Special Trains : ప్రయాణికులకు దక్షిణ కోస్తా రైల్వే శుభవార్త... సికింద్రాబాద్ - తిరుపతి మధ్య స్పెషల్ ట్రైన్! షెడ్యూల్ ఇలా
Secunderabad Tirupati Special Train : సికింద్రాబాద్ - తిరుపతి మార్గంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని సౌత్ కోస్ట్ రైల్వే "ట్రైన్ ఆన్ డిమాండ్" (TOD) కింద ఒక రౌండ్ ట్రిప్ ప్రత్యేక రైలును నడుపుతోంది. అక్టోబర్ 4, 5 తేదీల్లో ఈ సేవలు అందుబాటులో ఉంటాయి.
SCR Secunderabad Tirupati Special Train : తెలుగు రాష్ట్రాల మధ్య ప్రయాణించే రైలు ప్రయాణికులకు దక్షిణ కోస్తా రైల్వే తీపి కబురు అందించింది. సికింద్రాబాద్ - తిరుపతి మార్గంలో నిరంతరం పెరుగుతున్న ప్రయాణికుల రద్దీని క్రమబద్ధీకరించేందుకు… ప్రయాణాన్ని మరింత సులభతరం చేసేందుకు గాను "ట్రైన్ ఆన్ డిమాండ్" (TOD) ప్రాతిపదికన ప్రత్యేక రైలును అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ప్రత్యేక రైలు సర్వీస్ (రైలు నంబర్లు 07421/07422) ఒకే ఒక రౌండ్ ట్రిప్ ప్రయాణానికి నడుస్తుంది.

రైళ్ల షెడ్యూల్ - టైమింగ్స్ వివరాలు:
- తిరుపతి నుంచి సికింద్రాబాద్ (రైలు నంబర్ 07421) : ఈ ప్రత్యేక రైలు 2026, అక్టోబర్ 4 ఆదివారం సాయంత్రం 16:30 గంటలకు (4:30 PM) తిరుపతి (TPTY) స్టేషన్ నుంచి బయలుదేరుతుంది. మరుసటి రోజు అంటే అక్టోబర్ 5 సోమవారం ఉదయం 07:00 గంటలకు సికింద్రాబాద్ (SC) రైల్వే స్టేషన్‌కు చేరుకుంటుంది.
- సికింద్రాబాద్ నుంచి తిరుపతి (రైలు నంబర్ 07422) : తిరుగు ప్రయాణంలో ఈ రైలు 2026, అక్టోబర్ 5 సోమవారం రోజు సాయంత్రం 16:15 గంటలకు (4:15 PM) సికింద్రాబాద్ స్టేషన్ నుంచి బయలుదేరుతుంది. మరుసటి రోజు అక్టోబర్ 6 మంగళవారం ఉదయం 06:45 గంటలకు తిరుపతికి చేరుకుంటుంది.
హాల్టింగ్ లిస్ట్….
రెండు వైపులా సాగే ఈ ప్రయాణంలో ప్రయాణికుల సౌకర్యార్థం పలు ప్రధాన రైల్వే స్టేషన్లలో ఈ రైలు ఆగుతుంది. రేణిగుంట, కోడూరు, రాజంపేట, కడప, ఎర్రగుంట్ల, తాడిపత్రి, గుత్తి, గుంతకల్, ఆదోని, మంత్రాలయం రోడ్, రాయచూర్, కృష్ణ, యాద్గిర్, సేరం, తాండూర్, వికారాబాద్, హైటెక్ సిటీ, బేగంపేట స్టేషన్లలో రైలు నిలుస్తుంది.
ప్రయాణికుల విభిన్న అవసరాలకు అనుగుణంగా ఈ ప్రత్యేక రైలులో వివిధ శ్రేణుల కోచ్‌లను అందుబాటులో ఉంచారు. సెకండ్ ఏసీ - 2 బోగీలు థర్డ్ ఏసీ - 6 బోగీలు స్లీపర్ క్లాస్ - 8 బోగీలు జనరల్ సిట్టింగ్ - 4 బోగీలు జనరల్ సిట్టింగ్ కమ్ లగేజ్ రేక్ - 2 బోగీలు వారాంతాలు, పండుగల వేళ తిరుపతి శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్లే భక్తులతో పాటు హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో పనిచేసే ఉద్యోగులకు ఈ ప్రత్యేక రైలు ఎంతో ఉపయోగకరంగా మారనుంది. ప్రయాణికులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ముందుగానే రిజర్వేషన్లు చేసుకోవాలని రైల్వే అధికారులు కోరారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

