Allu Arjun: అల్లు అర్జున్ హైదరాబాద్ వదిలి ముంబైకి మకాం మారుస్తున్నాడా? అల్లు అరవింద్ ఏమన్నాడంటే?

Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన మకాంను హైదరాబాద్ నుంచి ముంబైకి మారుస్తున్నారంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ స్పందించారు. అసలు నిజమేంటో ఆయన మాటల్లోనే చూడండి.

Published on: Apr 21, 2026, 14:19:24 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Allu Arjun: నేషనల్ స్టార్‌గా ఎదిగిన తర్వాత ఏ హీరోకైనా బాలీవుడ్ నుంచి పిలుపు రావడం సహజం. ప్రస్తుతం టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోగా ఉన్న అల్లు అర్జున్ విషయంలోనూ గత కొద్దిరోజులుగా ఒక ఆసక్తికర చర్చ జరుగుతోంది. 'పుష్ప' సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న బన్నీ.. ఇకపై ముంబైలోనే సెటిల్ కాబోతున్నారన్నది ఆ ప్రచారం సారాంశం. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అల్లు అరవింద్ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు.

Allu Arjun: అల్లు అర్జున్ హైదరాబాద్ వదిలి ముంబైకి మకాం మారుస్తున్నాడా? అల్లు అరవింద్ ఏమన్నాడంటే?
Allu Arjun: అల్లు అర్జున్ హైదరాబాద్ వదిలి ముంబైకి మకాం మారుస్తున్నాడా? అల్లు అరవింద్ ఏమన్నాడంటే?

అలాంటిదేమీ లేదన్న అల్లు అరవిండ్

అల్లు అర్జున్ ముంబైకి షిఫ్ట్ అవుతున్నారా.. అన్న ప్రశ్నకు అల్లు అరవింద్ స్పందిస్తూ.. "బాలీవుడ్ ప్రాజెక్టుల కోసం లేదా ఇతర పనుల మీద ఎక్కువగా ముంబై వెళ్లడం వల్ల అలా అనిపించి ఉండొచ్చు. అయితే పూర్తిగా హైదరాబాద్ వదిలేసి ముంబైకి వెళ్లిపోతారనే వార్తల్లో ఎలాంటి నిజం లేదు. అర్జున్ మనసు ఎప్పుడూ హైదరాబాద్ చుట్టూనే తిరుగుతుంది. అతనికి స్నేహితులందరూ ఇక్కడే ఉన్నారు. అలాంటప్పుడు ఇవన్నీ వదిలేసి ముంబై ఎందుకు వెళ్తాడు" అని అల్లు అరవింద్ అన్నాడు. అయితే అల్లు అర్జున్ ముంబైలో ఓ ఇల్లు అద్దెకు తీసుకున్నాడట. తరచూ ముంబై వెళ్లడం వల్ల అక్కడ ఉండటానికి వీలుగా తాత్కాలికంగా ఈ ఏర్పాటు చేసుకున్నట్లు తెలుస్తోంది.

ముంబై మకాం వెనుక అసలు కారణం ఇదేనా?

సాధారణంగా టాలీవుడ్ హీరోలు బాలీవుడ్ మార్కెట్‌ను టార్గెట్ చేసినప్పుడు ముంబైలో ఆఫీసులను లేదా నివాసాలను ఏర్పాటు చేసుకుంటుంటారు. గతంలో మహేష్ బాబు, రామ్ చరణ్ వంటి హీరోలు కూడా అక్కడ ప్రాపర్టీలు కొన్న సందర్భాలు ఉన్నాయి.

బన్నీకి ప్రస్తుతం నార్త్ ఇండియాలో భారీ క్రేజ్ ఉంది. అట్లీ వంటి స్టార్ డైరెక్టర్లతో సినిమా తీస్తున్న నేపథ్యంలో.. కథా చర్చల కోసం ముంబై వెళ్లడం బన్నీకి కామన్ గా మారింది. అంతేకాదు రాబోయే రాకా మూవీ కోసం కూడా ఎక్కువగా ముంబైలోనే ఉండాల్సి రానుంది. అందుకే ఈ ప్రచారం ఊపందుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)

1. అల్లు అర్జున్ ముంబైలో ఇల్లు కొన్నారా?

లేదు.. అల్లు అర్జున్ ముంబైలో ఇల్లు కొనలేదు. కానీ ఓ ఇల్లు అద్దెకు తీసుకున్నట్లు సమాచారం.

2. బన్నీ ఇకపై బాలీవుడ్ సినిమాలే చేస్తారా?

లేదు. బన్నీ ప్రధానంగా టాలీవుడ్ హీరో అయినప్పటికీ, ఆయన చేసేవన్నీ పాన్ ఇండియా సినిమాలు. కాబట్టి హిందీ ప్రాజెక్టులు కూడా లైన్‌లో ఉన్నాయి.

3. అల్లు అర్జున్ రాకా మూవీ విశేషాలు ఏంటి?

అట్లీ కుమార్ డైరెక్ట్ చేస్తున్న రాకా మూవీలో దీపికా పదుకోన్ లీడ్ రోల్లో నటిస్తోంది. ఈ సినిమా నుంచి ఈ మధ్యే వచ్చిన ఫస్ట్ లుక్, టైటిల్ అనౌన్స్‌మెంట్ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More