Railway Update : రైలు ప్రయాణికులకు అలర్ట్.. పలు రైళ్లు రద్దు.. కర్నూలు-కాచిగూడపై అప్డేట్
Railway Update : హైదరాబాద్ డివిజన్ పరిధిలోని ట్రాక్ నిర్వహణ పనుల కారణంగా రైల్వే శాఖ కీలక ప్రకటన చేసింది. పలు రైళ్లను పాక్షికంగా రద్దు చేయడమే కాకుండా.. కొన్ని రైళ్ల వేళల్లో మార్పులు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.
హైదరాబాద్ రైల్వే డివిజన్ పరిధిలోని నవీపేట్ – జానకంపేట్, కాచిగూడ – డోన్ సెక్షన్ల మధ్య అత్యవసర ట్రాక్ నిర్వహణ పనులు చేపట్టనున్నారు. ఈ మరమ్మతు పనుల కారణంగా అక్టోబర్, నవంబర్ నెలల్లో నడిచే పలు రైలు సర్వీసులను పాక్షికంగా రద్దు చేస్తున్నట్లు, మరికొన్ని రైళ్లను ఆలస్యంగా నడుపుతున్నట్లు రైల్వే అధికారులు ఒక ప్రకటనలో వెల్లడించారు.

కొన్ని రైళ్లు నిర్దేశిత తేదీల్లో నిజామాబాద్ వరకు కాకుండా ముద్ఖేడ్ స్టేషన్ వరకు మాత్రమే నడుస్తాయి.
దౌండ్ – నిజామాబాద్ (రైలు నంబర్ 11409)
అక్టోబర్ 15, 16, 19, 22, 23, 26, 29, 30, నవంబర్ 02, 05, 06, 09, 12, 13 తేదీల్లో ముద్ఖేడ్ వరకే నడుస్తాయి. ఈ రైలు ముద్ఖేడ్ – నిజామాబాద్ మధ్య పాక్షికంగా రద్దవుతుంది. అనగా దౌండ్ నుంచి బయలుదేరే ఈ రైలు ముద్ఖేడ్ స్టేషన్ వద్దనే తన ప్రయాణాన్ని ముగిస్తుంది.
నిజామాబాద్ – పండర్‌పూర్ (రైలు నంబర్ 11413)
అక్టోబర్ 16, 17, 20, 23, 24, 27, 30, 31, నవంబర్ 03, 06, 07, 10, 13, 14 తేదీల్లో ఈ రైలు నిజామాబాద్ – ముద్ఖేడ్ మధ్య రద్దవుతుంది. ఇది నిజామాబాద్‌కు బదులుగా ముద్ఖేడ్ స్టేషన్ నుంచే పండర్‌పూర్‌కు బయలుదేరుతుంది.
కర్నూలు సిటీ – కాచిగూడ (రైలు నంబర్ 17024) అక్టోబర్ 15, 22, 29, నవంబర్ 05 రోజుల్లో ఈ రైలును మార్గమధ్యంలో దాదాపు 60 నిమిషాలపాటు నిలిపివేసి నడుపుతారు.
పాక్షికంగా రద్దయిన స్టేషన్ల మధ్య ప్రయాణించాల్సిన ప్రయాణికులు నిబంధనల ప్రకారం ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ లేదా రైల్వే కౌంటర్ల వద్ద తమ టికెట్ రద్దు చేసుకుని రీఫండ్ పొందవచ్చు. ప్రయాణికులు తమ ప్రయాణంలో ఎలాంటి అసౌకర్యం కలగకుండా రైల్వే విచారణ సంఖ్య 139 ద్వారా లేదా రైల్వే అధికారిక యాప్/వెబ్‌సైట్ NTES ద్వారా రైళ్ల రాకపోకల సమయాలను ముందుగానే సరిచూసుకోవాలని రైల్వే అధికారులు కోరారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


