రాజమండ్రి - కాకినాడ మధ్య కొత్తగా మెము రైలు సర్వీస్.... టైమింగ్స్, హాల్ట్ స్టేషన్లు ఇవే

Rajahmundry - Kakinada MEMU Train : రైల్వే ప్రయాణికుల సౌకర్యార్థం రాజమండ్రి - కాకినాడ పోర్ట్ మధ్య కొత్తగా మెము(MEMU) రైలు సర్వీసును అందుబాటులోకి రానుంది. ఈ వివరాలను దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది.

Published on: Apr 24, 2026, 16:17:00 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Rajahmundry - Kakinada MEMU Train : ఏపీలోని రాజమండ్రి, కాకినాడ వాసులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది.పెరుగుతున్న ప్రయాణికుల అవసరాలు, డిమాండ్ నేపథ్యంలో ఈ రెండు కీలక నగరాల మధ్య కొత్త మెమూ రైలు సర్వీస్ ను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ కొత్త రైలు ప్రారంభ తేదీ, షెడ్యూల్, స్టాప్ లు, ఇతర వివరాలను ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది.

కొత్త రైల్వే సర్వీస్ - దక్షిణ మధ్య రైల్వే ప్రకటన
కొత్త రైల్వే సర్వీస్ - దక్షిణ మధ్య రైల్వే ప్రకటన

రాజమండ్రి - కాకినాడ మధ్య పెరుగుతున్న రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే ఈ నిర్ణయం తీసుకుంది. ఈ సర్వీస్ వల్ల కేవలం తక్కువ ఛార్జీతో ప్రయాణించడమే కాకుండా… రోడ్డు మార్గంలో ఉండే ట్రాఫిక్ చిక్కుల నుంచి కూడా ప్రయాణికులకు విముక్తి లభించనుంది.

దక్షిణ మధ్య రైల్వే ప్రకటనలోని వివరాల ప్రకారం…. రైలు నంబర్ 67301 మెమూ ఎక్స్‌ప్రెస్ ప్రతిరోజూ ఉదయం 06:15 నిమిషాలకు కాకినాడ పోర్ట్ నుండి బయలుదేరుతుంది. ఉదయం 08:15 నిమిషాలకు రాజమండ్రి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో రైలు నంబర్ 67302 మధ్యాహ్నం 15:00 గంటలకు రాజమండ్రిలో బయలుదేరి సాయంత్రం 04:40 నిమిషాలకు కాకినాడ పోర్ట్ చేరుకుంటుంది. ఈ సర్వీసులు ఈనెల 27, 28 తేదీల నుంచి ప్రారంభమవుతాయి.

ఆగే స్టేషన్లు…

  • కాకినాడ టౌన్
  • సామర్లకోట
  • మేడపాడు
  • బిక్కవోలు
  • అనపర్తి
  • ద్వారపూడి

ఈ రైళ్లు ప్రధానంగా ఉదయం కాకినాడ నుంచి రాజమండ్రి బయలుదేరి వెళ్లే వారికి, అలాగే రాత్రి వరకూ పనులు ముగించుకుని తిరిగి వచ్చే కార్మికులతో పాటు ఇతరులకు ఎంతో ఉపయోగపడనుంది. ఇక ఈ మెమూ రైలు ప్రారంభం కావడంతో జిల్లాలోని అంతర్గత ప్రాంతాలతో పాటు ప్రధాన నగరాలకు మధ్య అనుసంధానం మరింత పెరగనుంది. ముఖ్యంగా ఆఫీసు వేళలకు అనుగుణంగా ఈ రైలు సమయాలు ఉండటం వల్ల మధ్యతరగతి ప్రయాణికులకు ఇది ఎంతో మేలు చేకూరుస్తుంది.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More