ఉత్తరాంధ్ర ప్రయాణికులకు అలర్ట్... విశాఖ - పార్వతీపురం మధ్య కొత్తగా మెము స్పెషల్ రైలు, పూర్తి వివరాలు

విశాఖపట్నం - పార్వతీపురం మధ్య కొత్త మెము (MEMU) స్పెషల్ రైలు నడుస్తుందని సౌత్ కోస్ట్ రైల్వే ప్రకటించింది. అక్టోబర్ 10 నుంచి 20 వరకు అందుబాటులో ఉంటుంది. 

Published on: Oct 9, 2026, 18:15:02 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

ఉత్తరాంధ్ర ప్రాంత ప్రయాణికులకు సౌత్ కోస్ట్ రైల్వే (దక్షిణ తీర రైల్వే) తీపి కబురు అందించింది. పండుగ వాతావరణం నెలకొన్న వేళ ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని విశాఖపట్నం - పార్వతీపురం మార్గంలో కొత్త స్పెషల్ మెము (MEMU) రైలును అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రకటించింది.

విశాఖ - పార్వతీపురం ప్రయాణికులకు అలర్ట్
విశాఖ - పార్వతీపురం ప్రయాణికులకు అలర్ట్

ఈనెల 10 నుంచి రాకపోకలు - టైమింగ్స్ వివరాలు…

ఈ రోజువారీ ప్రత్యేక సర్వీసు 2026 అక్టోబర్ 10వ తేదీ నుంచి అక్టోబర్ 20వ తేదీ వరకు ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది. ఈ ప్రత్యేక రైలు వేళలు మరియు స్టాప్‌ల వివరాలను రైల్వే శాఖ అధికారికంగా విడుదల చేసింది.

  • విశాఖపట్నం – పార్వతీపురం స్పెషల్ మెము (రైలు నంబరు - 07268) : ఈ ప్రత్యేక రైలు ప్రతిరోజు ఉదయం 10:00 గంటలకు విశాఖపట్నం స్టేషన్ నుంచి బయలుదేరుతుంది. మార్గమధ్యలో సింహాచలం (10.21/10.22), కొత్తవలస (10.35/10.36), విజయనగరం (11.04/11.06), గజపతినగరం (11.28/11.29), కోమటిపల్లి (11.37/11.38), దొంకినవలస (11.47/11.48), బొబ్బిలి (11.59/12.01), సీతానగరం (12.11/12.12), నరసింహపురం హాల్ట్ (12.18/12.19) స్టేషన్లలో ఆగుతూ మధ్యాహ్నం 12:35 గంటలకు పార్వతీపురం చేరుకుంటుంది.
  • పార్వతీపురం – విశాఖపట్నం స్పెషల్ మెము (రైలు నంబరు - 07267) : తిరుగు ప్రయాణంలో ఈ రైలు ప్రతిరోజు మధ్యాహ్నం 12:35 గంటలకు పార్వతీపురంలో బయలుదేరుతుంది. నరసింహపురం హాల్ట్ (12.39/12.40), సీతానగరం (12.45/12.46), బొబ్బిలి (12.57/12.59), దొంకినవలస (13.10/13.11), కోమటిపల్లి (13.20/13.21), గజపతినగరం (13.29/13.30), విజయనగరం (13.50/13.52), కొత్తవలస (14.17/14.18), సింహాచలం (14.30/14.31) స్టేషన్ల మీదుగా ప్రయాణించి సాయంత్రం 16:00 (4:00) గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది.

విశాఖపట్నం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల మధ్య నిత్యం రాకపోకలు సాగించే ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారులు మరియు పండుగలకు సొంతూర్లకు వెళ్లే ప్రయాణికులకు ఈ మెము స్పెషల్ రైలు సర్వీసు ఎంతో సౌకర్యవంతంగా మారనుంది. ప్రయాణికులు ఈ తాత్కాలిక రైలు సదుపాయాన్ని వినియోగించుకోవాలని రైల్వే అధికారులు కోరారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More