 18వ తేదీ వరకు ప్రతి బుధవారం నడుస్తుంది. ఈ రూట్ లో కూడా మొత్తం 7 సర్వీసులు ప్రయాణికులకు సేవలు అందిస్తాయి.
హాల్టింగ్ లిస్ట్….
ఈ ప్రత్యేక రైళ్లు ఇరువైపులా ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉండేలా ప్రధాన స్టేషన్లలో ఆగుతాయి. కాచిగూడ, షాద్‌నగర్, మహబూబ్‌నగర్, వనపర్తి రోడ్, గద్వాల్, కర్నూలు సిటీ, ధోన్, గుత్తి, తాడిపత్రి, యర్రగుంట్ల, కడప, రాజంపేట, రేణిగుంట, తిరుపతి, చిత్తూరు, కాట్పాడి స్టేషన్లలో ఈ రైళ్లకు స్టాపేజీలు కేటాయించారు.
ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా ఈ ప్రత్యేక రైళ్లలో ఏసీ సెకండ్ క్లాస్ (2AC), ఏసీ థర్డ్ క్లాస్ (3AC), స్లీపర్ క్లాస్ మరియు జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లను ఏర్పాటు చేశారు. పండుగల సమయంలో అరుణాచల గిరిప్రదక్షిణకు వెళ్లే భక్తులకు ఈ రైళ్లు ఎంతగానో ఉపయోగపడనున్నాయి.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

