New Trains : రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. తెలంగాణ నుంచి 8 కొత్త రైళ్లు.. ఏ ప్రాంతాలకంటే?

Indian Railway : తెలంగాణవాసులకు భారతీయ రైల్వే గుడ్‌న్యూస్ చెప్పింది. రాష్ట్రం నుంచి 8 కొత్త రైళ్లను ప్రకటించింది. వీటితో ఇతర రాష్ట్రాలకు కనెక్టివిటీ మెరుగుపడనుంది.

Published on: Apr 21, 2026 4:59 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

రైల్వే ప్రయాణికుల సౌకర్యార్థం కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్‌లోని వివిధ స్టేషన్ల నుంచి 8 కొత్త రైళ్లను ప్రకటించింది. కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి చొరవతో వచ్చిన ఈ కొత్తరైళ్లు వీక్లీ ట్రైన్స్‌గా ప్రయాణికులకు సేవలందిచనున్నాయి. హైదరాబాద్ నుంచి తిరుపతి, తిరుచానూరు(ఆంధ్రప్రదేశ్), శ్రీ గంగానగర్, జైపూర్ (రాజస్థాన్), భువనేశ్వర్ (ఒడిశా)లకు రెగ్యులర్ ట్రైన్స్ నడపాలని డిమాండ్లు వచ్చాయి. ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఈ విషయంపై రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్‌తో చర్చించారు.

భారతీయ రైల్వే
భారతీయ రైల్వే

దీంతో హైదరాబాద్ నగరంలోని కాచిగూడ, చర్లపల్లి, నాంపల్లి స్టేషన్ల నుంచి కొత్త రైళ్లను నడపాలని రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. తిరుపతి, తిరుచానూరు వంటి పుణ్యక్షేత్రాలకు వెళ్లే భక్తులకోసం 5 రైళ్లు కొత్తగా అందుబాటులోకి వస్తాయి. అంతేకాదు భువనేశ్వర్, జైపూర్, శ్రీగంగానగర్ వంటి సుదూరప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు కూడా ఉపయోగకరంగా ఉండనుంది.

కొత్త రైలు సర్వీసులు

  • 17607/17608 నెంబరుతో కాచిగూడ నుంచి ప్రతి గురువారం రాత్రి 9.30కు తిరుచానూరు (ఆంధ్రప్రదేశ్) వెళ్లే వీక్లీ స్పెషల్ ట్రైన్ 15 మే, 2026 నుంచి ప్రారంభం కానుంది.
  • 17601/17602 నెంబరుతో కాచిగూడ నుంచి ప్రతి శనివారం రాత్రి 10 గంటలకు శ్రీ గంగానగర్ (రాజస్థాన్) వెళ్లే వీక్లీ స్పెషల్ ట్రైన్ 14 జూలై, 2026 నుంచి ప్రారంభం కానుంది.
  • 17047/17048 నెంబరుతో చర్లపల్లి నుంచి ప్రతి బుధవారం సాయంత్రం 6.55 గంటలకు తిరుచానూరు వెళ్లే వీక్లీ స్పెషల్ ట్రైన్ 7 మే, 2026 నుంచి స్టార్ట్ అవ్వనుంది.
  • 17441/17442 నెంబరుతో చర్లపల్లి నుంచి ప్రతి బుధవారం రాత్రి 9.20 గంటలకు తిరుపతి వెళ్లే వీక్లీ స్పెషల్ ట్రైన్ 14 మే, 2026 నుంచి ప్రారంభం కానుంది.
  • 17443/17444 నెంబరుతో చర్లపల్లి నుంచి ప్రతి శుక్రవారం సాయంత్రం 4.20 గంటలకు తిరుపతి వెళ్లే.. వీక్లీ స్పెషల్ ట్రైన్ 15మే, 2026 నుంచి ప్రారంభం అవుతుంది.
  • 17059/17060 నెంబరుతో ప్రతి ఆదివారం రాత్రి 9.15 గంటలకు చర్లపల్లి నుంచి తిరుచానూరు వెళ్లే.. వీక్లీ స్పెషల్ ట్రైన్ 11 మే, 2026 నుంచి మెుదలవుతుంది.
  • 17067/17068 నెంబరుతో ప్రతి సోమవారం సాయంత్రం 6.10 నిమిషాలకు చర్లపల్లి నుంచి భువనేశ్వర్ (ఒడిశా) వెళ్లే వీక్లీ స్పెషల్ ట్రైన్.. 5 మే, 2026 నుంచి ప్రారంభిస్తారు.
  • 17079/17080 నెంబరుతో ప్రతి శుక్రవారం రాత్రి 7.50 గంటలకు నాంపల్లి నుంచి జైపూర్ (రాజస్థాన్) వెళ్లే వీక్లీ స్పెషల్ ట్రైన్ కూడా త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ రైలు ప్రారంభ తేదీని దక్షిణ మధ్య రైల్వే త్వరలోనే ప్రకటిస్తుంది.
  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More